Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో… ఆడవాళ్ల కన్నీళ్లతో తెర తడిసిపోతేనే మహిళాచిత్రం…

April 18, 2024 by M S R

Subramanyam Dogiparthi…. మహిళలు మెచ్చిన చిత్రం . సినిమాలో ఆడవారికి ఎంత ఎక్కువ కష్టాలు ఉంటే , ఆ సినిమాను మహిళలు అంత ఎక్కువగా ఆడిస్తారు అనే వారు 1970 ల దాకా . ఆ తర్వాత మహిళా ప్రేక్షకుల సినిమా అభిరుచుల్లో మార్పు వచ్చింది . బహుశా మహిళల హక్కులు , రక్షణ వంటి అంశాలలో కూడా క్రమంగా మార్పులు వచ్చాయనుకోండి .

అన్నపూర్ణ వారి బేనర్లో డి మధుసూధనరావు నిర్మాణంలో చాలా కుటుంబ కధా చిత్రాలు , నవలల ఆధారంగా చిత్రాలు వచ్చాయి . బాగా ఆడాయి . 1971 లో వి మధుసూధనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ అమాయకురాలు సినిమా Feel Good Musical Hit Movie . యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో చాలా శ్రావ్యమైన హిట్ సాంగ్స్ ఉన్నాయి .

పాడెద నీ నామమే గోపాలా వీణ పాట చెవుల తుప్పును వదిలిస్తుంది . రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం అంటే ప్రేక్షకులు కూడా వీణ పాట ఆశిస్తారు . సన్నా జాజి పూవులు చందామామ కాంతులు , హల్లో సారూ భలే వారూ చెలి వలపు తెలుసుకోరు , కొంటె పిల్లా కోరుకున్న జంట దొరికింది పాటలు శ్రావ్యంగా , హుషారుగా ఉంటాయి . గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకుని కూర్చొని , చిన్నారి పైడి బొమ్మ కన్నీరు ఎందుకమ్మా వంటి విషాద గీతాలు కూడా బాగుంటాయి .

Ads

శారద ఉంటే విషాద గీతాలు ఉండాలి కదా . మనుషులు మారాలి సినిమా తర్వాత చాన్నాళ్ళు శారదకు ఒకప్పుడు శ్రీరంజనికి లాగానే విషాద పాత్రలు వచ్చాయి . తర్వాత తర్వాత పరుచూరి బ్రదర్స్ ఆమెను షీరో పాత్రల్లో చూపించారు . ఈ సినిమాలో కూడా ఆమే అష్టకష్టాలకు గురయ్యే అమాయకురాలు . అక్కినేనికి ఇలాంటి సంఘర్షణలతో కూడిన పాత్రలు కొట్టిన పిండే .

వీరితోపాటు కాంచన , చంద్రమోహన్ , భానుప్రకాష్ ,రాధాకుమారి , నాగభూషణం , సూరేకాంతం , గుమ్మడి , మాడా , అల్లు రామలింగయ్య , రమణమూర్తి , రాజబాబు , రమాప్రభ ప్రభృతులు నటించారు . బేబీ పద్మిని కుమారి పద్మిని అయింది ఈ సినిమాతో . మాడాకు గుర్తింపు వచ్చిన మొదటి సినిమాయేమో ఇది !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా ఈ సినిమాకు కాంస్య నంది పురస్కారాన్ని ప్రసాదించింది . మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసినట్లు గుర్తు . యూట్యూబులో ఉంది . కుటుంబ కధా చిత్రాలను ఇష్టపడే వారు తప్పక చూడతగ్గ సినిమా . ముఖ్యంగా పాటలు చాలా బాగుంటాయి .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions