‘‘తొమ్మిదేళ్ల క్రితం సినిమా… కందిరీగ… ఇప్పుడు సినిమా అల్లుడు అదుర్స్… ఇదే బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి సురేష్ దానికి నిర్మాత… అందులో కూడా సోనూసూద్ ఉన్నాడు… ఇదే దర్శకుడు అప్పుడూ ఇప్పుడూ… సంతోష్ శ్రీనివాస్… సేమ్, గిట్లనే ఒక్కతే పోరిని హీరో లవ్ చేస్తుంటడు, విలన్ ట్రై చేస్తుంటడు… కాకపోతే కందరీగలో హన్సిక -పోతినేని హీరోహీరోయిన్లు… గీ అల్లుడు అదుర్స్ సినిమాల అల్లుడు సీను, నభా నటేష్ హీరోహీరోయిన్లు… ఈ సినిమా చూస్తుంటే మల్ల గా సినిమానే చూస్తున్నట్టు కొడతది… అరె, ఏం సినిమా తీసినవ్ర భయ్… మమ్మల్ని హౌలాగాళ్లను చేస్తున్నరులే…….’’ మూడునాలుగు నెలల క్రితం విడుదలైన అల్లుడు అదుర్స్ సినిమా గురించి మనం చెప్పుకున్న రివ్యూ మొదటి పేరా ఇది… అయితే కొన్ని సినిమాలు అనుకోకుండా థియేటర్లలో ఫ్లాప్ అయిపోయినా సరే, టీవీల్లో మంచి రేటింగ్స్ సంపాదిస్తయ్… కొన్ని ఓటీటీల్లో బాగా చూస్తారు జనం… కొన్ని సినిమాలయితే టీవీల్లో మూడునాలుగు సార్లు వేసినా ప్రతిసారీ మంచి రేటింగ్సే వస్తుంటయ్… అందుకని ఈ అల్లుడు అదుర్స్ టీవీల్లో వచ్చినప్పుడు ప్రేక్షకులు ఏం రేటింగ్స్ ఇస్తారో చూద్దామనే కాస్త ఇంట్రస్ట్ కలిగిన మాట నిజం…
అబ్బో, సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనా సరే, టీవీల్లో అదరగొట్టాడు సీనయ్య, మస్తు రేటింగ్స్ వచ్చినయ్, అందరూ ఆశ్చర్యపోతున్నారు అంటూ ఏవో కొన్ని సైట్లలో వార్తలు కనిపించినయ్… ఇదేదో ఇంట్రస్టింగుగా ఉందబ్బా, నిజమేనా అని తాజా రేటింగ్స్ చెక్ చేస్తే… తుస్… అంత సీనేమీ లేదు… 6.9 రేంజులో వచ్చినయ్, హైదరాబాద్ కేటగిరీలోనైతే మరీ 4.4 మాత్రమే… అంటే మనసిచ్చిచూడు, కేరాఫ్ అనసూయ వంటి ఓ మోస్తరు టీవీ సీరియళ్ల స్థాయి కూడా కాదు… ఈటీవీలో వచ్చే క్యాష్, వావ్, ఆలీతో సరదాగా కూడా సేమ్ రేంజ్ రేటింగ్స్ ఉంటున్నయ్… సో, టీవీ వీక్షకులు కూడా ఫోఫోవయ్యా సీనయ్యా అని తిరస్కరించేశారన్నమాట…
Ads
విశ్వక్సేన్ నటించిన ఫలక్‌నుమాదాస్ సినిమా అప్పట్లో యావరేజ్‌గా ఆడింది… నిజానికి సినిమా కాస్త చూడబుల్ అన్నట్టుగానే ఉంది… కానీ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు ఎందుకో… ఇప్పుడు టీవీల్లో వేస్తే జనం అస్సలు పట్టించుకోలేదు… ఏదో పాత సినిమా మళ్లీ వేసినట్టున్నారు అనుకున్నారేమో, లేక ఆ సినిమా చూడాల్సిన పనే లేదనుకున్నారో గానీ… మరీ 3.7 రేటింగ్స్ ఓన్లీ… మరీ ఫ్లాప్ అన్నమాటే… హైదరాబాద్ కేటగిరీలో అయితే దీని రేటింగ్స్ మరీ 2.2 మాత్రమే… ఇప్పటికే బోలెడుసార్లు వేయబడిన సినిమాలు కూడా ఇంతకుమించి రేటింగ్స్ సాధిస్తుంటయ్… రవితేజ క్రాక్ గురించి కాస్త చెప్పాలి… మూడోసారి అనుకుంటా, మాటీవీలో వేస్తే, ఇప్పుడూ 6.3 రేటింగ్స్ కొట్టింది హైదరాబాద్ కేటగిరీలో… చాలా బెటర్… అవునూ, అల్లుడు సీను గారూ… వాట్ నెక్స్ట్..? ఛలో బాలీవుడ్… అంతేనా..? పెట్టి పుట్టావోయ్…!!
Share this Article