Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పార్టీలు చెప్పేవి శ్రీరంగనీతులు – అఖిలేషుడూ ఆ తానులో ముక్కే !!

October 2, 2026 by M S R

.

దేశంలోని ప్రతి పార్టీకి బోలెడు ఎన్నికల నిధులు సమకూర్చే ఓ తమిళ లాటరీ కింగ్ ‘పవర్ వ్యూహం’ గురించి గతంలో చెప్పుకున్నాం కదా… తన ‘ప్రొటెక్షన్’ కోసం భార్య అన్నాడీఎంకే నుంచి, కొడుకు పుదుచ్చేరి ఎన్డీయే నుంచి, అల్లుడు టీవీకే పార్టీ నుంచి నిలబడ్డారు… అందరూ గెలిచారు… అంటే పవర్ పక్షం మనమే, ప్రతిపక్షం మనమే, తటస్థ పక్షమూ మనమే… వావ్, ఏం రాజకీయం..?

ఆ లాటరీ కింగ్ పేరు సెంటియాగో మార్టిన్… కొడుకు జోస్ చార్లెస్ మార్టిన్, ఎల్‌జేకే పార్టీ, ఎన్డీయే మద్దతు… అల్లుడు ఆధవ్ అర్జున్, టీవీకే నుంచి… ప్రస్తుతం మంత్రి… భార్య లీమా రోజా మార్టిన్, అన్నాడీఎంకే… మ్, అంబానీ… తను గానీ, తన కుటుంబసభ్యులు గానీ నిలబడరు… కానీ సేమ్ ఆ లాటరీ కింగ్ ఎత్తుగడలాగే… వివిధ పార్టీల నుంచి తన ప్రతినిధులను రాజ్యసభకు పంపిస్తుంటాడు…

Ads

పవర్ పక్షం, ప్రతిపక్షం, తటస్థ పక్షం… అన్ని పక్షాలూ తనవే… ఉత్తరప్రదేశ్‌లో అక్టోబర్ 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించిన రెండు పేర్లలో ఒకటి సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్… రెండో పేరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది… అది రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ధన్‌రాజ్ పరిమల్ నాథ్వానీ…

ధన్‌రాజ్ ఎవరు అని చూస్తే అసలు కథ అక్కడే మొదలవుతుంది… ధన్‌రాజ్ నాథ్వానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు… ఆయన తండ్రి పరిమల్ నాథ్వానీ కూడా సాధారణ రాజకీయ నాయకుడు కాదు… రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో డైరెక్టర్–కార్పొరేట్ అఫైర్స్‌గా పనిచేస్తున్న పరిమల్ నాథ్వానీ 2008 నుంచి రాజ్యసభలో ఉన్నాడు…

మొదట ఝార్ఖండ్ నుంచి స్వతంత్రుడిగా రెండుసార్లు ఎన్నికయ్యాడు… రాజ్యసభకు ఇండిపెండెంటుగా నిలబడి గెలవడం అంటే ఎంత వ్యయప్రయాసో తెలుసు కదా… ఐనా అంబానీ ప్రతినిధి కదా… లోటేముంది..? 2020లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లాడు… 2026 జూన్‌లో మళ్లీ ఝార్ఖండ్ నుంచి బీజేపీ, ఎన్డీయే మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి నాలుగోసారి రాజ్యసభలోకి వచ్చాడు…

అంటే తండ్రి ఒకవైపు ఎన్డీయే మద్దతుతో రాజ్యసభలో ఉన్నాడు… పేరుకు స్వతంత్రుడు, తటస్థుడు… ఇప్పుడు కుమారుడు ఎన్డీయేకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తున్నాడు… వారెవ్వా… నిజానికి రాజ్యసభ అంటే ఏమిటి?

లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలతో నేరుగా పోటీ చేయలేని వారికి రాజకీయ పునరావాస కేంద్రం మాత్రమేనా? లేక ప్రజాస్వామ్య వ్యవస్థకు అవసరమైన మేధావులు, నిపుణులు, సామాజిక స్పృహ ఉన్నవారు, ప్రజా జీవితంపై లోతైన అవగాహన ఉన్నవారు దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన వేదికా? ధనిక, పారిశ్రామికవేత్తల ప్రతినిధులకూ వేదికేనా..? ఈ ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది…

అసలు రాజ్యసభకు ఒక పార్టీ ఏం చూసి అవకాశం ఇవ్వాలి..? పార్టీకి అత్యవసరంగా అవసరమైన రాజకీయ వ్యూహకర్తకా? ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని పెద్దమనిషికా? పార్టీకి ఆర్థికంగా, సంస్థాగతంగా ఉపయోగపడే వ్యక్తికా? లేక ప్రజా జీవితంలో ప్రత్యేకమైన అనుభవం, సామాజిక సమస్యలపై అవగాహన, శాసనపరమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తికా?

ధన్‌రాజ్ నాథ్వానీ దాఖలు చేసిన అఫిడవిట్ మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది… ఆయన, ఆయన భార్య కలిపి ప్రకటించిన ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంది… కొన్ని నివేదికలు కుటుంబ ఆస్తులను ₹370 కోట్లకు పైగా చూపించగా, టైమ్స్ ఆఫ్ ఇండియా అఫిడవిట్‌లోని స్థిరాస్తుల లెక్కల ఆధారంగా మొత్తం ప్రకటిత ఆస్తులు ₹705.42 కోట్లుగా పేర్కొంది…

ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఉంది… సమాజ్‌వాదీ పార్టీ రాజకీయంగా PDA — పిచ్‌ఛడా, దళిత్, అల్పసంఖ్యాక అనే సామాజిక సమీకరణాన్ని ముందుకు తెస్తోంది… అలాంటి సమయంలో పార్టీ రాజ్యసభకు ఎంపిక చేసిన రెండో వ్యక్తి ఒక పెద్ద కార్పొరేట్ గ్రూప్‌లో ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ కావడం సహజంగానే చర్చకు దారితీసింది…

అసలు ప్రశ్న సమాజ్‌వాదీ పార్టీ ఒక్కదానికే పరిమితం కాదు… ఇది దాదాపు అన్ని పార్టీలకూ వర్తించేదే… పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ, క్రీడలు, టెక్నాలజీ, వ్యవసాయం, విద్య, వైద్యం… సమాజానికి ఉపయోగపడే అనుభవం ఉన్నవారు పార్లమెంటులో ఉండటం తప్పు కాదు… కానీ ఇప్పుడు చూస్తుంటే కొన్నిసార్లు రాజ్యసభ సీట్లు రాజకీయ పార్టీలకు పార్టీ విధేయతకు బహుమతులు, వ్యాపార ప్రపంచంతో సంబంధాలకు వంతెనలు, రాజకీయ అవసరాలకు ఉపయోగపడే వ్యక్తులకు పార్లమెంటరీ ప్రవేశ ద్వారాలు అన్న భావన కలిగిస్తున్నాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పార్టీలు చెప్పేవి శ్రీరంగనీతులు – అఖిలేషుడూ ఆ తానులో ముక్కే !!
  • Sigma – తమిళ సీఎం విజయ్ కొడుకు సంజయ్‌కు ఓ ఫ్లాప్ డెబ్యూ !!
  • ఆపదామపహర్తారం… ఆ ఆపదలో స్మిత్ ధైర్యం హనుమంతుడే!
  • ఏమిట్లు..? ఇంతకీ ఈ ఫ్లయింగ్ హీరో స్మిత్ మచ్చర్ మనోడేనా..?
  • ఇల్లు కూడా లేని ఓ నిరుపేద బుక్కెడు బువ్వకై స్టార్ హోటల్ కట్టుకున్నా తప్పేనా..?!
  • ఆ ఒక్కటీ తక్కువైంది షెకావత్తూ… అదే ఎమోషనల్ థ్రిల్! వెరసి ట్రబుల్!!
  • అనుకోని అనుకూలతలు – లేకపోతే మధ్యప్రాచ్యం మండిపోయేది!
  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions