Chegondi Chandrashekar…….. ఎన్ని విమర్శలు, కౌంటర్ అర్గ్యుమెంట్లు చదివినా… ఎందుకో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది మంచే చేస్తుందని అనిపిస్తోంది… మనం చేసే లెక్కలు, బ్యాలెన్స్ షీట్ల కోణాలకు ఈ లాభాలు అంత త్వరగా కనిపించకపోవచ్చు…
ఈ పథకం మహిళ ఆర్థిక స్వేచ్ఛ, సాధికారత కోణాల్లో చేయూతనిచ్చేలాగే కనబడుతోంది… మొబిలిటీ పెరగడం అనేది పెద్ద మార్పుకు దారితీస్తుంది… ఇప్పుడు అనేక రంగాల్లో స్త్రీలున్నారు… అయితే వాళ్లంతా ఒక ప్రొటెక్టివ్, కండిషన్డ్ స్పేసుల్లోనే ఉన్నారు… అది కూడా ఈ పథకంలో బ్రేక్ అవుతుంది కావచ్చు…
వర్క్ ప్లేస్, ఫ్యామిలీ సంరక్షణతో కూడిన వాతావరణంలో మాత్రమే కాదు, మగవాళ్లలాగే అన్ని ప్రాంతాలకు స్వేచ్ఛగా, ఉచితంగా వెళ్లగలగాలి… వేరే మోడల్స్ కూడా చూద్దాం ఓసారి… ఢిల్లీలో ఇలాగే ఉందని విన్నా… కర్నాటకలో కూడా పెట్టారు కదా… యూరప్ దేశాల్లో కొన్ని పెద్ద సిటీల్లో ఫ్రీ ట్రాన్స్‌పోర్టు అని కూడా విన్నా.. ఐతే కాస్మోపొలిటన్ సిటీల్లోని మోడల్‌కు, ఎన్నో స్మాల్ టైన్స్ ఉన్న స్టేట్స్ మోడల్‌కూ పోలిక సరిపోతుందా అనేదీ ఓ పాయింట్…
Ads
ఒక ఉదాహరణ… నేను ఉండే దగ్గర ఓ మూడు కిలోమీటర్ల రేడియస్‌లో దాదాపు పది వరకూ సూపర్ మార్కెట్స్ ఉంటయ్… అందులో పనిచేసే లేడీస్ అందరూ ఎకనామికల్లీ పూర్… అంతంత మాత్రం బ్యాక్ గ్రౌండ్లే… సాలరీస్ కూడా తక్కువే… బట్టకు, పొట్టకు సరిపోయేంత… ట్రాన్స్‌పోర్ట్ పైసలు మిగులుతయ్ అంటే వెంటనే వాళ్లే గుర్తుకొస్తారు… సిటీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఈ పథకం పెద్ద ఊరట… ట్రాన్స్‌పోర్ట్ డబ్బులు మిగిలితే… పనిచేసే ప్లేసు నుంచి కాస్త దూరంలోనైనా తక్కువ అద్దెలతో ఇళ్లు తీసుకుంటారు… అదీ ఊరటే…
ఏ కోణంలో ఆలోచించినా సరే ఇది ఓ ఉదారవాద ఎమోషనే కావచ్చుగాక… కానీ సరైన డైరెక్షన్‌లోనే పోతున్నం అనిపిస్తోంది… కనీసం ఓ సంవత్సరంపాటు ఈ పథకానికి స్పేస్ ఇవ్వాలి… ఆ తరువాత ఫలితాల మదింపు అవసరం… అప్పుడే తొందరపడి కంక్లూజన్స్ అవసరం లేదు… చాలామంది పొలిటికల్ యాంగిల్‌లో వాదిస్తున్నారు… అదీ చాలా ఎర్లీగా… ఎందుకలా..?
దేశంలో ఉన్న రెండు పవర్ ఫుల్ పార్టీల ఐటీ సెల్స్ పదే పదే అదేపనిగా దీని మీద మాట్లాడుతున్నయ్… ఈ దాడి నుంచి వెంటనే డిఫెన్స్ దొరకదు… కాబట్టి సామాజిక కార్యకర్తలు గానీ, ఫెమిస్టులు గానీ కొన్ని రోజుల తరువాత ఈ స్కీం ద్వారా వచ్చే మార్పును డాక్యుమెంట్ చేసి, ప్రజెంట్ చేయాలి… మొబిలిటీ ద్వారా వచ్చే మార్పుల్ని సింగిల్ వుమెన్ ట్రావెలర్స్ ఇంకా బాగా అబ్జర్వ్ చేయగలుగుతారు.
ఆ ప్రాఫిట్, లాస్ బ్యాలన్స్ షీట్ ఆర్గుమెంట్స్‌కి కౌంటర్‌గా ఇది తప్పదేమో… ఇంకా పాజిటివ్ డెవలప్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది. నాకైతే కనీసం 1, 2 ఇయర్స్ సమయం ఇచ్చాక మాట్లాడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఏ పార్టీ అయినా వాళ్ళ పథకాల మంచీచెడులు ప్రజల ముందు పెట్టవలసిందే… మంచా చెడా అనేది జనాలు డిసైడ్ చేసుకుంటారు…
Share this Article