Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గాయనిగా జయలలిత తొలిపాట… ఇద్దరు ముఖ్యమంత్రుల సయ్యాట…

March 29, 2024 by M S R

Subramanyam Dogiparthi…. జయలలిత అందంతో పాటు ఆమె శ్రావ్యమైన గాత్రాన్ని కూడా ఆస్వాదించవచ్చు ఈ సినిమాలో…  చల్లచల్లని వెన్నెలాయె మల్లెపూల పానుపాయె అనే పాటను జయలలిత తెలుగులో పాడిన మొదటి పాట ఈ సినిమాలోనిదే… తమిళ , కన్నడ సినిమాలలో కూడా ఆమె పాడారు . తప్పక చూడతగ్గ , వినతగ్గ పాట , ఆ పాటలో ఆమె అభినయం .

పేదరాసి పెద్దమ్మ , కాశీ మజిలీ కధల్లాగా అరేబియన్ నైట్స్ కధలు కూడా మనందరికీ చిన్నప్పుడు చందమామ , బాలమిత్రల ద్వారా సుపరిచితం . ఈ ఆలీబాబా 40 దొంగలు సినిమా కూడా అరేబియన్ నైట్స్ కధల్లోనిదే . బి విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో NTR , జయలలిత , నాగభూషణం , సూర్యకాంతం , హేమలత , సత్యనారాయణ , మిక్కిలినేని , రాజబాబు , రమాప్రభ , అల్లు రామలింగయ్య , రావి కొండలరావు ప్రభృతులు నటించారు .

వంద రోజులు ఆడింది కానీ , NTR- విఠలాచార్య లెవెల్లో ఆడనట్లు గుర్తు నాకు . ఒరిజనల్ కధకు సినిమా కోసం , NTR స్టార్డం కోసం చాలా మార్పులు చేసారు . ఆ మార్పులు బాగానే ఉన్నాయి . NTR నోట్లో వేలు పెట్టుకోవటం వంటివి జనానికి నచ్చలేదు . ఘంటసాల సంగీత దర్శకత్వంలో పాటలు హిట్టయ్యాయి . అల్లా యా అల్లా , చలాకైన చిన్నది బలేబలేగున్నది , నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము , భామలో చందమామలో , మరీ అంతగా బిడియమైతే మనసు ఆగనంటుంది , లేలో దిల్ బహార్ అత్తర్ దునియా మస్తానా , సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు పాటలు హిట్టయ్యాయి . ఈ సిగ్గు సిగ్గు పాట షూటింగ్ అయ్యాక ఎప్పటిలానే జయలలిత ఇంటికెళ్ళి వేడి నీళ్ల కాపు పెట్టించుకొని ఉంటుంది .

Ads

1956 లోనే తమిళంలో MGR , భానుమతిల జోడీలో మోడరన్ థియేటర్స్ బేనర్లో నిర్మితమయింది . మన తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేసారు . బాగానే ఆడింది . ఈ సినిమా కలర్లో ఉంటుంది .

మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . టి విలో కూడా చూసా . యూట్యూబులో ఉంది . కాలక్షేపం సినిమా . జయలలిత పాట కోసం అయినా తప్పక చూడండి . Of course . ఇద్దరి యుగళగీతాలు , డాన్సులూ బాగుంటాయి .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels #telugumovies #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions