.
ఎస్, సినిమాల ప్రీమియర్లను ఎవడూ దేకడం లేదు టీవీల్లో… ఆ సుదీర్ఘ యాడ్స్… సినిమా వచ్చినంతసేపూ టీవీ ముందే కూర్చోవల్సి రావడం…
దానికి బదులు ఓటీటీలో వచ్చేదాకా ఆగి, ఎంచక్కా ఆపుతూ, వెనక్కి వెళ్తూ, రిపీట్ సీన్స్, మనకు ఇష్టమున్న టైములో… ఇష్టమున్న రోజున సినిమా చూడటమే ప్రస్తుతం ప్రేక్షకుల ప్రయారిటీ…
Ads
ఎటొచ్చీ దిక్కుమాలిన ఓటీటీ రేట్లను సబ్‌స్క్రయిబ్ చేయలేని వాళ్లే టీవీల్లో సినిమాలను చూస్తున్నారు… మరీ దరిద్రం ఏమిటంటే, ఈమధ్య ఓటీటీలు కూడా పే పర్ వ్యూ విధానం పాటిస్తుండటం… ఒరేయ్ వెధవల్లారా, మీకు డబ్బు అదనంగా కట్టే బదులు థియేటర్‌కే వెళ్లి నిలువు దోపిడీ ఇస్తాం కదరా అనుకుని ప్రేక్షకులు వాటిీ అవాయిడ్ చేస్తున్నారు… ఐనా ఈ గాడిదలకు అర్థం కాదు…
అమరన్… ఈ సినిమా తెలుసు కదా… సోకాల్డ్ ఆ తమిళ హీరో శివ కార్తికేయనో, ఏదో పేరుంది… అంత పెద్ద ఇంప్రెసివ్ నటన ఏమీ కాదు గానీ సాయిపల్లవి కారణంగా సినిమా హిట్టయింది… అది రియాలిటీ… దాన్ని స్టార్ మాటీవీలో ఇటీవల ప్రసారం చేశారు…
నిజానికి స్టార్ మాటీవీ రీచ్ ఎక్కువ… వాడు దేన్నయినా రేటింగ్స్‌లో మాయ చేయగలడు… అసలు బార్క్ రేటింగ్స్‌ను శాసించేది వాడే… సో, ఆ స్థితిలో ఉంది కాబట్టే ఈ అమరన్ మూవీకి 7.09 (హైదరాబాద్ బార్క్) రేటింగ్స్ తెప్పించగలిగాడు వాడు… నిజానికి పెద్ద పెద్ద తోపు స్టార్ హీరోల భారీ సినిమాలనే ఎవడూ దేకడం లేదు టీవీల్లో… థియేటర్ వసూళ్లు పెద్ద మాయ, ఫేక్…
నిజానికి ఇది థియేటర్లలో హిట్ అనే ముద్ర వేశారు కదా… సరే, దాన్నలా వదిలేస్తే… స్టార్ మాటీవీ వాడి మాయ ఎలా ఉంటుందంటే..? కార్తీకదీపం 2.0 పెద్ద ఫ్లాప్ సీరియల్… టీవీ శోభన్ బాబు నిరుపమ్ పరిటాల, వంటలక్క నటిస్తున్నా సరే… 1.0 బాపతు తిక్క ప్రయోగాలు ప్లస్ ఈ 2.0 బాపతు పైత్యం కలిసి నిజానికి ఎవడూ పెద్దగా దేకడం లేదు దాన్ని… ఐనాసరే 13 రేటింగులతో టాప్… ఏదో ఉంది… ఆ మహారాష్ట్ర గాడిద పోలీసులు ఏదైనా నిజాయితీగా దర్యాప్తు చేస్తే స్టార్ మాటీవీ వాడు అడ్డంగా బుక్ కావడం ఖాయం అనిపిస్తోంది…
కేంద్రంలో ప్రసార మంత్రి ఎవరో గానీ… పరమ దరిద్రం… సరే, దాన్నలా వదిలేస్తే… తెలుగులో టాప్ 30 ప్రోగ్రామ్స్ మొత్తం మాటీవీవే… చచ్చీచెడీ ఏదో చెత్తను ప్రసారం చేస్తున్నా సరే జీతెలుగు ఎప్పటికప్పుడు ఫ్లాప్ షో రేటింగ్స్ సాధనలో…
ఈటీవీ గురించి చెప్పడానికి ఏమీ లేదు… దాని దురవస్థ ఏమిటంటే..? ఈరోజుకూ ప్రైమ్ టైమ్ న్యూస్ రేటింగ్సే టాప్ దాని జాబితాలో… న్యూస్‌కూ వినోదానికీ రిలేషన్ ఏమిటీ అంటారా..? ఈటీవీ మార్క్ మేనేజ్‌మెంట్ అదే… దానికి అదేమీ సిగ్గుపడదు… జబర్దస్త్, ఢీ, డ్రామా కంపెనీ వంటి బూతు షోల చానెల్‌కు అదంటూ ఉంటే కదా…
చివరగా… కేవలం యూట్యూబ్ బిట్లతో నాలుగు చిల్లర పైసలు ఏరుకునే ఈటీవీ రీచ్ దుర్గతి ఏమిటో తెలుసా..? క అనే సినిమా థియేటర్లలో ఓ మోస్తరు హిట్ కదా… కానీ ఈటీవీలో దాన్ని ప్రసారం చేస్తే జస్ట్ 2 రేటింగ్స్… ఫాఫం ఈటీవీ… చివరకు దాన్ని ఏ స్థితికి తీసుకుపోయారో కదా… ఒక్కటంటే ఒక్క రియాలిటీ షో కూడా క్లిక్ కావడం లేదు… ఎవడూ చూడటం లేదు..!!
రాబోయే రోజుల్లో ఎంత తోపు స్టార్ హీరో అయినా సరే… టీవీల ముందు కూర్చుని ఏ ప్రేక్షకుడూ దేకడానికి సిద్ధంగా లేడు… ఎవడైనా టీవీ రైట్స్ కోసం అడ్డగోలు రేట్లు పెడితే… వాడి ఖర్మ… దివాలా కేరక్టర్ అని లెక్క..!!
Share this Article