ఈటీవీలో వచ్చే ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం చాలామంది చూస్తారు… అప్పుడప్పుడూ కొన్ని నాసిరకం కేరక్టర్లతో పిచ్చాపాటీ చేస్తాడు గానీ ఎక్కువసార్లు పాత తారల్ని మళ్లీ మన ముందుకు తీసుకొస్తాడు… పాత ముచ్చట్లన్నీ కలబోస్తాడు… ఇప్పటితరానికి పెద్ద ఆసక్తి ఉండకపోవచ్చుగాక, నలభై దాటిన సినిమా ప్రేక్షకులకు ఇంట్రస్టింగే… ప్రతి షోలో అతిథిని ఎలాగోలా ఏడిపించి, ఆ ప్రోమో కట్ చేయించే ఓ పిచ్చి స్టయిల్ ఉంది గానీ… మిగతా సంభాషణ కాస్త సరదాగానే ఉంటుంది… స్పాంటేనిటీ కూడా ఎక్కువే తనకు… అంతటి ఆ ఆలీ కూడా ఈసారి ఎపిసోడ్లో స్టక్ అయిపోయాడు… ఒక దశలో ఏం అడగాలో అర్థం కాలేదు తనకు… అతిథి గురించి ఏం చూపించాలో కూడా సమజ్ కాలేదు… ఒకింత నవ్వొచ్చింది…
ఈమె పేరు సుధా చంద్రన్… తెలుగులో అందరికీ మయూరిగానే పరిచయం… కారణం ఏమిటంటే… 35 సంవత్సరాల క్రితం మయూరి అనే సినిమాలో హీరోయిన్ ఆమె… ఈ సినిమా గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం…
Ads
ఇది తెలుగులో బహుశా ఫస్ట్ బయోపిక్… ప్రమాదంలో గాయపడి, మెడికల్ నిర్లక్ష్యం కారణంగా కాలు తీసేయించుకోవల్సి వచ్చిన ఓ నర్తకి, తరువాత జైపూర్ ప్లాస్టిక్ కాలు పెట్టుకుని, సాధన చేసి, మళ్లీ ప్రదర్శనలు ఇస్తుందనేది వార్త… దాన్ని చదివిన రామోజీరావు ఆమెనే కథానాయికగా తీసుకుని, ఆమె కథనే సినిమాగా తీశాడు… అదే మయూరి… (అప్పట్లో ఉషాకిరణ్ మూవీస్ అంటే ఓ ఉత్తమాభిరుచి… తరువాత దాన్ని భ్రష్టుపట్టించారు, అది వేరే సంగతి..) అప్పట్లోనే ఆమెకు లక్షాపాతికవేలు ఇచ్చారు పారితోషికం… ఇప్పటి లెక్కల్లో కోటి రూపాయలుగా భావించాలేమో… మంచి సినిమా…
సింగీతం దానికి దర్శకుడు… బాలసుబ్రహ్మణ్యం ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్… అంతేకాదు, తమిళంలో దీన్ని డబ్బింగ్ చేశాడు తనే… మళయాళంలోకి డబ్ అయ్యింది… తరువాత హిందీలోనూ రీమేక్ చేశారు, అందులోనూ ఆమే హీరోయిన్… ఆమె కథను కొన్ని రాష్ట్రాల పాఠ్యపుస్తకాల్లోనూ పెట్టారు… అదీ ఆమె కథ… అయితే..?
ఆశ్చర్యంగా ఉంటుంది కానీ… అంత సూపర్ హిట్ సినిమా… 35 ఏళ్లుగా ఆమె సినిమాల్లోనూ, టీవీల్లోనూ నటిస్తూనే ఉంది… ఇండస్ట్రీని విడిచిపెట్టలేదు… ప్రత్యేకించి కహీఁ కిసీ రోజ్ సీరియల్లోని రమోలా సికంద్ పాత్ర చాలా ఫేమస్… తరువాత నాగిని… పాపులారిటీ పరంగా ఆమె ఎప్పుడూ డౌన్ కాలేదు… బేసిక్‌గా కేరళ, తమిళనాడు రూట్స్… పుట్టిపెరిగింది ముంబై… పెళ్లి చేసుకుంది పంజాబీ… అరంగేట్రం తెలుగు… యూపీ కనెక్షన్స్ కూడా ఉన్నయ్… పాన్ ఇండియా…
ఇక్కడ చెప్పుకునేది ఏమంటే..? 35 క్రితం చేసిన ఆ ఒక్క మయూరి సినిమా మాత్రమే… అంతే… ఇన్నేళ్లలో తెలుగు సినిమాల్లో ఒక్క చాన్సూ లేదు ఆమెకు… టీవీ సీరియళ్లలోనూ ఆఫర్లు రాలేదు ఆమెకు… ఇదే ఉషాకిరణ్ మూవీస్ కూడా పట్టించుకోలేదు… ఈరోజుకూ..! ఏడేళ్ల క్రితం జెమిని వాళ్లు ఏదో సీరియల్లో తీసుకున్నారు… తరువాత రీసెంటుగా జీటీవీలో నంబర్ వన్ కోడలు సీరియల్లో చేస్తోంది… మయూరి సుధాచంద్రన్ విలనీ చేయడం కాస్త వింతగానే ఉన్నా… ఆమె అంతే…
సరే, ప్రస్తుతానికొద్దాం… ఆమె చేసింది తెలుగులో ఒకే సినిమా… మరి ఆలీ ఏం క్లిప్పింగులు చూపించాలి..? ఆ ఒక్క మయూరి సినిమాలోని పాటలు, సీన్లే చూపిస్తూ పోయాడు… దాంతో ఈ షో మయూరి సినిమాపై చేసిన ప్రోగ్రాంలా మారిపోయింది తప్ప సుధాచంద్రన్ ఎపిసోడ్‌లా అనిపించలేదు… అఫ్ కోర్స్, మయూరి, సుధ ఇద్దరూ ఒక్కటే అయినా సరే…
ఆమె నటించిన ఇతర భాషల క్లిప్పింగులు చూపించలేడు… అలాగని ఏవేవో టీవీల్లో వచ్చినవీ చూపలేడు… చివరకు ఇప్పుడు ఆమె చేస్తున్న నెంబర్ వన్ కోడలు సీరియల్ కూడా జీటీవీ వాళ్లది… కాబట్టి దాన్నీ పెద్దగా ప్రస్తావించలేడు… దీంతో ఎలా కొనసాగించాలో అర్థం గాక… ఆమె చిన్ననాటి ఫోటోలు చూపించి… చివరకు అలవాటైన రీతిలోనే… అవకాశాలు వస్తే ఇప్పుడు కూడా చేస్తారు కదా అనే ఓ రొటీన్ ప్రశ్నవేసి, ఇక అర్ధంతరంగా ఓ పేద్ద దండం పెట్టేశాడు… బహుశా ఈ సంకటం వేరే ఏ సెలెబ్రిటీ విషయంలోనూ ఎదురు కాలేదేమో… హహహ…!!
(ఫోటోలు ఈటీవీ యూట్యూబ్ బిట్స్ నుంచి తీసుకున్నవే… ఈ చివరి ఫోటో తప్ప…)
Share this Article