ఒకరేమో స్కిన్ టు స్కిన్ టచింగ్ ఉంటే తప్ప దాన్ని లైంగిక దాడి అనలేం అంటారు… (దేహస్పర్శ)… దాన్ని సుప్రీం కోర్టు కొట్టిపారేస్తుంది… ప్రేమించినంత మాత్రాన సంభోగం చేస్తే ఆ అమ్మాయి అనుమతించినట్టు కాదు, అది అత్యాచారమే అంటారు మరొకరు… అంగప్రవేశం జరిగితే తప్ప అత్యాచారం కాదంటారేమో మరొకరు… చిన్నారుల మీద లైంగిక దాడులకు సంబంధించిన పోక్సో చట్టానికి ఒక్క కోర్టు ఒక్కో బాష్యం చెబుతోంది… స్పష్టత ఇచ్చే ప్రయత్నం సుప్రీం వైపు నుంచీ జరగడం లేదు… దేశవ్యాప్తంగా ఈ ఘాతుకాలపై బోలెడు కేసులు నమోదవుతున్నయ్… ఈ స్థితిలో చట్టంలోని సెక్షన్లకు సరైన వివరణ, మార్గదర్శకాలు అవసరం అనిపిస్తోంది… లేకపోతే మరింత గందరగోళం నెలకొనేట్టుంది… అలహాబాద్ హైకోర్టు తీర్పు ఒకటి ఈ దిశలో పరిశీలించాల్సిన తాజా కేసు…
ఆ కేసు ఏమిటంటే..? సోనూ కుష్వా… ఓ పిల్లాడిని బెదిరించి, 20 రూపాయలు ఇచ్చి, ముఖరతికి పాల్పడ్డాడు, ఎవరికైనా చెబితే బాగుండదని బెదిరించాడు… ఈ కేసులో లైంగికదాడి, ప్రలోభం, బెదిరింపు అన్నీ ఉన్నయ్… ఝాన్సీ కోర్టు సదరు చట్టంలోని సెక్షన్ 5 కింద తీవ్రమైన దాడిగానే పరిగణించి పదేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది… సదరు నిందితుడు హైకోర్టుకు అప్పీల్ చేశాడు… నో, నో, ఇది సెక్షన్లు 5, 6 కిందకు రాదు, సెక్షన్ 4 వర్తిస్తుంది… పదేళ్ల జైలుశిక్ష ఎక్కువ అని చెప్పిన కోర్టు శిక్షాకాలాన్ని ఏడేళ్లకు తగ్గించింది…
Ads
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? ఏది తీవ్రమైన లైంగిక దాడి..? ఏది సరైన నిర్వచనం..? బెదిరించి, ముఖరతికి పాల్పడితే అది తీవ్రమైన లైంగికదాడి కింద పరిగణనలోకి రాదా..? కేవలం అంగప్రవేశం జరిగితేనే అది తీవ్రమైన దాడిగా పరిగణించాలా..? అసలు చట్టంలోనే ఇంత సందిగ్ధత, ఇంత గందరగోళం, కోర్టు తీర్పుల నడుమ ఇంత తేడా ఉంటే, సుప్రీం వివరణ ఇవ్వాలి లేదంటే కేంద్రమే మరింత క్లారిటీతో అవసరమైన సవరణలు తీసుకురావాలి… మొన్నామధ్య స్కిన్ టు స్కిన్ కేసుపై సొలిసిటర్ జనరల్, సుప్రీం సీరియస్‌గానే స్పందించాయి, అదేసమయంలో ఆ చట్టంలోని సెక్షన్ల మీద మరింత స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుండేదనిపించింది..!! ట్రయల్ కోర్టులు ఒకరకంగా, హైకోర్టులు మరోరకంగా స్పందిస్తున్నాయి కాబట్టి…!!
Share this Article