Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మారుతున్న రాజకీయాల్లో మనుషులే కాదు బొమ్మలూ మారతాయ్ !! 

February 21, 2024 by M S R

Paresh Turlapati….   ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే

లోకేష్ ను ఓడించటమే కాదు చంద్రబాబు మీద న్యాయస్థానాల్లో కేసులు వేసి ముప్పతిప్పలు పెట్టిన వ్యక్తిగా ఆర్కే కు పేరుంది ! ఏపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆర్కే కు మాత్రం మంగళగిరిలో టికెట్ ఖాయం అనే ప్రచారం పార్టీ వర్గాల్లో ముందు నుంచీ ఉంది !

అయితే మారిన సమీకరణాల దృష్ట్యా మంగళగిరిలో ఆర్కే కు టికెట్ ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది ! ఇది ఆర్కే ఊహించని పరిణామం !

సరిగ్గా అదే టైంలో జగన్ చెల్లెలు షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయటంతో ఆర్కే కూడా వైసీపీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ! చంద్రబాబు అవినీతిపైన సాక్ష్యాధారాలతో కేసు వేసినవాడిని జగన్ అవినీతిపైన కేసు వేయలేనా ? అని స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు !
alla

ఈరోజు జగన్ పిలిపించి ‘మాట్లాడటంతో’ రాష్ట్రాన్ని అవినీతి రహితంగా జగన్ మాత్రమే పాలించగలడని అందుకే తిరిగి సొంత గూటికి వచ్చేశానని ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు !

సరే, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయినా ఒక విషయం నన్ను ఆకర్షించింది ! స్వతహాగా జగన్ వీరాభిమాని అయిన ఆర్కే తన వాట్సాప్ డీపీ లో జగన్ ఫోటో పెట్టుకుని స్వామి భక్తిని చాటుకునేవారు !

మంగళగిరి టికెట్ ఇవ్వట్లేదని తెల్సిన తర్వాత జగన్ ఫోటో తీసేసి ఇందిరాగాంధీ ఫోటో వాట్సాప్ డీపీ గా పెట్టుకున్నాడు ! మళ్లీ ఇప్పుడు జగన్ పిలవటంతో ఇందిరాగాంధీ ఫోటో తీసేసి జగన్ ఫోటో పెట్టుకుని వెళ్లి కలిసి ‘మాట్లాడుకుని’ సంతోషంగా బయటికి వచ్చాడు !

మారుతున్న రాజకీయాల్లో మనుషులే కాదు బొమ్మలూ మారతాయ్ !!

.

Ads

(అప్పట్లో అంబటి రాయుడు సింగిల్ డే జంపింగ్ బాగా వార్తల్లో నానింది… ఇప్పుడు సేమ్ ఆళ్ల జంపింగులు కూడా… ఎందుకు తను వెళ్లిపోయినట్టు, హఠాత్తుగా ఎందుకు వెనక్కి వచ్చాడు..? ఏమిటీ చంచలం..? తన ఘర్ వాపసీని ఎంత సమర్థించుకున్నా, ఏం చెప్పినా ఒకసారి తన క్రెడిబులిటీని, లాయల్టీని కోల్పోయినట్టే… — ముచ్చట)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • క్రిస్టినా కోచ్… మంచు ధ్రువాలు, విశ్వాంతరాలే ఆమెకు ఇష్టమైన సవాళ్లు…
  • వివాదాస్పద సింగర్ మంగ్లిపై అక్రమ వసూళ్ల కేసు నమోదు..!!
  • అల్గా‘రిథమ్’ కాదు, స్కోర్ల ఈక్వేషన్ కాదు… లైఫ్ అంటేనే ఎమోషన్..!!
  • బీఆర్ఎస్‌లో హరీష్‌రావు ఒంటరి అయిపోతున్నాడా..? ఏమవుతోంది..?
  • మావిగన్ ప్రతిపాదన కాదు, సూచన కాదు, వెటకారం కాదు… అదొక హెచ్చరిక…
  • చర్చల దారి చర్చలదే… మరో అమెరికన్ నిఘా డ్రోన్ కూల్చివేత…
  • మీడియా రాజ్యాధికారాన్ని శాసించదు… శాసించగలమనే భ్రమల్లో ఉంటుంది…
  • ఆ క్షణం ఒక యుగం! 𝐓𝐡𝐞𝐒𝐩𝐥𝐚𝐬𝐡𝐃𝐨𝐰𝐧… భూమి ఎదురుచూస్తోంది..!
  • రొట్టె- చక్కెర … వైరల్ వీడియోపై బోలెడు పోస్టులు… కానీ..?
  • రాజీనామా చేశాడట… బారా ఖూన్ మాఫ్… వాటీజ్ దిస్ మోడీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions