Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నే షిమోటీ..! నిఖార్సు ఇండియన్ ఆర్ట్… 1976 లోనే ఓ ‘పడమటి సంధ్యారాగం’…

August 19, 2024 by M S R

‘పాడనా తెనుగు పాట, పరవశనై మీ ఎదుట మీ పాట, పాడనా తెనుగు పాట’ … అమెరికా అమ్మాయి సినిమా అంటే ఎవరికయినా మొదట గుర్తుకొచ్చేది ఈ పాటే … ఈ పాట వింటే గుర్తుకొచ్చేది అమెరికా అమ్మాయి సినిమాయే … ఇంత చక్కటి , గొప్ప పాటను వ్రాసిన భావ కవి , ఆంధ్రా షెల్లీ , రవీంద్రనాథ్ టాగోర్ మిత్రుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి హేట్సాఫ్ . ఈ పాట విన్నప్పుడు నాకు మరో పాట గుర్తుకొస్తుంది . విచిత్ర కుటుంబం సినిమాలో సి నారాయణరెడ్డి వ్రాసిన ‘ఆడవే జలకమ్ములాడవే’ పాట . ఆణిముత్యాలు . ఈ సినిమాలో మరో గొప్ప పాట కూచిపూడి నృత్యంతో చిదంబరం దేవాలయ నేపధ్యంలో ‘ఆనంద తాండవమాడే శివుడు అనంత లయుడు చిదంబర నిలయుడు’ పాట . సి నారాయణరెడ్డి వ్రాసారు . ఈ రెండు పాటలూ సుశీలమ్మే పాడారు .

ఈ రెండు పాటలతో పాటు మరో పాట ‘ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగ మాలిక’ … మైలవరపు గోపి వ్రాసారు . చాలా శ్రావ్యమైన పాట . జి ఆనంద్ పాడారు . ఈ మూడు పాటల వీడియోలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి . ముఖ్యంగా ఈతరం వారికి నా అభ్యర్ధన . ఇంతటి శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన జి కె వెంకటేష్ ని చాలా చాలా మెచ్చుకోవాలి .

ఈ సినిమాలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసింది హీరోయిన్ అన్నే షిమోటి (Annie Chaymotty ) గురించి . ఫ్రెంచ్ దేశస్తురాలు . భారతీయ సంస్కృతి , కళల మీద అపారమైన ఆసక్తిని పెంచుకుని భారతదేశంలో వెంపటి సత్యం వంటి మహామహుల వద్ద శిష్యరికం చేసింది . ఆ సమయంలోనే ఈ సినిమాకు ఎంపికయింది . దేవయాని పేరుతో ప్రపంచమంతా భారతీయ నాట్య ప్రదర్శనలను ఇచ్చింది . బహుశా తెలుగు సినిమా రంగంలో ఒక విదేశీ మహిళ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా ఇదేనేమో ! నిర్మాత నవత కృష్ణంరాజుని , దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుని అభినందించాలి .

Ads

నటి దీప నటించిన మొదటి తెలుగు సినిమా కూడా ఇదే . ఉన్ని మేరీగా మళయాళంలో , ఇతర దక్షిణాది భాషల్లో నటించింది . ఇతర పాత్రల్లో శ్రీధర్ , రంగనాధ్ , గుమ్మడి , రాజబాబు , కాంతారావు , గిరిజ , పండరీబాయి , ఆర్జా జనార్ధనరావు , శరత్ బాబు , రమాప్రభ ప్రభృతులు నటించారు .

తూర్పు-పడమర దేశాల సాంస్కృతిక సంగమం ఈ సినిమా . సాంస్కృతిక అవగాహనతో దేశాల మధ్య ఎల్లలు కనుమరుగవుతాయనే సందేశంతో వచ్చిన సినిమా . ఇలాంటి సందేశంతో మనకు మరో సినిమా కూడా ఉంది . అది 1987 లో వచ్చిన జంధ్యాల సినిమా పడమట సంధ్యారాగం . 1976 లో వచ్చిన ఈ సినిమాలో మరో ఇద్దరి గురించి కూడా చెప్పుకోవాలి . ‘ఆనంద తాండవమాడే నృత్యానికి’ దర్శకత్వం వహించిన వెంపటి చిన సత్యం , ఫొటోగ్రఫీ డైరెక్టర్ బాలూ మహేంద్రలు .

సింగీతం వారు కె వి రెడ్డి శిష్యులయినా ఈ సినిమాలో మాత్రం బాపు , విశ్వనాథ్ ఛాయలే ఎక్కువగా కనిపిస్తాయని నా అభిప్రాయం . తమిళంలో హిట్టయిన మెల్నట్టు మరుమగల్ అనే సినిమా ఆధారంగా మన తెలుగు సినిమాను తీసారు . తమిళంలో కమల్ హసన్ , జయసుధ , కుమారి లారెన్స్ ప్రభృతులు నటించారు . తమిళ సినిమాకు కొన్ని మార్పులు చేసారు సింగీతం వారు . రెండు సినిమాలూ వంద రోజులు ఆడాయి .

గుంటూరులో విజయా టాకీసులో చూసినట్లు గుర్తు . సినిమా యూట్యూబులో ఉంది . చక్కని సినిమా . చూసి ఉండకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దు . ముఖ్యంగా నేను ప్రస్తావించిన మూడు పాటలు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు    ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకటే చెట్టు… పది పక్షులు… ఒక తుపాకీ గుండు… తర్వాత మీరే చదవండి…
  • బాబోయ్ విలేకర్స్..! సొసైటీకి బెడదగా న్యూస్ కంట్రిబ్యూటర్ల వ్యవస్థ..!!
  • ఈ విశ్వసుందరి కిరీటం ధగధగల వెనుక కొన్ని చీకటి నీడలు…!!
  • అసలు తండ్రిని నేనేనా..?! కుటుంబ వ్యవస్థనే కూల్చేసే ‘పితృత్వపరీక్షలు’..!!
  • నచ్చిన వార్త..! ఓ ఉచిత ఇంజక్షన్‌తో రోజూ ఆరు ప్రాణాలు కాపాడారు..!!
  • పవర్ పాలసీ..! కేసీయార్ నష్టకారకాలు Vs రేవంత్ రెడ్డి కొత్త టెక్నాలజీలు..!!
  • సుహాసిని, విజయశాంతి ఓవర్ డోస్ ఎదుట అంతటి కుయిలీ వెలవెల..!!
  • అందరికీ కొత్త ఆధార్ కార్డులు..! అవసరం ఏమిటి..? ఎప్పటి నుంచి..?!
  • స్మృతి మంధానా పెళ్లికి ఈ విఘ్నాల వెనుక అసలు మర్మమేమిటో..!?
  • వందల కోట్లు కాదు… సినిమా పెద్ద తలలు చూడాల్సిన ఓ వండర్ ఇది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions