ఇంగ్లిష్‌లో లస్ట్… అంటే కామం, వాంఛ, తృష్ణ, కోరిక… కళావ్యాపారం ఇప్పుడు అదుపు తప్పి, ఓటీటీల్లో వికృతంగా నర్తిస్తోంది… సెన్సార్ లేదు, ఆంక్షల్లేవు, అదుపు లేదు… సింపుల్‌గా చెప్పాలంటే బరితెగిస్తున్నాయి… కామంతో రగిలే, రమించే సీన్లకు యథేచ్ఛగా వెబ్ సీరీస్ పట్టం కడుతోంది… ఆ దృశ్యాల్లో నటులు ప్రదర్శించే హావభావాలు, కనిపించే అందాలు ప్రేక్షకులను వెర్రెక్కిస్తున్నాయి… ఈమధ్య నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న లస్ట్ స్టోరీస్ ఆ బాపతే…
లస్ట్ అంటే ఆల్రెడీ అర్థం చెప్పుకున్నాం కదా… ఇంకేం, లస్ట్ స్టోరీస్ అంటే కామకథలు… కాజోల్, తమన్నా, మృణాల్ వంటి తారల్ని సైతం లస్ట్ బురదలోకి దింపేసిన సీరీస్… వెండితెరపై ముద్దుకు కూడా నో అని చెప్పిన తమన్నా ఇప్పుడు ఈ సీరిస్‌లో ‘ఎక్కడికో’ వెళ్లిపోయింది… వెండితెర మీద అవకాశాల్లేక, వయస్సు ముదిరిపోతూ చివరకు ఇలా బుల్లితెర మీద అన్నీ విప్పేస్తోందనే వాదన కరెక్టో కాదో పక్కన పెడితే… ‘అతి’ చేస్తుందనేది సత్యం…
కథ డిమాండ్ చేసింది… కళాత్మక సృజన వంటి మాటలన్నీ హంబగ్… ఫేక్… ఇలాంటి సీరీస్ దృష్టి, టార్గెట్ కోరికను రగిలించడమే… తద్వారా వీక్షణలు పెంచుకుని, సొమ్ము చేసుకోవడం..! జనం కూడా ఎంజాయ్ చేస్తున్నారనేది ఓ సమర్థన… ఈటీవీలో జబర్దస్త్ మొత్తం అక్రమ సంబంధాల మీద స్కిట్లు, హైపర్ ఆది మార్క్ ద్వంద్వార్థాల పంచ్ డైలాగులు… జనం ఎంజాయ్ చేయడం లేదా..? తెలుగు సినిమాలు ఏమైనా తక్కువ తిన్నాయా..? స్మార్ట్ ఫోన్లు, చౌక బ్రాడ్ బాండ్ వచ్చాక… సంభోగం, శృంగారం అరచేతిలో చూసే సరుకు అయిపోయింది కదా… మరిక ఈ లస్ట్ స్టోరీస్ కొత్తగా చేస్తున్న తప్పేముంది అనేది మరో వాదన…
Ads
ఇదే నెట్ ఫ్లిక్స్‌లో అదితి సోహంకర్ నటించిన షి కూడా ఇదే బాపతు… దాదాపు ప్రతి ఓటీటీ వీక్షణల సంఖ్య పెంచుకోవడానికి ఇదే బూతుబాటను ఆశ్రయిస్తున్నాయి… జియో సినిమా ఓటీటీలో గండీ బాత్… వూట్ ఓటీటీలో ఫయ్ ఏ ఫాంటసీ… ఎంఎక్స్ ప్లేయర్‌లో హలో మినీ, పాంచాలి, ఉల్లు ఓటీటీలో చరమ్ సుక్… అసలు ఈ బూతు వ్యాపారంలో ఏక్తాకపూర్ దిట్ట… జితేంద్ర బిడ్డ… డర్టీ పిక్చర్ నిర్మాత… తన ఆల్ట్ బాలాజీ ఓటీటీలో దాదాపు కంటెంట్ మొత్తం అదే…
మాయ, వర్జిన్ సికందర్, దేవ్ డీడీ … ఏక్తాకపూర్‌కు జనం పల్స్ తెలిసి, దాన్నే రెచ్చగొడుతూ సంపాదిస్తున్నది అనుకోవాలా లేక మిగతావాళ్లకన్నా కాస్త ఎక్కువగా బట్టలు విప్పుతోందనుకోవాలా..? సినిమాకు వెబ్ సీరీస్‌కు నడుమ తేడా జస్ట్ సెన్సార్… ఎప్పుడైతే ‘నియంత్రణ’ లేదో, కత్తెరకు పనిలేదో… ఇంకేం… బూతు ఇలా జడలు విప్పుతోంది… మొన్నామధ్య ఆలియాభట్ నటించిన గంగూభాయ్ సినిమా మొత్తం వేశ్యలు, వేశ్యావాటికపైనే… ఐనా సరే, ఎక్కడా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ వెగటు సీన్ల జోలికి పోలేదు…
తను కావాలనుకుంటే ఆ కథ డిమాండ్ చేస్తున్నదనే పేరిట బూతు సీన్లను గుప్పించేవాడేమో… కానీ స్వీయ నియంత్రణ పాటించాడు… అఫ్‌కోర్స్, మితిమీరితే సెన్సార్ కత్తెరకు పదును పెరుగుతుందనే సందేహం ఉండి ఉంటుంది… ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… లస్ట్ స్టోరీస్ మీద నెట్‌లో బాగా చర్చ సాగుతోంది కాబట్టి… ఓటీటీ కంటెంట్ మీద ఈ మోడీ సర్కారుకు ఓ దిశ ఓ దశ కరవైంది కాబట్టి…! చెప్పండ్రా, ఇదేమిటంటే క్రియేటివ్ ఫ్రీడం అని చెప్పేయండి…!!
Share this Article