- జెమిని టీవీ… మాస్టర్ చెఫ్… 18.9.2021… శనివారం… 8.30 నుంచి 9.30 సమయం… రేటింగ్స్ కేవలం ఒకటిన్నర… నిజమే… జస్ట్, ఒకటిన్నర మాత్రమే
- జెమిని టీవీ… ఎవరు మీలో కోటీశ్వరులు… సోమవారం… 20.9.2021… 8.30 నుంచి 9.30 సమయం… రేటింగ్స్ 2.83… అవున్నిజమే, జస్ట్, 2.83 మాత్రమే…
- మాటీవీ… బిగ్‌బాస్5… ఆదివారం… నాగార్జున వీకెండ్ షో… ఎలిమినేషన్లు, స్పెషల్ గేమ్స్… 9 నుంచి 10.30 సమయం… 19.9.2021… సాధించిన రేటింగ్స్ కేవలం 5.80 మాత్రమే…
- జీటీవీ… ఆదివారం… 6.30 నుంచి 9 గంటల సమయం… 19.9.2021… గర్జన మూవీ (శ్రీరాం)… రేటింగ్స్ కేవలం 3 మాత్రమే…
- మాటీవీ… ఆదివారం… 19.9.2021… 9 నుంచి 12 గంటల సమయం, ఉదయం… డోర మూవీ… రేటింగ్స్ కేవలం 2.15 మాత్రమే…
- జెమిని టీవీ… ఆదివారం… 19.9.2021… 3.30 నుంచి 6 గంటలు… మధ్యాహ్నం… ఇష్క్ మూవీ.., (Not a love story)… రేటింగ్స్ 2.75 మాత్రమే… (ఇవన్నీ హైదరాబాద్ బార్క్ కేటగిరీ రేటింగ్స్)…
పైన రేటింగ్స్ చూశారుగా… మూడు ప్రిస్టేజియస్, ఎక్స్‌పెన్సివ్ ప్రోగ్రామ్స్… మూడు కొత్త మూవీస్… అన్నీ రేటింగ్స్ సాధనలో కొట్టుకుపోయాయి… ప్రత్యేకించి జూనియర్ ఎన్టీయార్, నాగార్జున, తమన్నా… మాస్టర్ చెఫ్ అనే చెత్త వంటల షో ఇక ఎత్తిపోయినట్టే… ఆ ఖర్చంతా బూడిదలో పోసినట్టే… ఎందుకు అట్టర్ ఫ్లాపయింది అనే చర్చ కూడా అనవసరం… అసలు ఆ వంటల పోటీ తీరే సరైన ఫార్ములా కాదు… జెమిని వాడికి చేతులు, మూతులు కాలిపోయినట్టే ఈ షో ద్వారా..! ఇక జూనియర్ ఎన్టీయార్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కూడా ఫ్లాప్… అంతటి అగ్రహీరో హోస్ట్ చేస్తున్నా సరే జనం లైట్ తీసుకుంటున్నారు… కారణాలు ఇంతకుముందు చెప్పుకున్నవే… జూనియర్ భజన ప్రధాన కారణం, మరీ నాసిరకం ప్రశ్నలు మరో కారణం… ఈ షో కూడా జెమిని వాడి చేతులు కాల్చేసినట్టే… ఇకముందు కూడా ఈ రేటింగ్స్ పెరిగే చాన్స్ లేదు, ఐపీఎల్ కారణంగా ఈ షో చూసేవాళ్లు తగ్గారనే సమర్థన కూడా తప్పే… అసలు ఐపీఎల్ ఆటే ఎవడూ చూడటం లేదు ఈసారి…
బిగ్‌బాస్5… మరో ఫ్లాప్ ఈమధ్య… ఎప్పటిలాగే లాంచింగుకు రేటింగ్స్ కుమ్మేశామహో అని మాటీవీ వాడు ఎంత గొప్పగా చెప్పుకున్నాసరే, ఆ రేటింగ్స్ మాత్రం పెరగడం లేదు… చివరకు అంతోకొంతో జనం ఆసక్తి ఉండే వీకెండ్ షోలకు కూడా జనాదరణ పెద్దగా లేదు… మాటీవీ టాప్30లో కూడా ఈ షో లేదు… అదీ దాని దురవస్థ… ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక సరిగ్గా లేదు, అందరూ దాదాపు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, షోలో మజా లేకుండా పోయింది… చివరకు లోబో కూడా ఎంటర్‌టెయిన్ చేయడం మానేసి మెంటలైపోతున్నాడు… వీక్ డేస్‌లో అయితే దీని రేటింగ్స్ మరీ ఘోరంగా ఉంటున్నయ్… నాగార్జున ఉండగానే సరిపోదు, షోలో థ్రిల్లింగ్ కంటెంట్ ఏదో ఉండాలి కదా… ఇక డోర, ఇష్క్, గర్జన మూవీలపై జనానికి పెద్దగా ఆసక్తి లేకపోయినా సరే, కొత్త సినిమాలు కాబట్టి ఎంతోకొంత రేటింగ్స్ వస్తాయనుకున్నారు… మూడూ ఘోరమైన ఫ్లాపులే… జనం ఓటీటీల వైపు ఎక్కువగా వెళ్లిపోతున్నారు, టీవీక్షణం తగ్గిపోతోంది… అదీ ఓ కారణమే… ఇంకా టీవీలు కళ్లు తెరవడం లేదు… ఇన్నాళ్లు టాప్‌లో ఉన్న త్రినయని, ప్రేమ ఎంత మధురం వంటి సీరియళ్లు కూడా చెత్తా కథాకథనాలతో రేటింగ్స్‌లో కిందకు పడిపోతున్నయ్… థియేటర్లలాగే టీవీల్లో వినోదానికి కూడా గ్రహణం ప్రారంభమవుతున్నట్టే ఉంది…!!
Ads
Share this Article