Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘నిరాహార దీక్ష వేళ గుట్టుగా చాక్లెట్లు నమిలేది, శాండ్‌విచ్‌లు లాగించేది…’’

September 20, 2022 by M S R

పాదయాత్ర అంటే… పూర్తిగా నడకే అక్కర్లేదోయ్… కాసేపు నడువ్… తరువాత క్యారవానో, కంటెయినరో ఎక్కేసి, కాస్త ఊపిరి పీల్చుకో, మళ్లీ నడువ్, మళ్లీ కాసేపు రిలీఫ్… ఎవరు వచ్చి, ఎక్కడ కలవాలో, ఏం ఫోటోలు దిగానో, ఏది మీడియాకు ఇవ్వాలో అంతా వెల్ ప్లాన్డ్… కలిసే జనం, కలిసి నడిచే జనం కూడా ఫేక్… ఎవరి అవసరాలు వాళ్లవి…  నిరాహారదీక్ష అంటే మరీ వీజీ… ఇప్పుడు నిరవధిక దీక్షలు లేవు కదా… ఎవరూ పొట్టి శ్రీరాములు కాదుగా… ఉదయం ఫుల్లు బ్రేక్ ఫాస్ట్ ఎక్కించేసి, సాయంత్రానికి ప్రెస్‌మీట్ పెట్టేసి, ఎవడో నిమ్మరసం ఇస్తాడు, దీక్ష విరమణ ఫోటోలు దిగేసెయ్…

మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది, పలు రాజకీయ పరిణామాలకు దారితీసింది కేసీయార్ నిరవధిక నిరాహార దీక్ష… మధ్యలోనే దాన్ని విరమించడం, విద్యార్థుల ఆగ్రహంతో మళ్లీ కొనసాగిస్తున్నట్టు ప్రకటించడం వంటి ఎపిసోడ్లు ఓ చరిత్ర… ఆ దీక్ష బోగస్ అని వెక్కిరిస్తూ లగడపాటి చేసిన దీక్ష మరో చర్చనీయాంశం… ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ప్రాంతాలు వేర్వేరు కావచ్చుగాక… రాజకీయ నాయకులందరూ ఒకే తరహా…

వరుస కట్టి మంత్రుల అవినీతి బట్టబయలవుతున్నయ్… మేనల్లుడి దందాలు, బాగోతాలూ బజారుకెక్కుతున్నయ్… మమతకు ఊపిరాడటం లేదు… సీబీఐ, ఈడీ దాడుల వెనుక మోడీ లేడట… ఒకప్పుడు మోడీ మీద కత్తియుద్ధం చేసిన మమతక్క చేతిలో ఉన్నది నిజానికి ఉత్త కాగితం కత్తి మాత్రమేననీ, ఎక్కడో ఏమూలో మొదలైన భయం, ఆందోళన వెన్నులో జరజరా పాకుతోందని తాజా వార్తలు, వ్యాఖ్యలు చెబుతున్నాయి… అసలు తను టీలో ఈగలా తీసేసిన గవర్నర్‌కే మద్దతు ప్రకటించాల్సి రావడం కూడా అందులో ఒకటి… ఒకప్పటి మమతేనా ఈమె..?

Ads

ఇదంతా ఎలా ఉన్నా… మమత కూడా ఓ బోగస్ దీక్ష చేసిన తీరును ఒకప్పుడు ఆమెకు వీరవిధేయుడిగా మెలిగిన దీపక్ కుమార్ ఘోష్ బయటపెట్టాడు… ఆమె 2006లో 26 రోజులపాటు దీక్ష చేసింది… 26 రోజుల దీక్ష అంటే మజాక్ కాదు… ఐనా ఆమె మామూలుగానే ఉంది… కారణం… ఆమె రహస్యంగా ఆహారాన్ని తీసుకోవడమేనని ఆయన బయటపెట్టేశాడు… నిజానికి ఆయన 2012లోనే ఓ పుస్తకం రాశాడు… ‘‘నాకు తెలిసిన మమత- ఓ దేవత వైఫల్యం’’ అనే అర్థమొచ్చే పేరు పెట్టాడు… ఇప్పుడు కొందరు ట్విట్టర్‌లో ఆ బుక్కులోని ఒకటీరెండు చాప్టర్లను ట్వీట్ చేసి, కొత్తగా చర్చకు తెరలేపుతున్నారు…

అప్పట్లో టాటా వాళ్ల నానో కార్ల ఫ్యాక్టరీ కోసం సీపీఎం ప్రభుత్వం నిర్బంధంగా భూసేకరణ జరపడం ఓ పెద్ద కంట్రవర్సీ… పోలీసుల కాల్పులు, హింస, ఆందోళనలు, దాడులు గట్రా సీపీఎం నిజస్వరూపాన్ని బరిబాతల ప్రదర్శించిన ఘట్టాలు అవన్నీ… ఆ సందర్భంగా మమత దీక్షకు పూనుకుంది… అదీ నేపథ్యం… ఆ మాజీ ఐఏఎస్ రాసిన పుస్తకంలో 8వ చాప్టర్ పేరు ‘‘Fast with sandwich as dinner and chocolate throughout the day…



mamata



తనే రాస్తాడంటే… దీక్ష రోజుల్లో ఆమె నిమ్మరసం, గ్లూకోజు నీళ్లు తీసుకునేది… రహస్యంగా వెజ్, చికెన్ శాండ్‌విచ్‌లు, చేపముక్కలు లాగించేది… ఆమె పీఏ గౌతమ్ బసు ఇవన్నీ చూసుకునేవాడు… పిల్లో కింద ఇంపోర్టెట్ చాకొలేట్లను దాచుకుని తరచూ గుట్టుగా నమిలేది… సరే, ఏం చేస్తేనేం… పొలిటికల్‌గా మంచి ఫాయిదా పొందింది… ఇలాంటి ఆందోళనలతో పాపులర్ అయిపోయింది… ఫైటర్, ఫైర్ బ్రాండ్ పేరొచ్చింది… ప్రజలు తరువాత ఎన్నికల్లో సీపీఎంను బొంద పెట్టేశారు… ఇప్పటికీ అది మళ్లీ కోలుకోలేదు… బహుశా కోలుకోదు… సో, దీక్ష ఎలా చేశారనేది కాదన్నయ్యా… ఏం సాధించారనేదే ముఖ్యం… అదీ సంగతి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…
  • మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు
  • ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!
  • రేయ్, ఫుడ్ బ్లాగర్లూ… నా మొహం కూడా మాడింది ఆ మసాలా దోశలాగే…
  • 2 ఫ్లాట్లు… 639 కోట్ల రికార్డు ధర… ఇంతకీ ఆ ధనికురాలు ఎవరంటే..?
  • అదే సీన్… 2 పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…
  • కాశీ తిరగబడింది… ఆ తెల్ల గవర్నర్ జనరల్ రాత్రికిరాత్రి పారిపోయాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions