Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిగ్‌బాస్ పుష్పరాజ్ వస్తాడో లేదో గానీ పోలీసులు అనుమతిస్తారా..?!

December 12, 2024 by M S R

.

పుష్ప-2 సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది తెలుసు కదా… సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో ఓ మహిళాభిమాని మరణం, మెగా ఫ్యాన్స్‌తో కయ్యం, పుష్ప కథాంశంపై విమర్శలు గట్రా ఎలా ఉన్నా… బన్నీ పాన్- ఇండియా స్టార్‌గా ఇక దాదాపు స్థిరపడ్డట్టే…

తనను బిగ్‌బాస్- 8 సీజన్ ఫినాలే చీఫ్ గెస్టుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనేది తాజా వార్త… అప్పుడప్పుడూ టీవీ షోల ఫినాలేలకు చీఫ్ గెస్టుగా వెళ్లడం తనకు అలవాటే… కొత్తేమీ కాదు… కానీ తను గనుక ఫినాలేకు వస్తే దాని టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోతాయి… అంటే చూసేవాళ్ల సంఖ్య పెరుగుతుందీ అని…

Ads

కానీ పోలీసులు అనుమతిస్తారానేది అనుమానమే… గత సీజన్ ఫినాలే తరువాత పల్లవి ప్రశాంత్ అనుచరులు సృష్టించిన ఉద్రిక్తత, విధ్వంసం తెలిసిందే కదా… ఇక బన్నీ వస్తాడనే సమాచారం తెలిస్తే జనం విపరీతంగా గుమిగూడతారు… సంధ్య థియేటర్ వద్ద చేదు అనుభవాలు తెలిసినవే కదా…

నిజానికి గత సీజన్లతో పోలిస్తే ఈసారి సీజన్ మరీ నిస్సారంగా ఉంది… రేటింగ్స్ లేవు… కంటెస్టెంట్ల ఎంపికలోనే లోపాలున్నాయని మనం చెప్పుకున్నదే… ఇక ఇప్పుడు లాస్ట్ వీక్ మరీ దారుణంగా ఉంది… నామినేషన్లు ఉండవు, గొడవలు ఉండవు, ఫైట్స్ ఉండవు… ఎవరైనా గెస్టులు రావడం, ఏవో టీవీ షోలలో ఆడించే గేమ్స్ ఆడించడం, కాస్త ఫన్ క్రియేషన్… అంతే…

స్టార్‌మా టీవీలో వచ్చే సీరియల్స్ ప్రచారం కోసం దీన్ని వాడుకుంటున్నారు… ఆయా సీరియళ్లలోని ప్రధాన పాత్రధారుల్ని హౌజులోకి తీసుకొచ్చి, ఏవో చిన్న చిన్న గేమ్స్… కానీ దీపిక, సుహాసిని వంటి ఒకరిద్దరు మాత్రమే బిగ్‌బాస్ ప్రేక్షకులకు తెలుసు… మిగతావాళ్లు హౌజులోకి రావడం వల్ల తాజా ఎపిసోడ్లకు పెద్ద ఫాయిదా ఏమీ లేదు…

హౌజులో మిగిలినవాళ్లలో అవినాష్ ఒక్కడే ఎంటర్‌టెయిన్‌మెంట్ దిశలో చురుకు… కాస్త ప్రేరణ కూడా… కానీ ఆ అవినాషే లేకుండా ఉంటే ఈమాత్రం కూడా షో చూసేవాళ్లు ఉండరేమో… అఫ్‌కోర్స్, తనను కేవలం కమెడియన్‌లాగే చూస్తున్నారు ప్రేక్షకులు… అందుకే తన వోటింగు మరీ పూర్…

మొదట్లో చాలా పద్ధతిగా ఆడిన నబీల్ తరువాత దారితప్పడంతో విజేత రేసు నుంచి తప్పుకున్నట్టే తాను… కాస్తోకూస్తో ప్రేరణకు తనకన్నా కాస్త అధికంగానే వోట్లు పడుతున్నాయి… ఎటొచ్చీ విజేతల రేసులో నిఖిల్, గౌతమ్ ఉన్నారు… పోటాపోటీగా వోట్లు పడుతున్నాయి… ఒక సెక్షన్ కావాలని గౌతమ్ కోసం తెలుగు వర్సెస్ కన్నడ అనే అనారోగ్యకరమైన, అవాంఛనీయమైన ప్రచారాన్ని ప్రారంభించాయి…

గౌతమ్ మొదటి నుంచీ హౌజులో లేడు, కొత్త కాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ… తనతో పోలిస్తే నిఖిల్ ఫస్ట్ నుంచీ ఉన్నాడు, పర్‌ఫెక్ట్ ప్లేయర్… పైగా గౌతమ్ మాటతీరు పెళుసు… దూకుడు, ఆవేశం, మాటజారడం అన్నీ ఉన్నాయి… ఐనా కన్నడ ఏంది..? తెలుగు ఏంది..?

తెలుగు బిగ్‌బాస్ అయితే కన్నడిగకు ట్రోఫీ ఇవ్వొద్దా..? ఇదీ ఐపీఎల్ వంటిదే… హైదరాబాద్ ఐపీఎల్ జట్టులో ఉన్న హైదరాబాదీలు ఎందరు..? టీవీ సీరియళ్లలో ఆధిపత్యం అంతా కన్నడ నటులదే… వాటికి కావాలి గానీ ఈ షోలకు అక్కర్లేదా..? ఇదేం లెక్క..? గౌతమ్ పీఆర్ టీమ్స్ ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్న ప్రభావం కనిపిస్తోంది కానీ కన్నడ వర్సెస్ తెలుగు అనే కయ్యాన్ని సృష్టించడం మాత్రం సరికాదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వాటిని గజల్స్ అంటారా..? నీ సారస్వత సేవ ఏమిటి శ్రీనివాసులూ…?
  • వెనెజులా..! ట్రంపుదే కాదు… మన చమురూ ఉంది అక్కడ… తవ్వాలి..!!
  • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!
  • చైల్డ్ ఆర్టిస్టు కాదు… డబుల్ రోల్‌లో మహేశ్ బాబే అసలు హీరో…
  • … ఫాఫం అంబానీ..! కంటెంట్ రైటర్ల పారితోషికాలకూ డబ్బుల్లేవ్..!!
  • తల్లి చెప్పింది… ‘సింహంలా పోరాడు… అంతేగానీ పిరికివాడివై తిరిగిరాకు’
  • రోగ్ ప్లానెట్ కాదు… దుష్ట గ్రహమూ కాదు… అదొక ఒంటరి జర్నీ… అంతే…
  • 1500 కోట్ల పణం..! ప్రేక్షకుడు ఎందుకెక్కువ చెల్లించాలి…? మళ్లీ అదే ప్రశ్న..!!
  • వెనెజులా..! ఇప్పుడు ట్రంపు దాడి… ఎప్పటి నుంచో ‘ఉచితాల’ దాడి..!!
  • ఈ బీరువా తలుపులు తెరవగానే… నా బాల్యం నన్ను నిండా కమ్మేస్తుంది…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions