Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మాజీ డీజీపీ, మాజీ మంత్రి ఇంట్లో ఓ రంకు యవ్వారం… కథేమిటంటే..?!

October 23, 2025 by M S R

.

ప్రియులతో కలిసి భర్తలను రప్పారప్పా చేసేస్తున్న భార్యలు… పిల్లలను సైతం చంపేస్తున్న ఘోరాలు… అక్రమ సంబంధాలు గతంలో లేవని కాదు, కాపురాలు కూలలేదనీ కాదు… కానీ ఇటీవల అవి ఏకంగా నేరస్వభావాన్ని కూడా పెంచేసి, దారుణ హత్యలకూ దారితీస్తున్నాయి…

మామూలు కుటుంబాలలోనే కాదు… హైప్రొఫైల్ కుటుంబాల్లోనూ ఇవే కథలు… ఈ నేరాలు అరికట్టాల్సిన వాళ్లలోనూ… ఒక డీజీపీ ఇంట్లోనూ (మానవ హక్కుల కమిషన్ హెడ్) ఇదే రంకు యవ్వారం ప్లస్ హత్యోదంతం చోటుచేసుకుంటే..? ఇది అదే కథ… నిజమైన కథే…

Ads

మొహమ్మద్ మస్తఫా పంజాబ్ మాజీ డీజీపీ, మానవ హక్కుల కమిషన్ మాజీ డీజీపీ… ఆయన భార్య రజియా సుల్తానా ఎవరో తెలుసా.,? కాంగ్రెస్ నాయకురాలు… గతంలో మూడుసార్లు మలే కోట్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, పంజాబ్ ప్రభుత్వంలో మంత్రిగా చేసింది…

పంచకుల పట్టణంలోని వాళ్ల విలాసవంతమైన నివాసం మానసదేవి కాంప్లెక్సు… ఆ దంపతుల కుమారుడు అకిల్ అఖ్తర్ (35) హఠాత్తుగా అక్టోబరు 16వ తేదీన మరణించాడు… ఏదో వ్యాధి చికిత్స బాపతు మెడిసిన్స్ అధిక మోతాదులో తీసుకున్నాడనీ, అవి వికటించి ప్రాణాలు కోల్పోయాడని ఆ దంపతులు చెప్పారు…

మాజీ పోలీస్ బాస్ కదా… జస్ట్, ఓ సహజమరణం అని రాసేసుకుని, కేసు  క్లోజ్ చేశారు… నో కేస్, నో పోస్ట్ మార్టమ్, నథింగ్… సీన్ కట్ చేస్తే పెద్ద ట్విస్ట్…

అఖ్తర్ గతంలో తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఓ వీడియో అకస్మాత్తుగా వైరల్ కాసాగింది… అందులో తను ఏం చెప్పాడంటే… ‘‘నా పెళ్లానికి స్వయంగా నా తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుంది… ఈ విషయం తెల్సి కూడా నా తల్లి రజియా, నా సోదరి సైతం ఈ దారుణానికే మద్దతు పలికారు… దీంతో తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నా… విషయం బయటకు పాక్కితే రేపిస్ట్, హంతకుడు అని ముద్రవేసి తప్పుడు కేసులో జైలుకు పంపిస్తారు లేదంటే చంపేస్తారు… ఈ విషయంలో నాకు ఎవరైనా సా యం చేయండి. ప్లీజ్ నన్ను కాపాడండి…”

వీళ్లకు పరిచయం ఉన్న పంజాబ్లోని మలేరో కోట్లా పట్టణానికి చెందిన షంషుద్దీన్ కుటుంబం అక్టోబర్ 17న ఈ వీడియో చూపించి, మాకు అఖ్తర్ మరణం మీద సందేహాలున్నాయి… అఖ్తర్ తండ్రి, తల్లి, సోదరి, భార్య కలిసి చంపేసినట్టుంది… దర్యాప్తు చేయాలి అని ఫిర్యాదు చేశారు… దాంతో ఆ కేసు రీఓపెన్ అయ్యింది…

ఒక మాజీ డీజీపీ, పైగా మానవ హక్కుల కమిషన్ మాజీ డీజీపీ… ఓ మాజీ మంత్రి… ఎంత హైప్రొఫైల్ ఫ్యామిలీ అది… అయితేనేం, కోడలితో ఆయన అక్రమ సంబంధం, అది పెళ్లానికీ తెలుసునట… కొడుకును ఫస్ట్ నైట్ నుంచే ఆ పిల్ల దూరం ఉంచుతోందట, అంతేకాదు, అసలు పెళ్లికి ముందునుంచే ఆమెతో ఆ తండ్రికి అక్రమబంధం ఉందట, ఎప్పుడూ అందుబాటులో ఉండటం కోసం కొడుక్కి ఆమెనిచ్చి పెళ్లి చేశారట…

తీరా కొడుకు గోల చేస్తుండటంతో అందరూ కలిసి చంపేశారు… ఇదీ దారుణం… ఇంకా ఆ మాజీ డీజీపీని, ఆ మాజీ మంత్రిని అరెస్టు చేయలేదు… లోతు దర్యాప్తు కోసం ఏకంగా ఓ సిట్ ఏర్పాటు చేశారు… ఇదీ కథ..!

ఇప్పుడు సదరు తండ్రి డీజీపీ గారు ఏం సెలవిస్తున్నారంటే..? ‘మావాడు 18 ఏళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాడు, చండీగఢ్‌లో చికిత్స చేయించినా ఫలితం రాలేదు, డ్రగ్ డోస్ ఎక్కువయ్యే చచ్చిపోయాడు, నన్ను జైలులో పెట్టేందుకు ఈ తప్పుడు కేసు క్రియేట్ చేస్తున్నారు’… నీ మీద కుట్ర చేసేవాళ్లు నీ ఇంట్లోకి వచ్చి నీ కొడుకును చంపారా డీజీపీ..?!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సంక్రాంతి ఎప్పుడు..? ఎందుకు మీమాంస..? మళ్లీ సందిగ్ధత..!!
  • వాటిని గజల్స్ అంటారా..? నీ సారస్వత సేవ ఏమిటి శ్రీనివాసులూ…?
  • వెనెజులా..! ట్రంపుదే కాదు… మన చమురూ ఉంది అక్కడ… తవ్వాలి..!!
  • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!
  • చైల్డ్ ఆర్టిస్టు కాదు… డబుల్ రోల్‌లో మహేశ్ బాబే అసలు హీరో…
  • … ఫాఫం అంబానీ..! కంటెంట్ రైటర్ల పారితోషికాలకూ డబ్బుల్లేవ్..!!
  • తల్లి చెప్పింది… ‘సింహంలా పోరాడు… అంతేగానీ పిరికివాడివై తిరిగిరాకు’
  • రోగ్ ప్లానెట్ కాదు… దుష్ట గ్రహమూ కాదు… అదొక ఒంటరి జర్నీ… అంతే…
  • 1500 కోట్ల పణం..! ప్రేక్షకుడు ఎందుకెక్కువ చెల్లించాలి…? మళ్లీ అదే ప్రశ్న..!!
  • వెనెజులా..! ఇప్పుడు ట్రంపు దాడి… ఎప్పటి నుంచో ‘ఉచితాల’ దాడి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions