ఆమధ్య కరోనా వేక్సిన్ మీద స్పందిస్తూ… అది బీజేపీ వేక్సిన్, కాషాయ వేక్సిన్, అది వేసుకుంటే మగతనం పోవచ్చు, ఇంకేమైనా జరగొచ్చు, నేనయితే వేసుకోను, నేను అధికారంలోకి వచ్చాక అందరికీ మంచి వేక్సిన్ ఫ్రీగా వేయిస్తా….. వంటి పిచ్చికూతలు కూసిన లీడర్ గుర్తున్నాడు కదా… ఎస్, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనాయకుడు అఖిలేషుడు… ఆ స్పందన చదివాక… ఈ ములాయం వారసుడు సీఎంగా అంత పెద్ద రాష్ట్రాన్ని ఎలా పాలించాడుర భయ్ అని చాలామంది ఈసడించుకున్నారు… దానికి తను అర్హుడే… బహుశా ఆయన గ్రేట్ రూలింగ్ చూశాకే బీజేపీకి అంత పెద్ద మెజారిటీని ఇచ్చి ఉంటారు ఉత్తరప్రదేశంలో… ఏదో తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేసి ఉంటాడు వేక్సిన్పై అనే మినహాయింపులేమీ అక్కర్లేదు సారు గారికి… తన బుర్రలో ఏదో చిప్ కొట్టేసినట్టుంది… అందుకే మళ్లీ తాజాగా ఓ పిచ్చికూత… ఇదుగో ఇదీ…
भारतीय क्रिकेट टीम को आस्ट्रेलिया में टेस्ट सीरीज़ जीतने पर हार्दिक बधाई।
सपा की सरकार आने पर ‘टेनिस क्रिकेट’ को मान्यता दी जाएगी।#TennisCricket
— Akhilesh Yadav (@yadavakhilesh) January 19, 2021
ఆస్ట్రేలియాపై ఇండియా అనూహ్య విజయం సాధించింది తెలుసు కదా… దేశమంతా ప్రశంసిస్తోంది మన పిల్లలను… ఈ హీరో కూడా ఓ ట్వీట్ వదిలాడు… ఇండియా జట్టుకు హార్ధిక అభినందనలు అంటూనే సమాజ్‌వాదీ సర్కారు రాగానే టెన్నిస్ క్రికెట్‌కు మంచి గుర్తింపు ఇవ్వబడుతుంది అన్నాడు… ఏమో అనుకున్నాం గానీ, దేశంలో చాలామంది చంద్రబాబులున్నారు… ఆయన కూడా అప్పుడప్పుడూ అది నేనే, ఇది నేనే, అది కనిపెట్టింది నేనే, ప్రతి ఇంటికీ ఏసీ సప్లయ్ చేస్తా, ఊరంతా ఉష్ణోగ్రతలు తగ్గిస్తా వంటి చాలా వింతవింత వ్యాఖ్యలు చేసేవాడు కదా… అసలే క్రికెట్ జట్టు గెలిచిన ఆనందంలో ఉన్న మన క్రికెట్ అభిమానులకు అఖిలేషుడి ట్వీట్ చూసి మండిపోయింది… ఇక ఆడుకున్నారు… ఉదాహరణకు…
Ads
#TennisCricket pic.twitter.com/7B8PmZRfgu
— The Lying Lama 2.0 (@KyaUkhaadLega) January 19, 2021
ఒకతను ట్వీట్ పెడతాడు ఏమనీ అంటే… క్రికెట్ ఆడే పాకిస్థానీ షోయబ్, టెన్నిస్ ఆడే ఇండియన్ సానియా కలిస్తే టెన్నిస్ క్రికెటా అని ప్రశ్నిస్తాడు… ఓ ఫోటో పెడతాడు… మరొకతను వ్యంగ్యంగా… టెన్నిస్ క్రికెట్ అంటే టెన్నిస్ కోర్టులో క్రికెట్ బ్యాటుతో ఆడే ఆటా..? లేక క్రికెట్ స్టేడియంలో టెన్నిస్ రాకెట్‌తో ఆడే ఆటా..? అని ప్రశ్నిస్తాడు… పనిలోపనిగా రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్‌కు అఖిలేష్ ట్విట్టర్ అకౌంట్ పేరడీలాగా ఉందని జోకేశాడు… ఇంకొకాయన ఏకంగా ఓ ఫోటోనే పెట్టేసి మరో చెణుకు విసిరాడు…
https://twitter.com/muditparashari3/status/1351524449003061250
ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ ఆష్లీగ్ బార్టీ క్రికెట్ బ్యాటుతో తన ఫేవరెట్ ఫోర్‌హ్యాండ్ వాలీస్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను కూడా పెట్టాడు… అప్పుడే టెన్నిస్ క్రికెట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు ఈయన… ఇంకేముంది..? వచ్చే ఆస్ట్రేలియన్ ఎన్నికల్లో సమాజవాదీ పార్టీ టికెట్టు మీద పోటీచేస్తాడు అని వెక్కిరించాడు… ఇలా బోలెడన్ని వెటకారాలు, చెణుకులు పడ్డయ్ ఆ ట్వీట్ మీద… ట్రోలింగ్… నిజంగానే మనల్ని నడిపించేది ఇదుగో, ఇలాంటి పావు మెదడు మాత్రమే ఉన్న నాయకులా అని సందేహాలు కలుగుతుంటయ్ అప్పుడప్పుడు… మన సందేహాలను గౌరవించి, వాటిని ఇంకా ఇంకా పెంచుతూనే ఉంటారు ఇలాంటి నాయకులు… అసలే బీజేపీ ఎంపీలు, మంత్రులు, నాయకులు కొందరి వ్యాఖ్యలు, ప్రకటనలతోనే ప్రజల మెదళ్లు సలసల ఉడికిపోతుంటే… ప్రతిపక్ష నాయకులు కూడా తామేమీ తక్కువ కాదన్నట్టు పోటీపడుతున్నారు…! అవునూ, కబడ్డీ క్రికెట్, ఖోఖో క్రికెట్, ఫుట్‌బాల్ క్రికెట్ అని ఎవరూ ట్వీటలేదు కదా…!! అఖిలేషుడు తన ట్వీట్ డిలిట్ కొట్టేసి తూచ్ అంటాడేమో… ఇదుగో స్క్రీన్ షాట్….
Share this Article