రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు… చావు కోరే శత్రువులు కాదు… పోరాటాలు సిద్ధాంతాల మీద, పార్టీల వైఖరుల మీద ఉంటాయి… మనుషుల ఆయుష్షు మీద కాదు… అందుకే వేర్వేరు పార్టీల్లో ఉన్న నాయకులైనా సరే, ఏ సందర్భంలోనైనా కలిస్తే మామూలు పరిచయస్తుల్లాగే మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటారు… వాళ్ల ఇళ్లల్లో ఫంక్షన్లకూ వెళ్తారు… అవి మానవ సంబంధాలు… అంతేతప్ప వాడు చావాల్సిందే, చచ్చిపోతే బాగుండు, ఇంకా చావలేదా వంటి వ్యాఖ్యల జోలికి పోరు… పోతే, అంతటి అవాంఛనీయ రాజకీయం మరొకటి ఉండదు… ఈ దేశప్రజల దురదృష్టం కొద్దీ అఖిలేష్ అనే ఓ మూర్ఖ నాయకుడు దొరికాడు… గతంలో ముఖ్యమంత్రిగా చేసినా సరే, రాజకీయ పరిపక్వత రాలేదు… రాదేమో బహుశా… అసలే ఆజంఖాన్ పార్టీ అది… ఆ పార్టీ నుంచి, ఆ లీడర్ల నుంచి, ఆ బాస్ నుంచి అంతకుమించి ఇంకేం ఆలోచించలేం…
రీసెంటుగా మనం స్టాలిన్‌ను చూస్తున్నాం… తను అధికారంలోకి వచ్చాక డీఎంకే, అన్నాడీఎంకే పాలిపగలు మొత్తం పోయినట్టే కనిపిస్తున్నయ్… తన వైఖరి దిగువ స్థాయి కార్యకర్తలకు కరెక్టు సంకేతాల్ని ఇచ్చింది… అందుకే ఏ ఊళ్లోనూ ఆ కక్షలు, కోపాలు కనిపించడం లేదు… పళనిస్వామి ఇంట్లో ఏదో అశుభం చోటుచేసుకుంటే అందరికన్నా ముందు వెళ్లింది స్టాలిన్… ఒక సిద్ధరామయ్య హాస్పిటల్‌లో పడి ఉంటే యెడ్యూరప్ప వెళ్లి పరామర్శిస్తాడు… అరె, అంతెందుకు..? రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, మితృత్వాలే ఉండవు కదా… హార్డ్ కోర్ యాంటీ-బీజేపీ పార్టీ పీడీపీ అదే బీజేపీతో కలిసి అధికారం పంచుకోలేదా..? బోలెడన్ని ఉదాహరణలు… గతంలో రాజీవ్‌గాంధీ వాజపేయిను ఓ పని మీద అమెరికా పంపించాడు, కానీ అసలు కారణం, అక్కడ చికిత్స కోసం… పీవీ నరసింహారావు అడగ్గానే ఓ బాధ్యతను తనపై వేసుకుని వాజపేయి ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌లో ఉతికి ఆరేశాడు… అది రాజనీతిజ్ఞత… ఇప్పుడు ఇదెందుకు చెప్పుకోవడం అంటే… తెలుగు రాష్ట్రాల్లోని రండ, బోసిడికే బాపతు ‘మహాఘన స్థాయి’ వ్యాఖ్యల గురించి కాదు… అఖిలేష్ తన గల్లీ రౌడీ గుణాన్ని బయటపెట్టుకుంటున్న తీరు గురించి…
Ads
మోడీ వారణాసి వెళ్లాడు, కారిడార్ డెవలప్ చేశాడు… అఖిలేష్ వంటి నేతలు జన్మంతా తపస్సు చేసినా సరే, కాశికి ఆ పూర్వకళ తీసుకురాలేరు, ఆలోచించలేరు, లేదు… కానీ అఖిలేష్ ఏమన్నాడు..? ‘‘ఇక మోడీకి ఆఖరి రోజులే కదా, ఎవరైనా కాశికి వచ్చేది అంతిమ రోజుల్లోనే కదా…’’ ఇంత ఇడియాటిక్ వ్యాఖ్యల్ని ఈమధ్య వినలేదు… మోడీ అంటే వ్యతిరేకత ఉండొద్దని ఎవరూ అనరు… నోట్ల రద్దు నుంచి పెట్రో ధరల భగభగల వరకు మోడీని సగటుజనం కూడా బోలెడుసార్లు తిట్టుకుంటున్నారు… విపక్ష పార్టీలు కస్సుమంటున్నయ్… అవసరమే, ఆయనేమీ జనరంజకుడు కాదు, కానీ భిన్న రాజకీయ శక్తుల సమపోరాటమే కదా ప్రజాస్వామ్యానికి సరైన రక్ష… ఇప్పుడు అది లేకపోవడమే కదా దేశానికి నష్టదాయకం… కానీ కనిపిస్తున్న వాళ్లేమో ఇదుగో ఈ గల్లీ రౌడీలు… కాశి బాగుపడుతుంటే అఖిలేషుడికి భగభగ మండిపోతున్నట్టుంది…
ఐనా మోడీ వారణాసికి రావడం కొత్తేమీ కాదు కదా… తను ప్రధాని మాత్రమే కాదు, అక్కడి ఎంపీ… నిజానికి కాశి ఒకరకంగా పునర్నిర్మాణం పొందింది… అది సగటు హిందువు ఖచ్చితంగా ఆనందించే అంశమే… అవన్నీ ఎలా ఉన్నా సరే.., వీలయితే ఈసారి ఏకంగా ప్రధాని సీటుకే ఎసరు పెట్టాలని భావిస్తున్న అఖిలేష్ వంటి నేతల అసలు తత్వాల్ని, వ్యక్తిత్వాల్ని ఇదుగో ఇలాంటి మాటలు, విమర్శలే బయటపెడుతుంటయ్… ఐనా హుందాతనం, వ్యక్తిత్వ ప్రభ అనేవి పుట్టుకతో రావాలంటారు… ఎదిగేకొద్దీ పెరగాలంటారు… పాలక స్థానాల్లోకి వస్తే జాగ్రత్తగా కాపాడుకోవాలంటారు… సర్లెండి… అవేవీ ఇలాంటి లీడర్లకు వర్తించవు… అవునూ, అఖిలేష్ మోడీ అంతిమఘడియల కోసమే వారణాసి వచ్చాడు సరే… తమల్ని కన్న మీ తండ్రి గారి వయస్సెంతోయ్…!! (అధికారంలో అంతిమరోజులు అని మాత్రమే నా వ్యాఖ్యల అసలు ఉద్దేశం అంటూ అదేదో పిచ్చి సమర్థనకు దిగినట్టున్నాడు… ఏదో సినిమాలో బాలయ్య డైలాగ్ గుర్తొచ్చింది… మీ నాన్న బాగున్నాడా అనడానికి, మీ అమ్మామొగుడు బాగున్నాడా అనడానికి తేడా లేదా లక్డీకాపూల్..?)
Share this Article