.
నిజానికి అంబటి రాయుడికి పిచ్చి వ్యాఖ్యలు, తిక్క చేష్టలు కొత్తేమీ కాదు… ఇప్పుడు కొన్నాళ్లుగా ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఎవడికీ తెలియదు కదా… అందుకని సోషల్ మీడియా, మీడియా తెర మీదకు రావడానికి ఓ శుష్క ప్రయత్నం చేసినట్టున్నాడు… నిజానికి అంత ఆలోచించేంత సీన్ ఉందానేదీ సందేహమే…
విషయం ఏమిటంటే… నిన్నటి పాకిస్థాన్ మ్యాచు సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం నడుస్తున్నప్పుడు… చిరంజీవి, సుకుమార్, లోకేష్ తదితరులు మ్యాచును ఎంజాయ్ చేస్తూ కనిపించారు… చిరంజీవి ఇద్దరు తెలుగు ప్లేయర్లతో కలిసి కనిపించాడు… ఆ మ్యాచ్ కోసం దుబాయ్‌కి చాలామంది ప్రముఖులు వెళ్లారు… పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్ అంటే ఆ ఎమోషన్ వేరు కదా…
Ads
ఓ కామెంటేటర్ మ్యాచుకు డిమాండ్ ఉంది కదా అని ఏదో అంటుంటే అంబటి రాయుడు కలగజేసుకుని, ఇలాంటి మ్యాచులకు వస్తే ఎక్కువసార్లు కనిపిస్తారు కదా, పబ్లిసిటీ స్టంట్ అది అని ఏదో కూశాడు… ఈమధ్య తెలుగు సెలబ్రిటీలు ఎక్కడ నోళ్లు విప్పినా పిచ్చికూతలే కదా… రాయుడు మాత్రం ఏం తక్కువా..?
ఇది విన్నాక నెటిజనం సహజంగానే అంబటి రాయుడిని తిట్టిపోశారు నెట్‌లో… నిజమే కదా… ఓ మామూలు నటుడి స్థాయి నుంచి పద్మవిభూషణ్ స్థాయి దాకా చిరంజీవిది ఖచ్చితంగా ఎవరూ కాదనలేని ఓ విజయప్రస్థానం… తనను అనేక కారణాలతో విభేదించేవారు కూడా తన సక్సెస్ స్టోరీని, తన పాపులారిటీని కాదనలేరు…
మ్యాచుల టీవీ ప్రసారాల్లో కనిపించాలని ఇలా ప్రయత్నిస్తాడు అంటే తెలుగునాట చిన్న పిల్లాడు కూడా నవ్వుకుంటాడు ఆ వ్యాఖ్యలను… అలాగే సుకుమార్… పుష్పతో పాన్ ఇండియా పాపులారిటీ వచ్చింది… ఈ బోడి ప్రచారం అవసరమా తనకు..? సేమ్, లోకేష్ తను ఏపీకి యాక్టింగ్ సీఎం ఇప్పుడు… ఈ చిల్లర పబ్లిసిటీ తనకెందుకు..?
నిజానికి అంబటి రాయుడే ఇలాంటి పిచ్చి కూతలకు ప్రసిద్దుడు… గతంలోనూ ఉన్నాయి ఇలా… లాస్ట్ ఇయర్ ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముంబై ఇండియన్స్‌కు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది అన్నాడు… తను చాలాకాలం ఆడాడు కూడా… ఈ వ్యాఖ్యలు ఫుల్లు నెగెటివ్ అయ్యేసరికి, అరెరె, నా మాటల్ని వక్రీకరించారు అని సాకు, వివరణకు దిగాడు…
ఓసారి కెప్టెన్ రుతురాజ్ మీద ఇలాగే వ్యాఖ్యలు… అనే మాటలు అని, తీరా అందరూ తిట్టాక ‘అబద్ధాల్ని ప్రసారం చేయకండి ప్లీజ్’ అంటాడు… బీసీసీఐతోనూ తెగతెంపులు చేసుకున్నాడు ఓదశలో… క్రికెట్‌లో ఇక ఉద్దరించేది ఏదీ లేదు అనుకునే స్థితిలో పాలిటిక్సులోకి వచ్చాడు…
ఫాఫం, జగన్… తనకు ఇలాంటి కేరక్టర్లు భలే దొరుకుతారు కదా… కండువా కప్పేసి పార్టీలో చేర్చుకున్నాడు… గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తారని ఆశపడ్డాడట… అదంత వీజీయా.,.? ఏం తత్వం బోధపడిందో గానీ సరిగ్గా 10 రోజుల 2 గంటల 36 నిమిషాల్లో రాజీనామా చేశాడు… అదేమిట్రా అంటే… కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుని బయటికి వచ్చేశాడట… సరిగ్గా పదే రోజుల్లో వైరాగ్యం వచ్చిందా..?
అందుకే చాలాసార్లు అనిపిస్తుంది కేఏపాల్, బండ్ల గణేష్ ఎట్సెట్రా చాలా బెటర్ కదా అని… తరువాత ఇంకేదో పార్టీలో చేరినట్టు గుర్తుంది… అవును, ఇలాంటి అత్యంత చంచల స్వభావులు కామెంటరీలో చేసే వ్యాఖ్యలూ అలాగే ఉంటాయి… కొత్తేమీ కాదు… కామెంటరీకి తీసుకున్నోడి ఖర్మ..!!
Share this Article