‘‘ఒక సైంటిఫిక్ ప్రపంచం… మానవాళికి ఓ పెద్ద విపత్తు సంభవిస్తుంది… మహాభారతం నుంచి కర్ణుడిని ఎత్తుకొస్తారు… భూమండలాన్ని రక్షిస్తారు… అదే ప్రాజెక్ట్ కే… అంటే కర్ణ…’’ ఇదీ ఆ సినిమా కథ అట… ఒకవైపు అమితాబ్ బచ్చన్, మరోవైపు కమల్ హాసన్… హీరో ప్రభాస్, హీరోయిన్ దీపిక పడుకోన్… దిశా పటాని… సూర్య కూడా అంటున్నారు గానీ డౌట్ ఫుల్… దేశం యావత్తూ అభిమానించే ఈ అతిరథ తారాగణం కొలువు తీరే సినిమా అంటే ఏమేరకు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో చెప్పనక్కర్లేదు…
పైగా ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకూ పెట్టనంత ఖర్చు పెడుతున్నాడట అశ్వినీదత్… ఒకరకంగా తన యావదాస్తినీ, సర్వాన్ని పణంగా పెట్టబోతున్నాడు… భారీ సినిమాల్ని డీల్ చేసిన అనుభవం లేకపోవచ్చుగాక కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ మీద అందరికీ నమ్మకమైతే ఉంది… ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ మీద కూడా అసాధారణ అంకెలు వినిపిస్తున్నాయి… ప్రభాస్ సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాపయినా సరే ప్రాజెక్ట కె మీద వాటి ప్రభావం ఏమీ కనిపించడం లేదు…
అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకు పనిచేయడం గర్వంగా ఉందంటున్నాడు… అది మామూలు ప్రశంస కాదు… ఆయన ఎన్ని సినిమాల్లో ఏ రోల్స్ చేసినా సరే, పెద్దగా తన సినిమాల గురించి, పాత్రల గురించి ఇంత ఇదిగా ఎప్పుడూ చెప్పుకోలేదు… తమ్మారెడ్డి భరధ్వాజ వంటి తటస్థ సినీ మేధావులు సైతం అప్పుడే ప్రశంసిస్తున్నారు… ఇలా సినిమాకు విపరీతమైన హైప్ క్రియేటవుతోంది…
Ads
మనం సినిమా కథ గురించి చెప్పుకుంటున్నాం కదా… బయటికి వినిపిస్తున్న సమాచారం ప్రకారం… ఓ సైంటిఫిక్ ఫిక్షన్… ఏ సైఫై జానర్ అంటారు కదా… అదన్నమాట… కమల్ హాసన్ విలన్ అట… అమితాబ్ బచ్చన్ సైంటిస్టు పాత్ర పోషిస్తున్నాడట… ప్రభాస్ కర్ణుడు కమ్ ఇండియన్ స్పై అట… ఈ అటలు ఎందుకంటే… నిజమైన స్టోరీ లీక్ గాకుండా దర్శకనిర్మాతలు భలే సీక్రెసీ మెయింటెయిన్ చేస్తున్నారు… ఎలాగూ అధికారికంగా ఇదీ కథ అని ఎవరూ ముందు చెప్పరు కదా… ఆ థ్రిల్, సస్పెన్స్ పోకుండా…
ఇదే కథ అయితే మాత్రం… దీని విజయావకాశాల్ని అంచనా వేయడం కష్టం… ఇలాంటి సబ్జెక్టుల్లో ఏది జనానికి నచ్చుతుందో ముందే చెప్పడం అసాధ్యం… ఒక కాంతార, ఒక కార్తికేయ-2 జనానికి నచ్చాయి… రిలీజుకు ముందు వాటిని ఎలాంటి పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ లేవు… కానీ జనానికి కనెక్టయ్యాయి… శాటిలైట్, ఓవర్‌సీస్, థియేటరికల్, ఆడియో, ఓటీటీ… అన్ని భాషల్లో కలిపి ఈ అన్నిరకాల రైట్స్ లెక్కేస్తే… దాదాపు 1000 కోట్ల సినిమా ఇది… ఇండియన్ సినిమాకు సంబంధించి పెద్ద జూదమే…
Share this Article