Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కమలాసన్‌కు దీటుగా చంద్రమోహన్… శ్రీదేవికి సాటిగా విజయశాంతి…

April 11, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. మరో వసంత కోకిల . సేం టు సేం కధ కాకపోయినా ఆ ఛాయలు బాగానే కనిపిస్తాయి . 1983 లో వచ్చిన ఈ అమాయక చక్రవర్తి సినిమా ఒక మనశ్శాస్త్ర వైద్యుడి భగ్నప్రేమ కధ . వైద్యుడిగా చంద్రమోహన్ చాలా బాగా నటించాడు . వసంత కోకిల సినిమాలో కమల్ హాసన్ నటనకు ధీటుగా , బెటరుగా కూడా ఉంటుందని కూడా చెప్పవచ్చేమో !

చంద్రమోహన్ ఒక సైకియాట్రిస్ట్ . ధనార్జన కన్నా జనసేవ మీదే దృష్టి . దారి తప్పిన భార్యను వదిలేసి తన ఎస్టేటుకు వెళ్ళిపోతాడు . మతి స్థిమితం లేని ఒకమ్మాయిని ఆమె అన్నావదినల అనుమతితో చికిత్స చేయటానికి తనింట్లో పెట్టుకుంటాడు .

Ads

చిన్నపిల్లను సాకినట్లు సాకి సాధారణ స్థితికి తీసుకొని వస్తాడు . ఒకరిని ఒకరు ప్రేమించుకుని ఒకటి అవుదామని అనుకుంటారు . తన థీసిసుని సమర్పించటానికి ఢిల్లీ వెళతాడు . ఆ సమయంలో చంద్రమోహన్ మేనల్లుడు వస్తాడు .

డాక్టర్ ఆమెను ప్రేమించరని , అదంతా చికిత్సలో ఒక భాగమని ఇంట్లో వంటాయన చెప్పిన మాటలు నమ్మి , డాక్టర్ గారి మేనల్లుడితో ప్రేమలో పడుతుంది హీరోయిన్ . ఢిల్లీ నుండి తిరిగొచ్చిన డాక్టరుకి వీళ్ళ ప్రేమ చిరాకు ఎత్తిస్తుంది , కోపం తెప్పిస్తుంది , చివరకు పిచ్చివాడు అవుతాడు . హీరోహీరోయిన్ల పాత్రలు రివర్స్ అవుతాయి .

ఈ సినిమాతో విజయశాంతికి సోలో హీరోయినుగా మంచి పేరు వచ్చింది . తన నటనను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం కలిగింది . ఆమె సద్వినియోగం చేసుకుంది . చంద్రమోహన్ ఇలాంటి పాత్రలకు పెట్టింది పేరు . చాలా బాగా నటించారు.

మేనల్లుడిగా రాజేష్ అంటే ఇప్పటి ఐశ్వర్యా రాజేష్ తండ్రి నటించారు . 1983 లోనే అతను అరంగేట్రం చేసాడు . ఇతర పాత్రల్లో కృష్ణవేణి , నళినీకాంత్ , జయమాలిని , నూతన్ ప్రసాద్ , రాళ్ళపల్లి , గోకిన రామారావు , గొల్లపూడి మారుతీరావు , అనిత , ప్రభృతులు నటించారు . జయమాలిని పాత్ర బాగుంటుంది .

సినిమా ఆల్మోస్ట్ ఔట్ డోర్లోనే తీసారు . నాగార్జున సాగర్ , ఎత్తిపోతల ప్రాంతాలలో షూట్ చేసారు . విజయ బాపినీడు , మాగంటి రవీంద్రనాథ్ చౌదరిలు నిర్మాతలు . బేనర్ పేరు లలనీ చిత్ర . పేరు గమ్మత్తుగా ఉంది . లలనీ అంటే ఏంటో ! వల్లభనేని జనార్దన్ దర్శకుడు . కన్నడం రీమేక్ అయినప్పటికీ జనార్దన్ బాగా హేండిల్ చేసాడని చెప్పవచ్చు .

కన్నడంలో సూపర్ హిట్ అయిన మానస సరోవరం అనే పిక్చరుకి రీమేక్ మన తెలుగు సినిమా . అమాయక చక్రవర్తికి బదులు ఆ మానస సరోవరం పేరే బాగుండేదేమో ! ఎందుకంటే సినిమాలో చంద్రమోహన్ మానస సరోవరం అనే కాన్సెప్టుని విరివిగా ప్రస్తావిస్తాడు . తన థీసిస్సుకు కూడా ఆ టైటిలే పెడతాడు .

కృష్ణ చక్రల సంగీతం బాగుంటుంది . పాటలు బయట హిట్ కాకపోయినా థియేటర్లో శ్రావ్యంగా ఉంటాయి . మానస సరోవరం ఈ మనసును తలపే మానస సరోవరం , అందం అందానికే ఒక అందం , వీణా వీణా ప్రణయ రాగ భరిత వనిత పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . చూడరా నీ ముద్దుల చిలకా చూడరా నీ పెంపుడు చిలకా భగ్న ప్రేమికుడి విషాద గీతం బాగుంటుంది .

విజయశాంతి హీరోయినుగా నిలదొక్కుకునేందుకు తిప్పలు పడుతున్న రోజుల్లో ఆమెకు మంచి పేరుని తెచ్చిన సినిమా . ఇక్కడ నుండే ఆమెకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు రావడం మొదలయింది . సినిమా బాగానే ఆడింది . సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . ఇంతకుముందు చూడనట్లయితే చూడండి .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎందుకు మంత్రి సీతక్క ఈ ఫోటో వైరల్ అయ్యిందో తెలుసా..?!
  • ఎందుకీ ఆందోళనలు..? వలసదారులపై ఎందుకు బ్రిటిషర్ల ఆగ్రహం..!?
  • పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడాల్సిందేననీ ట్రంపే చెప్పాడా ఏం..?!
  • హఠాత్తుగా ఎందుకో గానీ హైదరాబాద్ మెట్రో నష్టాల పాట..!!
  • నిజ జీవిత తలపై రాజశేఖర్ ‘తలంబ్రాలు’… షీరోయిక్ పాత్ర…
  • సీతాఫలం తినడం ఓ కళ..! చెంచాతో తింటే దాన్ని అవమానించినట్టే..!!
  • కేటీఆర్ మగ రాజకీయ భాష… ఆడతనమంటే చేతగానితనమట…
  • BB9Telugu..! ఫాఫం కింగ్ నాగార్జునకే అగ్నిపరీక్ష… నో బజ్, నో వ్యూయర్స్…
  • ఫాఫం మిరయ్… ఆ నిర్మాతలు ఎవరో గానీ… థియేటర్ వెళ్లే పనిలేదు..!!
  • టార్గెట్ సాక్షి ఎడిటర్..! జగన్ సన్నిహితగణంపై పాలకుల ప్రత్యేక దృష్టి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions