.
ఒక అమ్మాయి… తండ్రి రైల్వే ఉద్యోగి, సోదరుడు క్రికెట్ ప్లేయర్… ఊరు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, అవధి పుర… రోజూ సోదరుడి నెట్ ప్రాక్టీసుకు తను కూడా వెళ్లేది ఆగ్రాకు.,. చూస్తూ ఉండేది… ఓసారి బాల్ ఈమెకు దగ్గరగా పడింది… గ్రౌండ్‌లోకి విసరమని ప్లేయర్లు అడిగితే ఆమె గురిచూసి స్టంప్స్ వైపు విసిరింది… 50 మీటర్ల దూరం నుంచి పర్‌ఫెక్ట్ థ్రో… స్టంప్స్ పడ్డాయి…
అక్కడ మొదలైంది క్రికెటర్ దీప్తి శర్మ క్రికెట్ జీవితం… ఆమె థ్రో చూసి ముచ్చటపడిన కోచ్ పికప్ చేసింది… క్రికెట్‌లో శిక్షణ ఆరంభమైంది… ఆమె ఇప్పుడు ఈ వుమెన్ వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్… ఈ టోర్నమెంటులో అత్యధిక వికెట్లు… ఆల్‌రౌండ్ ప్రతిభ… ఈ వరల్డ్ కప్ చేజిక్కించుకోవడంలో ఆమెదే కీలకపాత్ర…
Ads
2017 ఫైనల్స్‌లో విజయాన్ని చేజార్చుకున్న టీమ్‌లో కూడా ఉందీమె… విశేషం ఏమిటంటే..? ఒత్తిడిలో కూడా బెటర్ బౌలింగ్, బెటర్ బ్యాటింగ్… ఫీల్డింగు సరేసరి… ఇండియన్ వుమెన్ క్రికెట్‌కు సంబంధించి ఈమెది ఓ అధ్యాయమే…

ఈ వరల్డ్ కప్ విషయానికి వస్తే … 9 మ్యాచుల్లో 5 సార్లు మంచి ఆల్‌రౌండ్ ప్రతిభ… ఆటలో నిలకడ… ఫైనల్స్‌లో ఆమె తన ఉత్తమ ప్రదర్శనను ఇచ్చింది… బ్యాటింగ్‌లో 58 బంతుల్లో 58 పరుగులు చేసింది, తర్వాత బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కకావికలం చేస్తూ 5 ఓవర్లలో కేవలం 39 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది… గెలుపులో కీలకపాత్ర ఈ పరుగులు, ఈ వికెట్లు…
తొలి దశలోనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 124/6తో కష్టాల్లో ఉన్నప్పుడు, 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి, ఓపికతో 53 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టు స్కోరును 269కి చేర్చింది… ఆ తర్వాత బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేస్తూ 3/54తో రాణించింది…
పాకిస్థాన్‌తో జరిగిన 25 పరుగులు చేసి, బౌలింగ్‌లో 3/45తో జట్టు విజయాన్ని సులభతరం చేసింది… బలమైన ఇంగ్లండ్ జట్టుపై ఏకంగా 50 బంతుల్లో 50 పరుగులు చేసి, ఆ తర్వాత బంతితోనూ 4/50తో ఆ జట్టు వెన్ను విరిచింది…
కఠినమైన ఆస్ట్రేలియాపై సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో, నెం.5 స్థానంలో వచ్చి, 24 పరుగులు చేసి, 2 వికెట్లు తీసి తన వంతు సహకారం అందించింది… వెరసి ఆమెను వుమెన్ క్రికెట్‌లో ఉన్నత స్థాయి ఆల్‌రౌండర్‌గా నిలిపాయి ఈ గణాంకాలు…
ఈ టోర్నమెంటులో ఆమె క్రెడిట్ 215 పరుగులు, 21 వికెట్లు… మొత్తం ఆమె వన్డే కెరీర్ గణాంకాలు కూడా బాగున్నాయి…
పరుగులు 2739 , సగటు 37
వికెట్లు 162 , సగటు 27.7
ఎకానమీ: 4.38 మాత్రమే
బౌలింగ్ స్ట్రైక్ రేట్ ప్రతి 38 బంతులకు ఒక వికెట్…
ఎస్, టీమ్ సమిష్టి కృషితోనే ఏ విజయమైనా దక్కేది… కానీ అన్ని విజయాల్లోనూ అంకితభావం, నైపుణ్యం చూపించే దీప్తి శర్మలకు అదనపు ప్రత్యేక చప్పట్లు దక్కాలి… దీప్తి శర్మ దానికి అర్హురాలు..!!

…. ఈమె స్వస్థలం అవధ్ పురి గ్రామంలోకి ప్రవేశించగానే ఒక వీధి కనబడుతుంది… దాని పేరు ‘ Arjuna Awardee Cricketer Deepti Dharma Marg’ …. ఆ ఊరికి ఆమె పేరే ల్యాండ్ మార్క్…. ఇప్పుడు ఆ ఊరినే దీప్తి పురి అనాలేమో..!!
Share this Article