Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేరే వ్యక్తితో పెళ్లి, ఓ బిడ్డ… ఐనాసరే కమల్‌తో బంధంపై అవే రాతలు, కూతలు…

December 6, 2022 by M S R

పూజా కుమార్ అనే నటి తెలుసా మీకు..? అమెరికాలో పుట్టింది, ఇండియన్ రూట్స్… అక్కడ చిన్న చిన్న సినిమాలు చేసి చెన్నై వచ్చిపడింది… కాదు, కమల‌హాసన్ కళ్లల్లో పడింది… పడిపోయింది… ఉత్తమ విలన్, విశ్వరూపం, విశ్వరూపం-2… అన్నింట్లోనూ ఆమే… లిప్ లాకులు, మస్త్ కెమిస్ట్రీ… తనకు అలవాటైన రీతిలోనే గౌతమిని కూడా వదిలించుకున్నాక కమల‌హాసన్‌కు పూజ దొరికింది… కొన్నేళ్లు సహజీవనం చేశారనే వార్తలు బోలెడు వచ్చాయి తమిళ మీడియాలో… కానీ తను 2020లో విశాల్ జోషిని పెళ్లి చేసుకున్నట్టు, నవ్య అనే ఓ అమ్మాయి కూడా పుట్టిందన్నట్టు వికీ చెబుతుంది… జోషియే ఇన్‌స్టాలో ఓ ఫోటో షేర్ చేసినట్టు టైమ్స్ రాసుకొచ్చింది ఏడాది క్రితం…

ఆ జంట తమ బంధంపై అప్పటిదాకా వచ్చిన వార్తల్ని ఏమీ ఖండించలేదు సరికదా… 2019లో ఓ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మీట్‌లో ఈమె కూడా ఫోటో షూట్‌లో పాల్గొన్నది… ఆ కుటుంబానికి చెందని వ్యక్తి ఆ ఫోటోల్లో తనొక్కతే… అంటే అర్థమైంది కదా…! బహుశా ఆ తరువాత ఆమె దూరం జరిగి ఉంటుంది, మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటుంది… కానీ ఇప్పుడు హఠాత్తుగా ఏమైందో ఏమో గానీ… ‘‘అబ్బే, ఇంకా గాసిప్స్ రాయకండబ్బా, ఆయనకూ నాకూ నడుమ ఇప్పుడు ఏ బంధమూ లేదు, మేం వరుసగా కొన్ని సినిమాలు చేశాం, అంతే’’ అని అసందర్భంగా పూజ ఓ క్లారిటీ పాస్ చేసినట్టుగా కొన్ని వార్తలు కనిపిస్తున్నయ్…

నిజం… అనుకోకుండా ఏబీఎన్ రాధాక‌ృష్ణ ఓపెన్ హార్ట్ చూస్తుంటే ఉత్తమ విలన్ సినిమాకు ముందు చేసిన చిట్‌చాట్‌లా ఉంది… మీ ప్రతి సినిమాలోనూ లిప్ లాక్ ఉండాల్సిందేనా అనే ప్రశ్న దగ్గర… చాలామందితో కనెక్టవుతాం, అన్నీ సహజీవనం దాకా రావు కదా, వచ్చినవి ఎప్పటికీ ఉండాలని కూడా ఏమీ లేదు కదా అని చాలా కాజువల్‌‌గా సమాధానం చెప్పాడు కమలహాసన్… ఈ పెళ్లి, బంధాలు, తొక్కాతోలు వంటి పదాలు తనకు ఏమాత్రం సరిపడవు… కొన్నేళ్లు కలిసి గడపాలి… తరువాత అయిష్టం ఏర్పడితే చల్, బయటికి నడువ్ అని బయటికి నెట్టేయాలి… ఎంతమంది, ఎవరు నంబర్ ఎంత అనే అంశాలపై తనకు పెద్ద ఇంట్రస్టు ఉండదు…

Ads

kamal pooja

ఈ సంబంధాల విషయంలో కమల‌హాసన్ మీద వచ్చినన్ని వార్తలు, గాసిప్స్ బహుశా ఏ తమిళ నటుడి మీదా వచ్చి ఉండవు… ‘‘పెళ్లి అనేది ఓ బంధం, ఓ బాధ్యత, ఓ ఒప్పందం’’ వంటి సూత్రీకరణల్ని అస్సలు ఇష్టపడని కమలహాసన్ తాలూకు కొన్ని బంధాల్ని ఓసారి చూద్దాం సంక్షిప్తంగా… నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్, నిర్మాత, సింగర్, పాటల రచయిత, రాజకీయ నాయకుడు కదా… బోలెడు పాత్రలు… బోలెడు తాత్కాలిక బంధాలు… 68 ఏళ్లొచ్చినా సరే, స్టిల్ బాగా మెయింటెయిన్ చేస్తున్నాడనీ.., ఎందుకో, ఏం తెలిసిందో పూజకు కూడా తనపై విరక్తి కలిగినట్టుంది, అందుకే దూరం జరిగిందనేది తమిళ మీడియా విశ్లేషణల సారం…

కెరీర్ మొదట్లో బంధం శ్రీవిద్య… ఆమె తనకన్నా రెండేళ్లు పెద్ద… పలు చిత్రాల్లో కెమిస్ట్రీని పండించారు ఇద్దరూ… కలిసి తిరిగేవారు… ఎందుకోగానీ కమల్ అంటే ఏం అర్థమైందో గానీ తనకు దూరం జరిగింది… జార్జి థామస్ అనే మలయాళీ అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను పెళ్లిచేసుకుంది ఆమె… తరువాత ఆమె మరణశయ్యపై ఉన్నప్పుడు కమల్ హాస్పిటల్ వెళ్లాడు…

