Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్మి-సుధీర్‌కు పడట్లేదు… ఆ ప్రోగ్రాం నుంచీ కత్తెర… ఢీలో అఖిల్‌కు జోడీ మోనాల్..!

December 13, 2021 by M S R

ఒకరు కాకపోతే మరొకరు… వ్యవస్థలు, సంస్థలు ముఖ్యం కానీ, వ్యక్తులు కాదు కదా…. ఈటీవీ నుంచి సుధీర్‌ను వెళ్లగొట్టి ఉండవచ్చుగాక… వెంటనే జీటీవీవాడో, మాటీవీ వాడో పట్టుకోకపోవచ్చుగాక… ప్రస్తుతం రష్మి, సుధీర్ సంబంధాలు కూడా బాగాలేవు… అంతేనా..? సుధీర్ ఒకప్పటి క్లోజ్ దోస్త్ విష్ణుప్రియతో అస్సలే సంబంధాలు బాగాలేవు… శ్రీముఖి అయితే అగ్గి ఫైర్… ఈ స్థితిలో ఆ ఎక్సట్రా జబర్దస్త్ కూడా ఎన్నాళ్లో చెప్పలేం… శ్రీదేవి డ్రామా కంపెనీకి ప్రస్తుత బిగ్‌బాస్ విన్నర్‌గా చెప్పబడుతున్న (ఆల్ రెడీ ఫిక్సయిపోయిందట యవ్వారం…) సన్నీ హోస్టుగా రాబోతున్నాడు, తనకు మాటీవీతో ముందస్తు ‘బందీ ఒప్పందాలు’ ఏమీ లేవని చెబుతున్నారు… గతంలో కూడా ఆ ప్రోగ్రాంకు హోస్టుగా చేశాడట కదా… మరి వాట్ నెక్స్ట్..?

monal akhil

ఆల్‌రెడీ ఢీ షోలోకి అఖిల్ సార్థక్ వచ్చేశాడు, అందులో జూనియర్స్ టీంకు మెంటార్ అట… ఇక సీనియర్స్, జోడీ, గ్రూప్ కేటగిరీలు ఉన్నట్టున్నాయి… కానీ అక్కడ ఎవరూ నిజమైన మెంటార్స్ కాదు, అంతా ప్రేక్షకుల చెవుల్లో పెట్టే పువ్వులు… డాన్సుల నడుమ కామెడీ బిట్స్ చేస్తుంటారు… వాటిల్లో గతంలో అయితే సుధీర్, రష్మి జంట ఇరగదీసేది… వాళ్ల కెమిస్ట్రీ అద్భుతంగా రాణించేది… పైగా ఇద్దరూ మంచి డాన్సర్లు… బాగా కనెక్టయిపోయేవాళ్లు… హబ్బ, ప్రేక్షకులతోనే లెండి… పైగా రష్మి, సుధీర్ టైమింగ్ భలే కుదిరేది… కానీ సమస్యలు ఏవయితేనేం ఢీ నుంచి సుధీర్ బయటికి పంపించేయబడ్డాడు… రష్మి కూడా… మరి..?

Ads

బిగ్‌బాస్‌లో ఇప్పుడు సిరి, షణ్ముఖ్ ఉన్నంత క్లోజుగానే గత సీజన్‌లో అఖిల్, మోనాల్ ఉండేవాళ్లు… అత్యంత బాగా సన్నిహితంగా… ఇప్పుడు సిరి బాత్రూంలోకి వెళ్లి తలకొట్టుకున్నట్టే, మోనాల కూడా అప్పుడప్పుడూ శోకాలు పెట్టేది… నా అఖిల్ నా అఖిల్ అని కలవరించేది, పలవరించేది… అంత క్లోజ్ అన్నమాట… ఇప్పుడు ఆ జంటను సుధీర్-రష్మిల జంటకు ప్రత్యామ్నాయంగా ఈటీవీ, మల్లెమాల ఆలోచిస్తున్నారట… అఖిల్ వచ్చేశాడు గానీ మోనాల్ ఇంకా రాలేదు… (ఆమధ్య మాటీవీ వాడి డాన్స్ షోలో జడ్జిగా చేసినట్టుంది కదా…).. ఇక ఇటు వస్తుందేమో… పెద్దగా పనేముంది గనుక..?! పైగా బాగా ప్రూవైన జంట, ప్రేక్షకులకు అలవాటైన జంట… కాకపోతే ఆమెకు కాస్తో కూస్తో నాలుగు స్టెప్పులు వేయడం వచ్చు, ఎక్స్‌పోజింగ్ చేయగలదు… కానీ అఖిల్ డాన్సుల్లో ఏమిటో చూడాలిక… వీళ్ల దెబ్బకు హైపర్ ఆది అర్జెంటుగా తనూ ఓ జోడీ చూసుకోవాలేమో…

rashmi sudheer

ఇదుగో ఇలాగే ఉంటయ్ టీవీల్లో షోల యవ్వారాలు… ఒక్కసారి జబర్దస్త్ తరచి చూడండి… ఇమ్ము-వర్ష మొదట్లో జంట… కానీ ఇప్పుడు వర్షకు బుల్లెట్ భాస్కర్‌కు అంటగట్టారు… మంచి టైమింగ్ ఉన్న రాకేష్, రోహిణి ఒక జంట… అజర్, రీతూ చౌదరి ఒక జంట… ఇమ్మూ, ఫైమా ఒక జంట… ఇప్పుడు ఇదొక ట్రెండ్… రోహిణి, ఫైమా టాప్… భలే టైమింగ్… రీతూ స్కిట్‌లో ఇన్వాల్వ్ కాలేదు, మధ్యలోనే నవ్వేస్తుంది, ఇలాగైతే నాలుగు రోజులు ఉండలేదు… (అఫ్ కోర్స్, వర్ష, రీతూలకు సీరియళ్లలో మంచి చాన్సులే వస్తున్నయ్…) జబర్దస్త్ టీం ముఖ్యులకు వర్ష సన్నిహితురాలు కాబట్టి వర్ష ఎలా చేసినా పెద్దగా ఢోకా లేదు… కొంపదీసి ఢీ షోలో కూడా హైపర్ ఆదికి జతగా ఎంపిక చేస్తారేమో… చెప్పలేం… అంతా మాయ… ఈటీవీ నుంచి ఇక మెల్లిమెల్లిగా సుధీర్ నిష్క్రమణకు బాటలు వేస్తున్న పరిణామాలివి అనుకోవాలేమో…!! ఇవన్నీ సరే గానీ, ఆ ప్రదీప్‌కు ఎవరినైనా చూడండర్రా…!!! చెప్పనే లేదు కదూ… సుధీర్‌ను వచ్చే కొత్త సంవత్సరం సందర్భంగా ప్రసారం చేయబోయే ప్రత్యేక ప్రోగ్రాం ‘పెళ్లాం వద్దు- పార్టీ ముద్దు’ నుంచి కూడా కట్ చేసి పారేశారు… ఈటీవీ గేట్లు బయటికి తెరిచారు సుధీర్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions