ఫ్యూచర్ గ్రూపు అనే సంస్థ స్థాపించిన వ్యక్తి కిశోర్ బియాని గారు. ఫ్యూచర్ గ్రూపు అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ బ్రాండ్ ఫ్యాక్టరీ, పాంటలూన్స్, బిగ్ బజార్, సెంట్రల్ ఇవి తెలుసు కాదా, వీటి అన్నింటినీ స్థాపించిన వ్యక్తి కిశోర్ బియానీ గారు. కిశోర్ బియానీ తల్లితండ్రులది సాంప్రదాయ బట్టల వ్యాపారం. ఒకచోట కొని ఇంకోచోట అమ్మే సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం. కిశోర్ బియానీ గారు చదువు అయ్యాక తనకి తెలిసిన దానికే మెరుగులు దిద్ది కష్టపడుతూ, ఒకో మెట్టు ఎక్కుతూ ఇండియన్ వాల్ మార్ట్ గా పిలవ బడే ఫ్యూచర్ గ్రూపు ని స్థాపించి ఇండియన్ రీటైల్ రాజా గా ప్రసిద్ధుడు అయ్యాడు…
శ్యాం వాల్టన్ ఆఫ్ ఇండియా
Ads
కిశోర్ బియానీ గారు అత్యంత నిజాయితీ పరుడు మరియూ అత్యంత ఎక్కువ కష్టపడే వ్యక్తి. నిజానికి నాకు కిశోర్ బియాని గురించి పెద్దగా తెలియదు. 2015 ఆగష్ట్ ఆ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీ వెళ్తున్నా. కిశోర్ బియాని “ది శ్యాం వాల్టన్ ఆఫ్ ఇండియా” అని ఒక బిజినెస్ మ్యాగజైన్ లో ఆర్టికల్ చూశా. శ్యాం వాల్టన్ అంటే అమెరికాలో వాల్ మార్ట్ స్థాపించిన వ్యక్తి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో బిల్ గేట్స్, వారెన్ బఫెట్, ల్యారీ ఎలిసన్, కార్లోస్ సిం లాంటోళ్ళు మనకి తెలుసు. కానీ గత 20 సంవత్సరాలుగా టాప్ 20 ప్రపంచ అత్యంత ధనవంతుల్లో ఎప్పుడూ ఉండే పేర్లు అమెరికన్ రీటైల్ సంస్థ వాల్ మార్ట్ వాళ్ళవే. “నీవు తినాలే తప్ప నిన్ను ఒకడు తినేసే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు” అనే మనస్తత్వం వాల్ మార్ట్ శ్యాం వాల్టన్ ది. మరొక పోస్టులో అతని గురించి పూర్తిగా చూద్దాం.
కిశోర్ బియాని గురించి రాసిన ఆ ఆర్టికల్ లో “శ్యాం వాల్టన్ ఆఫ్ ఇండియా” అనేసరికి కిశోర్ బియానీ గారి గురించి పూర్తిగా తెలుసుకోవటం ప్రారంభించాను. కిశోర్ బియానీ గారు రాసిన “It Happened in India” అనే ఆటో బయోగ్రఫీ పుస్తకం భారతదేశ వ్యాపారరంగం గురించి రాసిన పుస్తకాల్లో అత్యంత ఎక్కువగా అమ్ముడు పోయింది. తాను ఫాంటలూన్స్ ఏ విధం గా స్థాపించాడు, బిగ్ బజార్, సెంట్రల్ మరియూ Great indian consumer గురించి చాలా విషయాలు రాశారు. ఇంకా కిశోర్ బియానీ గారు ఫుడ్ బజార్, ఈ జోన్, FBB ఇతర ఈ కామర్స్ సంస్థలు కూడా ప్రారంభించారు.
అసలు గేమ్ షురూ…
నాకు తెలిసి 75-100 నగరాల్లో 1000-2000 బిగ్ బజార్ స్టోర్ లే ఉన్నై. మరియూ చాలా వేల ఎకరాల స్థలం కూడా ఉంది. కిశోర్ బియానీ గారు సామాన్యుడి నుంచి శ్యాం వాల్టన్ ఆఫ్ ఇండియాగా ఎదిగిన తీరు నిజంగా ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం, ప్రతి మెట్టూ నిజాయితీతోనే ఎక్కారు. ఎప్పుడైతే అమెజాన్ ఇండియాలోకి ప్రవేశించిందో అప్పటి నుంచి ఫ్యూచర్ గ్రూపు లాభాలు తగ్గుముఖం పట్టాయి. ఫ్యూచర్ గ్రూపు కిశోర్ బియానీ గారు 22 వేల కోట్లకి తన సంస్థలోని ఫ్యూచర్ రీటైల్ ని రిలయన్స్ ముకేష్ అంబానీ గారికి అమ్మారు.
అమెజాన్ డేంజర్ ప్లాన్
అమెజాన్ వాడు ఫ్యూచర్ గ్రూపులోని ఒక విభాగం ఫ్యూచర్ కూపన్స్ అనే దానిలో 1000 కోట్లు విలువ చేసే 49% షేర్లు కొన్నాడు. ముఖేష్ అంబానీకి ఫ్యూచర్ రీటైల్ అమ్మటం నాకు ఇష్టం లేదు అంటూ అమెజాన్ వాడు సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్ట్ లో పిటీషన్ వేసి, ఆ అమ్మటాన్ని నిలపాల్సిందిగా స్టే తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ఇండియన్ స్టాక్ మార్కెట్ కి, ఇండియన్ బిజినెస్ రెగ్యులేటరీ సంస్థలకీ లేఖలు రాశాడు.
వందల యేండ్ల క్రిందట ఈస్ట్ ఇండియా కంపనీ మన దేశంలో వ్యాపారం చేసుకోటానికి వచ్చి, క్రమం క్రమంగా ఒకరికి ఒకరికి గొడవలు పెట్టి, విభజించి, చివరికి పూర్తిగా ఆక్రమించుకొని, 200 యేండ్లకి పైగా మన దేశాన్ని పీల్చి పిప్పి చేసుకున్న వైనం అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం భారతీయ కంపనీ ఫ్యూచర్ గ్రూపులోని ఫ్యూచర్ రీటైల్ ని మరో భారతీయ కంపనీ రిలయన్స్ కి అమ్మటాన్ని అమెజాన్ అడ్డుకుంటున్నాడు. వాడి వాదన ఏంటి అంటే ఒక సంస్థలో మెజార్టీ షేర్లు ఉన్నప్పుడు వాడికి ఇష్టం లేకుండా ఎవరికీ అమ్మకూడదు అని… నిజానికి అమెజాన్ కి ఫ్యూచర్ రీటైల్ లో షేర్లు లేవు… కానీ ఇవి అన్నీ ఫ్యూచర్ గ్రూప్ క్రిందకే వస్తాయి కదా, ఫ్యూచర్ గ్రూపులోని ఫ్యూచర్ కూపన్స్ లో నాకు 49% షేర్లు ఉన్నై, నా పోటీదారుడు రిలయన్స్ ముఖేష్ అంబానీకి అమ్మకూడదు అని వాదనలు జరుగుతున్నై…
అమెజాన్ అతి తెలివి
ప్రస్తుతం ఫ్యూచర్ రీటైల్ షేర్లు బాగా పడిపోయి చాలా నష్టాల్లో ఉంది. ఫ్యూచర్ వాళ్ళు మాత్రం మొత్తం ఒకే గొడుకు క్రిందకు వచ్చినా ఫ్యూచర్ రీటైల్ వేరు, ఫ్యూచర్ కూపన్స్ వేరు. నీకు షేర్లు ఉన్నై ఫ్యూచర్ కూపన్స్ కదరా బాబు అని అంటున్నారు. ఢిల్లీ కోర్ట్ లో వాదోపవాదనలు రెండు వైపులా జరుగుతున్నై. అమెజాన్ ప్లాన్ ఎంత భయంకరంగా ఉందో చూశారా..? పది మంది అన్నదమ్ములు ఉన్న ఒక కుటుంబంలోని చిన్నవాడి కంపనీలో 49% షేర్లు కొనిచ ఆ కుటుంబం అంతా నేను చెప్పినట్లే చేయాలి అంటుంది అమెజాన్.
ఒకవేళ కోర్ట్ లో అమెజాన్ గెలిస్తే ఇండియన్ రీటైల్ అంతా అమెజాన్ వాడు ఆక్రమించుకుంటాడు. అది మరీ ఘోరమైన మోనోపలీకి దారితీస్తుంది. ఒకవేళ ఫ్యూచర్ వాళ్ళే గెలిసినా… అంటే తమ సొంత కంపనీని అమ్ముకోవటానికి పర్మీషన్ తెచ్చుకున్నా అమెజాన్ వాడు ఇండియాలో పెట్టుబడులు ప్రమాదం అని ప్రపంచవ్యాప్తంగా విషప్రచారం చేస్తాడు.
అంబానీకే చెమటలు…
ఒకవైపు ఇండియన్ రీటైల్ రాజా కిశోర్ బియానీ గారు, మరో వైపు ఇండియన్ టైకూన్ రిలయన్స్ ముఖేష్ అంబానీ కే చెమటలు పట్టిస్తున్నాడు అమెజాన్. ముఖేష్ అంబానీకి అనుకూల ప్రభుత్వమే అధికారంలో ఉన్నా సరే, అమెజాన్ వాడి చెప్పు చేతల్లో నడుస్తుంది ప్రస్తుతం. రేపటి నాడు వ్యవసాయం ప్రయివేటీకరణ అయినా జరిగేది ఇదే; బయటివాళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటే పెడతారు. అ తర్వాత వాళ్ళ మెక్ డోనాల్డ్స్, బర్గర్ కింగ్, KFC, బార్భిక్యూ రెస్టారెంట్స్, డొమినోస్ ఫిజా మొదలగు వాటికి కావాల్సిన పదార్దాలకి సంబంధించిన పంటలు వేయమంటారు. ఏ పార్టీకి, ఏ నాయకుడికీ ఈ పోస్ట్ తో సంబంధం లేదు. 137 కోట్ల ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ఎవరికి వారు తమ సొంతంగా ఆలోచించాల్సిన విషయం…
Share this Article