శ్రీప్రియతో లవ్వు కథ ఎండ్ అయిపోయాక కమలహాసన్ కన్ను ఫేమస్ క్లాసికల్ డాన్సర్ వాణిగణపతి మీద పడింది… 1978… ఎప్పటిలాగే సహజీవనం అన్నాడు… ఠాట్, కుదరదు అన్నదామె… పెళ్లయితేనే కలిసి ఉందాం, లేకపోతే రాంరాం అనేసింది… అప్పటికే ఆమె మీద పీకల్లోతు ఆకర్షణలో ఉన్నాడు… సరేనన్నాడు… తనకన్నా పెద్దది ఆమె… సహజీవనాల్లో బాధ్యతలు ఉండవనేది ఆమె బలమైన నమ్మకం… సారిక కమల్ జీవితంలోకి వచ్చేసరికి వాణితో బాగానే ఉన్నాడు… దాదాపు పదేళ్లు… తరువాత విడాకులు ఇచ్చేసి, నీ బతుకు నీదిపో అనేశాడు…

సారికతో రిలేషన్ షిప్ పెరిగాకే వాణిగణపతిని పట్టించుకోవడం మానేశాడు, బంధం తెంచుకున్నాడు… నటి సారికతో కలిసి బతకసాగాడు… కానీ సోషల్ ప్రెజర్‌తో 1988లో పెళ్లి చేసుకున్నాడు… (అంతకుముందు ఆమె ఇద్దరితో డేటింగ్ చేసింది, కానీ పెళ్లి దాకా రాలేదు…) ప్రస్తుతం సినిమాల్లో ఉన్న శృతిహాసన్, అక్షర హాసన్ వాళ్ల పిల్లలే… పద్నాలుగేళ్లు నడిచింది… ఎప్పుడైతే సిమ్రాన్‌తో కమల్ బంధం చిక్కబడిందో ఇక సారికకు కూడా అర్థమైపోయింది… ఏ కమల్ కోసం తన సినిమా కెరీర్ మొత్తాన్ని వదిలేసిందో, అదీ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడు ఆ కమలే ఇప్పుడు తనకు గాకుండా పోయాడని అర్థమై ఓ దశలో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది… చివరకు 2004లో ఆ బంధం అధికారికంగానే తెగిపోయింది… అసలు కమల్ 16 ఏళ్లు ఒకరితో ఉండటం అనేేదే గొప్ప విషయం…

పలు తమిళ సినిమాల్లో కమలహాసన్‌తో కలిసి నటించిన సారిక తనకు బాగా దగ్గరైంది… దానివల్లే సారిక బతుకు చిన్నాభిన్నమైంది… సారికను వదిలేశాక కమల్ సిమ్రాన్ మాయలో పడ్డాడు… పంచతంత్రం సినిమాతో చిక్కబడిపోయిన బంధం కొన్నాళ్లు బాగానే సాగింది… తరువాత ఆమెకు సబ్జెక్టు అర్థమైంది… పాత కథలన్నీ విన్నది… తరువాత పమ్మల్ కె, సంబంధం సినిమా ఒకటి చేసి కటీఫ్ చెప్పేసింది… జస్ట్, రెండుమూడేళ్లే ఈ సంబరం…

సిమ్రాన్ లవ్వు ఎండ్ అయిపోయాక కమల్ కళ్లు గౌతమి మీద పడ్డయ్… ఆమెకు అప్పటికే తన మొదటి భర్త ద్వారా ఓ కూతురు ఉంది… తనను కూడా అంగీకరిస్తే నీ జీవితంలోకి వస్తానని షరతు పెట్టింది… తను సరేనన్నాడు… జస్ట్, సహజీవనమే… 2016 దాకా సాగింది బంధం… తరువాత ఆమెకే ఎందుకో విరక్తి వచ్చేసి బంధాన్ని తెంచేసుకుంది… కమల్ పేరు వింటేనే ఇప్పుడు ఆమెకు ఓరకమైన ఎలపరం… మధ్యలో ఆమె చాన్నాళ్లు కేన్సర్‌తో పోరాడింది…

అధికారికంగా కమల్ ఇప్పుడు సింగిల్… పూజకుమార్‌‌తో సంబంధం కొన్నాళ్లు సాగినా, వాళ్ల కుటుంబంలో ఆమె కలిసిపోయినా… ఆమె హఠాత్తుగా దూరం జరిగి, ఇంకెవరినో పెళ్లి చేసుకుని, బిడ్డను కూడా కన్నది… కమల్ తరువాత నంబర్ ఎవరు, ఏమిటనే చర్చ పక్కన పెడితే… అకస్మాత్తుగా ఆమె ‘‘మా ఇద్దరి మధ్యా ఏమీ లేదబ్బా, ప్లీజ్, ఏమీ రాయకండి’’ అని ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నట్టు..? ఏమో ఇంకా వాళ్లిద్దరి బంధం మీద ఇంకా సోషల్ మీడియా ఏదో గోకుతూనే ఉన్నట్టుంది… లేదా పాత వార్తలే మళ్లీ కొన్ని సైట్లు కట్ అండ్ పేస్ట్ చేస్తున్నట్టున్నయ్… నిజానికి అనవసరం… 2020లో, 2021లో కూడా మీడియాకు ఇలాగే అప్పీల్ చేసింది ఆమె… ఈ ఫోటో చూడండి, ఆమె భర్త విశాల్ జోషి ఈయనే… వాళ్ల బిడ్డ నవ్య…!! ఇన్‌స్టాలో భార్యాభర్తలు, తల్లీబిడ్డల ఫోటోలు బోలెడున్నయ్…

pooja

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions