అభిజిత్ ఎంత తెలివిగా బిగ్‌బాస్ గేమ్ ఆడుతున్నా సరే… తనకు వరుస నామినేషన్లు, షాకులు ఎలాగూ తప్పడం లేదు… తన మైండ్ గేమ్‌తో ఫినాలేలోకి దూసుకుపోయే మొదటి కంటెస్టెంటు అనుకున్నారు అందరూ… కానీ షాక్ తగిలింది… షాక్ అంటే మరీ షాక్ అని కాదు… పార్ట్ ఆఫ్ ది గేమ్… తనకు మొదటి నుంచీ మోనాల్ లవ్వు దగ్గర్నుంచి ప్రతి దగ్గరా ప్రత్యర్థిగా ఉంటున్న అఖిల్ నుంచి ఈ షాక్… ఏమిటంటే..? అఖిల్ ఇక ఎలిమినేషన్లు గట్రా ఏమీ లేకుండా… నేరుగా ఫినాలేలోకి దూసుకుపోయాడు…
మరి నిన్న జరిగిన నామినేషన్ల ప్రక్రియకు అర్థం ఏమిటీ అనడక్కండి… బిగ్‌బాస్ గేమ్‌లో అలాంటి లాజిక్కులు పనిచేయవు… అది తెలుగు టీవీ సీరియళ్లలోలాగా లాజిక్ ఏమాత్రం లేని ఒక మైండ్ లెస్ ఆట అంతే…
Ads
విషయం ఏమిటంటే…? ఫినాలేకు నేరుగా వెళ్లిపోవడానికి వీలుగా బిగ్‌బాస్ ఓ టాస్కు పెట్టాడు తెలుసు కదా… ఆవు నుంచి పాలు పితుక్కోవడం… అందులో సొహెల్, అఖిల్ కలిసి పరస్పర సహకారంతో ఆడి మొత్తానికి సెకండ్ రౌండ్లోకి అడుగు పెట్టారు… వాళ్లతోపాటు హారిక, అభిజిత్ కూడా సెకండ్ రౌండ్లోకి వచ్చారు… పనికిరాని ఆక్రోశం, ఫౌల్ గేమ్‌తో అవినాష్… టైం కలిసిరాక అరియానా, మోనాల్ ఆ రౌండ్లో ఓడిపోయారు… ఇక మిగిలింది నలుగురు…
బయటి నుంచి పూలు విసిరేస్తాం, ఎవరికి ఎక్కువ దొరికితే వాడు తోపు అన్నాడు బిగ్‌బాస్… అంటే, ఎవరెక్కువ ఏరుకోగలిగితే, పట్టుకోగలిగితే వాడే ఫినాలేలోకి నేరుగా ప్రవేశిస్తాడు… అదీ టాస్క్… ఆ నలుగురూ తిప్పలు పడ్డారు… ఒకవైపు హారిక, సొహెల్ మాటలతో తన్నుకుంటూ ఉంటే… అభిజిత్, అఖిల్ ఆ పూల వేటలో బాగా తన్లాడారు… కష్టపడ్డారు…
చివరకు మరో రెండు రౌండ్ల తర్వాత అఖిల్ విజేత అయ్యాడు… అంటే ఇక ఏ అడ్డంకుల ’బాధ’రబందీ లేకుండా ఫినాలేలోకి… అంటే టాప్ ఫైవ్‌లోకి అడుగుపెట్టేశాడు… ఇప్పుడు అసలైన మజా… అసలే అఖిల్, ఆపై సొహెల్… ఇప్పుడు అభిజిత్‌కు రియల్ పరీక్ష… ఎవరి ఆట వాళ్లు ఆడాల్సిందే ఇక… గ్రూపులు, దోస్తానాలు, ప్రేమలు గట్రా జాన్తా నై… ప్రస్తుతానికి ఇదీ సమాచారం… తరువాత కలుద్దాం…
Share this Article