జగన్ లెక్కలు సగటు విశ్లేషకుడికే కాదు… తన అంతరంగికులు అని చెప్పుకునేవారికీ అంతుపట్టవ్… తన ఆలోచనలు అంత తేలికగా ఎవరికీ అర్థం కావు… ఎక్కడ తగ్గాలో, ఎక్కడ దూకుడుగా వెళ్లాలో తన ఎత్తుగడలు తనవి… మంచో చెడో, ఏ రిజల్ట్ ఇస్తాయో అనవసరం… తను అనుకున్నది ఫైనల్… ఆ లెక్కల వెనుక ఏమున్నదీ అనేది కూడా అప్రస్తుతం… అంతే… జగన్ అడుగులు, ఆలోచనలు నాకు మొత్తం తెలుసు అని ఎవరైనా అన్నారూ అంటే అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు… ఇప్పుడు చర్చ ఏమిటంటే..? జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశాడు, ఏం చర్చించాడు…? బీజేపీ ఏం కోరుకుంటోంది జగన్ నుంచి… జగన్ బీజేపీ నుంచి ఏం కోరుకుంటున్నాడు..? జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలవడం వేరు, అమిత్ షాతో దాదాపు ముప్పావుగంట కూర్చుని మంతనాలు చేయడం వేరు… పోలవరం పైసలు అడిగాడు, ప్రత్యేక హోదా అడిగాడు, తొక్కాతోలూ మరిచిపొండి… జగన్ కేంద్రంలో పెద్దల్ని కలిశాడంటే, చాలా క్రూషియల్ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ బోలెడు ఉంటయ్… ఆ ఇద్దరే కలిసినప్పుడు ఏం జరిగిందీ అని ఊహాగానాలు రాసుకోవడమే తప్ప, అమిత్ షా చెప్పడు, జగన్ చెప్పడు… అయితే..?
ఆంధ్రప్రభలో ఓ వార్త కనిపించింది… ఆదానీకి రాజ్యసభ సభ్యత్వం గురించి అమిత్ షా చర్చించాడూ అని… నిజానికి పెద్ద నమ్మబుల్ అనిపించదు… ఎందుకంటే..? రిలయెన్స్ ప్రతిపాదించిన పరిమళ్ నత్వానీకి జగన్ ఓ రాజ్యసభ సీటు ఇవ్వడం ఓ కథ… దానికి జగన్ లెక్కలు జగన్‌కు ఉన్నయ్… అవి లోతైన విశ్లేషణలకు అందవ్… తన తండ్రి మరణానికి ముఖేష్ కారకుడు అనే భావన జగన్‌లో ఎంత ఉందో, ఏమిటో మనకు తెలియదు గానీ… ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, కేంద్రాన్ని శాసించే స్థితిలో ఉన్న ముఖేష్‌తో జగన్ సయోధ్యలోకి వెళ్లిపోయాడు… తన లెక్కలు తనవి… మన విశ్లేషణలు మన పైత్యమే తప్ప నిజానిజాలు ముఖేష్, నత్వానీ, జగన్, మోడీ, అమిత్ షాలకు తప్ప ఇంకెవరికీ తెలియదు, అర్థం కాదు… సేమ్, ఆదానీ… నిజానికి ఆదానీకి రాజ్యసభ సభ్యత్వం కావాలీ అనుకుంటే జగన్ కాదు, పలు పార్టీలూ సిద్ధమే… ఆదానీ పొజిషన్ అది ఇప్పుడు… మోడీకి అత్యంత సన్నిహితుడు… అంతేకాదు, జగన్‌కు కూడా సన్నిహితుడే… అరె, జగన్‌కూ, బీజేపీకి నడుమ బలమైన సంధానకర్త తను… బీజేపీ అడగాల్సిన అవసరమే లేదు, ఆదానీ అడగడమే ఆలస్యం… జగన్ వోకే అంటాడు… అయితే..?
Ads
ప్రస్తుతం రాజ్యసభకు ఏపీ నుంచి ఖాళీల్లేవ్, వెళ్లేవాళ్లు లేరు… మరి ఇప్పుడు ఆదానీ రాజ్యసభ సభ్యత్వం చర్చల్లోకి ఎందుకు వస్తోంది..? తెలియదు..! ఒకవేళ బీజేపీ గనుక తన ఆబ్లిగేషన్‌గా ఆదానీ రాజ్యసభ సీటు అడిగితే జగన్‌కు మరీ మరీ హేపీ… తన దోస్త్, పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అడగడం… ఎంచక్కా వోకే అంటాడు… పరిమళ్ నత్వానీనే ఆమోదించినవాడు ఆదానీని అక్కున చేర్చుకోడా ఏం..? పైగా రాబోయే రోజుల్లో అంబానీలకు దీటుగా ఆదానీ ఎదగబోతున్నాడు… ఇప్పటికే చాలాదూరం వచ్చేశాడు… జగన్ కూడా వ్యాపారి కమ్ పొలిటిషియన్… కాకపోతే జగన్ ప్రజాక్షేత్రంలో పోరాడేవాడు… సవాళ్లకు ఎదురీదేవాడు… రిస్క్ టేకర్ అండ్ ఫైటర్… కానీ నత్వానీలు, ఆదానీలు జస్ట్, పరోక్ష పద్ధతిలో చట్టసభల్లోకి అడుగు పెట్టేవాళ్లు… సో, డిబేట్ వరకూ ఇది వోకే ప్రస్తుతానికి..! నిజంగా రాజ్యసభ సభ్యత్వాల నిర్ణయాలకొచ్చేసరికి రాజెవరో, బంటెవరో…!!
Share this Article