Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరీ నేత్రదానాన్ని కూడా అనుమానించే భర్త… జంధ్యాలకు తలబొప్పి…

April 10, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామీ, ఆడ ఉసురు తగలనీకు స్వామీ . ఈ అమరజీవి సినిమాలో విప్రనారాయణ నృత్య ప్రదర్శనలో పాట . అద్భుతంగా ఉంటుంది . దేవదేవిగా జయప్రద చాలా అందంగా నృత్యించింది , నటించింది .

విప్రనారాయణుడిగా అక్కినేని గురించి చెప్పేదేముంది . 1954 లోనే భానుమతితో ఓ కళాఖండాన్నే ఆవిష్కరించాడు . జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ ట్రాజెడీ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు .

Ads

ప్రేమించిన పడతి కోసం చూపు పోయిన ఆమె భర్తకు తన కళ్ళను దానం చేస్తాడు హీరో . ఆ నేత్రదానాన్ని కూడా అనుమానిస్తాడు ఆమె భర్త . ఆమె జీవితం బాగుపడాలంటే తాను ఈ లోకం నుండి నిష్క్రమించటమే పరిష్కారం అని భావించి విషం తాగి హీరో చనిపోయి అమరజీవి అవుతాడు .

కృష్ణంరాజు , జయసుధ , మురళీమోహన్ నటించిన అమరదీపం సినిమా గుర్తుకొస్తుంది . ముగింపు , ముగింపుకు కారణాలు ఒకే రకంగా కనిపిస్తాయి .

ట్రాజెడీ సినిమాలు సక్సెస్ కావడం అరుదే . కధ , చిత్రానుకరణ బలంగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు . నిజ జీవితంలో క్షణక్షణం అష్టకష్టాలు పడే సగటు జీవులు తమకు లేని వాటిని చూడటానికి సినిమాలకు వెళతారు .

దర్శకులు , నిర్మాతలు అక్కడ కూడా వాళ్ళని బాధాతప్త హృదయాలతో ఇళ్ళకు పంపడం అంటే పెద్ద సాహస ప్రయోగమే . అందుకే సినిమాలను ఎక్కువగా సుఖాంతం , సంతోషాంతం చేస్తుంటారు .

జంధ్యాల దర్శకత్వంలో చక్కగా సాగుతుంది ఈ సినిమా . జయప్రద , సుమలత , పండరీబాయి వంటి గొప్ప నటులు ఉన్నారు . వేటూరి పాటలు , చక్రవర్తి సంగీతం . అయినా ఆడకపోవటానికి కారణం విషాదాంతం .

చక్రవర్తి- వేటూరి కాంబినేషన్లో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణి , ఓదార్పు కన్నా చల్లనిది నిట్టూర్పు కన్నా వెచ్చనిది పాటలు చాలా బాగుంటాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , యస్ జానకిలు చాలా శ్రావ్యంగా పాడారు . (హైదరాబాద్ కుతుబ్ షాహా టోంబ్స్ దగ్గర తీశారు మల్లెపూల మారాణి పాటను… అలాగే హీరో హరీష్ బాలనటుడిగా అసురసంధ్యవేళ పాటలో కనిపిస్తాడు)…

ప్రాణం ఖరీదు సినిమాతో అరంగేట్రం చేసిన కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో రెండు మూడు నిమిషాలు కనిపిస్తాడు . ఆయనకు ఇది రెండో సినిమా అనుకుంటాను . ఇతర పాత్రలలో శరత్ బాబు , నరసింహరాజు , నాగేష్ , సుత్తి వేలు , శ్రీలక్ష్మి , కాంతారావు , ప్రభృతులు నటించారు .

1983 ఆగస్టులో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . అక్కినేని , జయప్రద అభిమానులు చూసి ఉండకపోతే చూడండి . విప్రనారాయణ నృత్య ప్రదర్శన వీడియో కూడా యూట్యూబులో ఉంది . Don’t miss it . చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది . కూస్తంత కళాపోషణ కూడా ఉండాలి కదా ! #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మేడారంపై ప్రభుత్వ వీడియో… అందులో కాపీ కంటెంటు… ఓ వివాదం..!!
  • జననాయగన్..! విజయ్ సినిమా సెన్సార్ సమస్యలకు రాజకీయ రంగు..!!
  • రాజా సాబ్‌కు మరో అప్రతిష్ట… నాచే నాచే ట్యూన్ పక్కా చోరీ అట..!!
  • నాటో భవిష్యత్తు అటో ఇటో..! ప్రపంచ రాజకీయాల్లో పెనుమార్పులు..!!
  • సంక్రాంతి కంబాలా పోటీలో మరో హీరో ‘మునిగిపోయాడు’… సెకండ్ వికెట్..!!
  • ఎనర్జీ డిప్లొమసీ..! ఇండియా మౌనం వెనుక ‘చమురు వ్యూహాలు’..!!
  • కొన్ని సినిమా ప్రయోగాల్ని రామోజీరావే చేయగలిగాడు… కానీ..?
  • అస్తవ్యస్తత..! సినిమాలపై తెలంగాణ ప్రభుత్వ విధానరాహిత్యం..!!
  • ఇక్కడ అత్యంత భారీ విగ్రహం… అక్కడ ఓ జ్ఞాపకం తెగనమ్మకం…
  • బెంగాల్ ‘శివగామి’ స్ట్రీట్ ఫైట్… ఆ ఆకుపచ్చ ఫైలులో అసలు మర్మమేంటి..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions