Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికాలో… నా వాలుజడ కృష్ణవేణి, నా పూలజడ వెన్నెలా గోదావరి…

June 23, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. అమెరికా అల్లుడు ఇండియా అమ్మాయి అని ఈ సినిమాకు టైటిల్ పెట్టి ఉంటే ఇంకా కరెక్టుగా సెట్టయి ఉండేది . సినిమా ఎక్కువగా ఇండియా అమ్మాయి భానుప్రియ గురించే .

ఇండియాలో మారుమూల గ్రామంలో పుట్టిన భానుప్రియ లోకం తెలియని అమాయకపు , ఆవకాయ పప్పొడుం అమ్మాయి . అమెరికాలో డాక్టరుగా పనిచేస్తున్న బావను పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళి కల్చరల్ బారియర్సులో నానా కష్టాలు పడుతుంది .

Ads

అమాయకపు మొండితనంతో భర్త కోపానికి గురయి ఇండియాకు పంపేయబడటానికి ఎయిర్పోర్టులో వదిలేయబడుతుంది . టికెట్ చించేసి స్వంత కాళ్ళ మీద శాస్త్రీయ నృత్యకారిణిగా ఎదిగి తమకు పుట్టిన బిడ్డను సాకుకుంటుంది .

అమెరికాలో నాట్య ప్రదర్శనలను ఇచ్చి పేరు తెచ్చుకుంటుంది . సినిమాఖర్లో అమెరికా అల్లుడు రాజీపడి, సిగ్గుపడి, చివరకు ఆ ఇండియా అమ్మాయి దగ్గరకే చేరడంతో సినిమా ముగుస్తుంది .

మంచి కధ . ప్రవాస భారతీయులు డా.రమేష్ వేమూరి నిర్మాత . మరో ప్రవాస భారతీయ ప్రొఫెసర్ వేల్చేరు నారాయణరావు కధను రాసారు . ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమా ముహూర్తపు షాటులో ఆనాటి ముఖ్యమంత్రి  నందమూరి తారక రామారావు గారు క్లాప్ కొట్టడం . బైపాస్ సర్జరీ కోసం వెళ్లిన యన్టీఆర్ అమెరికాలో ఉండటంతో అది సాధ్యమయింది .

మరో ఆసక్తికరమైన విషయం కె. ప్రత్యగాత్మ కుమారుడు కె వాసు ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా అమెరికా అప్పారావు అనే ఓ హాస్య పాత్రను కూడా పోషించడం . చాలా పాత్రలలో ప్రవాస భారతీయులే నటించారు . అమెరికా అల్లుడుగా సుమన్ , ఇండియా అమ్మాయిగా భానుప్రియలు నటించారని చెప్పాల్సిన అవసరం లేదు . ఇతర పాత్రల్లో కాంతారావు , డబ్బింగ్ జానకి , సూర్యకాంతం ప్రభృతులు నటించారు .

నాకు బాగా నచ్చిన సినిమా . నలభై ఏళ్ల కింద 1985 జూన్లో విడుదలయిన ఈ సినిమాలో హీరోయిన్ అనుభవాల్లో చాలా వాటిని 1988 లో అమెరికా వెళ్లిన నేనూ అనుభవించాను . షాపింగ్ మాల్స్ , ఎస్కలేటర్లు , paid vehicle multi storeyed parkings  వగైరా నాకూ చిత్రంగా అనిపించేవి .

నలభై ఏళ్ల కింద పరిస్థితి వేరు, ప్రస్తుత పరిస్థితి వేరు . బహుశా ఇప్పుడు అమెరికా వెళ్ళని వారు లేరేమో అన్నట్టుంది ! చాలా కుటుంబాల నుంచి ఒకరిద్దరు ఇవ్వాళ అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు . ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో .

సినిమాలో ఎక్కువ భాగం అమెరికాలో తీయడం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది . అక్కడ లొకేషన్లలో సీనులు , పాటలు బాగా ఆకర్షిచాయి . వంద రోజులు ఆడించాయి . వేటూరి వారి పాటలు , చక్రవర్తి సంగీతం , బాలసుబ్రమణ్యం సుశీలమ్మ శైలజ గాత్రం సినిమా విజయానికి దోహదపడ్డాయి .

భానుప్రియ నాట్య కౌశల్యాన్ని కధకు ఉపయోగించుకోవడం నిర్మాత , దర్శకులు చేసిన తెలివయిన పని . నా వాలు జడ కృష్ణవేణి నా పూల జడ వెన్నెలా గోదావరి మరియు ప్రణయమా ప్రళయమా పాటల్లో ఆమె శాస్త్రీయ నృత్యం అద్భుతం .

అమెరికాలో పలు చోట్ల ఆమె ఇచ్చే ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను గొప్పగా ఆకట్టుకుంటాయి . ఈరోజు చూసినా అలాగే ఆకట్టుకుంటాయి . మిగిలిన పాటలు గోమాత మాయమ్మా , సూరీడు చంద్రుడు అన్నదమ్ములంట , తేనె వెన్నెల నీలి మిన్నులా , ఆలంటూ అన్నాక మొగుడంటూ ఉన్నాక పాటలు , డ్యూయెట్లు బాగుంటాయి . సుమన్ భానుప్రియ హిట్ జంట మరోసారి హిట్టయింది అని చెప్పవచ్చు .

ఇప్పుడు చూసే వాళ్ళకు ఈ సినిమా తర్వాత 1987 లో వచ్చిన జంధ్యాల వారి పడమట సంధ్యారాగం గుర్తుకొస్తుంది . కధలు పూర్తిగా డిఫరెంట్ అనుకోండి .

ఇంతకుముందు ఈ సినిమాను చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ సినిమా . యూట్యూబులో ఉంది . ముఖ్యంగా భానుప్రియ ఆ రెండు నృత్య గీతాలను అసలు మిస్ కాకండి . It’s a romantic , feel good movie .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాన్ ఇండియా కాదు.. ! తెలుగులో మాత్రమే అఖండ తాండవం.. !!
  • యూదులు ఎక్కడున్నా ప్రాణభయమే…! అసలు ఏమిటీ హనుఖ్క..!?
  • …. అలా ఈనాడుపై ఉదయం, ఆంధ్రజ్యోతి ‘పగ తీర్చుకున్నాయి’…
  • సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…
  • కీలక డాక్యుమెంట్… సాయుధ పోరాట దుస్థితిపై ఐదేళ్లుగా అంతర్గత చర్చ..!!
  • వావ్… తొలిసారిగా ఓ ‘ప్రెస్‌’టీజియస్ పోస్టులోకి లేడీ జర్నలిస్ట్..!
  • స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్ కాదు… సైలెంటుగా చిగురించి పెనవేసుకున్న బంధం..!
  • జుహీ చావ్లా తొలి తెలుగు సినిమా… అదీ సూపర్ స్టార్ డైరెక్షన్‌లో…
  • మెస్సీ పట్ల ఈ ‘ఫస్ట్ లేడీ’ అమర్యాదకర ప్రవర్తన..! నెటిజనం తిట్టిపోతలు..!!
  • ఎవరూ అడుగుమోపని… ఆ మార్మిక కైలాస పర్వతం ఎక్కిన ఏకైక వ్యక్తి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions