Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా డబుల్ గేమ్..! గల్ఫ్ రీజియన్ నుంచీ బలగాలు వాపస్..?!

September 13, 2021 by M S R

………… By…. పార్ధసారధి పోట్లూరి ….  అంతు పట్టని అమెరికా ఆలోచనలు ! అమెరికా – సౌదీ ఆరేబియాల మధ్య విడదీయలేని దౌత్య, ఆర్ధిక, రక్షణ పరమయిన బంధం ఉంది చిరకాలంగా ! అసలు గల్ఫ్ ప్రాంతంలోని ఆయిల్ కొనుగోలు డాలర్ రూపంలో జరుగుతుంది. అలాగే గల్ఫ్ రీజియన్ రక్షణ బాధ్యత అమెరికా తీసుకుంది. చాలా కాలంగా అది కొనసాగుతూనే ఉంది. అయితే …. రెండు వారాలక్రితం అమెరికా తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని సౌదీ ఆరేబియాయ నుండి తొలగించింది. ఒకవైపు దక్షిణ యెమెన్ లోని హుతి తీవ్రవాదులు సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీల మీద మిసైల్, డ్రోన్ దాడులు చేస్తున్న తరుణంలో అమెరికా తీసుకున్న ఈ చర్య చర్చనీయాంశం అయ్యింది.

క్రిస్టియన్ ఉల్రిచ్సేన్ [Kristian Ulrichsen] రీసెర్చ్ స్కాలర్ , James A. Baker III (Institute for Public Policy at Rice University) మాటల్లో చెప్పాలంటే… అమెరికన్ అధికారుల తీరు చూస్తుంటే గల్ఫ్ రీజియన్ లో తమ మాట చెల్లుబాటు కోసం చూడకుండా, తన పని తాను చేసుకుపోవాలి అనే రీతిలో ఉంది. ఇప్పటికీ గల్ఫ్ రీజియన్ లో వేల సంఖ్యలో అమెరికన్ దళాలు ఉన్నాయి. అలాగని ఈ ప్రాంత రక్షణ బాధ్యత ఇక మీదట తమది కాదు అనే రీతిలో ప్రవర్తిస్తున్నది అమెరికా. ఇది చాలా ముఖ్య పరిణామం. మరో పక్క ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పక్కన పెట్టి అమెరికాతో చర్చల కోసం ఎదురు చూస్తున్నది. ఇది పరోక్షంగా సౌదీ ఆరేబియాతో పాటు అటు ఇజ్రాయెల్ కి కూడా నచ్చని చర్య… కానీ అమెరికా ఇవేవీ పట్టించుకునే స్థితిలో ఉన్నట్లుగా లేదు.

usa

అమెరికా ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ నుండి హడావిడిగా తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడం తీవ్ర విమర్శలకి తావిచ్చినా అమెరికా ఏ మాత్రం లక్ష్య పెట్టడం లేదు. పైనా నేను చేసింది సరయిన పనే అని సమర్ధించుకుంటున్నది. ఇప్పటికీ కాబూల్ లో ఉన్న మిగిలిన 200 మంది అమెరికన్ పౌరులని వెనక్కి తీసుకురావడానికి తాలిబన్లని వేడుకోవడం అనేది మరీ దారుణం. రెండు వారాలు తిరక్కుండానే ఇప్పుడు సౌదీ లోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ బయట మోహరించిన పేట్రియాట్ బాటరీలతో పాటు అడ్వాన్స్డ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ [Terminal High Altitude Area Defense (THAAD) ని కూడా అక్కడ నుండి తీసివేసింది అమెరికా. THAAD మిసైల్ డిఫెన్స్ అనేది బాలిస్టిక్ మిసైల్స్ ని కూడా ధ్వంసం చేయగలదు . తాజా ఉపగ్రహ చిత్రాల్లో ఇంతకు ముందు అక్కడ ఉండాల్సిన పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు THAAD ని కూడా తీసేసినట్లు స్పష్టంగా కనపడుతున్నది. ఇది అటు సౌదీ రాజుకి చెప్పే తీసివేశారా? లేక ఆఫ్ఘనిస్తాన్ లో అప్పటి ప్రభుత్వానికి చెప్పకుండా అర్ధరాత్రి వచ్చేసినట్లు సౌదీలో కూడా తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని తీసేసిందా అనే అనుమానాలు బలంగా వినపడుతున్నాయి. అయితే సౌదీ రాజ వర్గాలు మాత్రం తమకి అమెరికా మధ్య ఎలాంటి బేదాభిప్రాయలు రాలేదని, అంతా సవ్యంగానే ఉంది అని ప్రకటన చేయాల్సి వచ్చింది.

Ads

కేవలం మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని తొలగించడంతో సరిపెట్టుకోదల్చుకోవట్లేదు అమెరికా. గల్ఫ్ రీజియన్ లో ఉన్న తన సైనికులలో సగానికి సగం వెనక్కి పిలిపించే పనిలో ఉంది. ఒక పక్క దక్షిణ యెమెన్ లోని హుతీ రెబెల్స్ సౌదీ ఆయిల్ రిఫైనరీలని టార్గెట్ చేస్తూ రాకెట్, డ్రోన్ లతో దాడులు చేస్తూనే ఉన్నా కానీ అమెరికాకి ఇవేవీ పట్టట్లేదు. ఇక నుండి రాబోయే రోజుల్లో మీ రక్షణ బాధ్యత మీరే చూసుకోవాలి అని పరోక్షంగా చెప్పకనే చెప్తున్నది. డాలర్ల సంపదతో సుభిక్షంగా ఉన్న గల్ఫ్ దేశాలకి ఆయుధాలు కొనడం పెద్ద విషయం కాదు కానీ వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోగల నేర్పు అక్కడి సైన్యంలో లేదు. కనుకనే ఇన్నాళ్ళూ ఈ ధనిక దేశాల రక్షణ బాధ్యత అమెరికా చూసింది. అంతెందుకు ! సౌదీ దగ్గర పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కానీ వాటిని నేర్పుగా ఉపయోగించలేకపోతున్నది సౌదీ సైన్యం…

1. వారం క్రితం CIA చీఫ్ న్యూఢిల్లీ వచ్చి అటునుండి ఇస్లామాబాద్ వెళ్ళిన తరువాత పాకిస్థాన్ ISI తో ఏం మాట్లాడాడో తెలీదు కానీ అప్పటి నుండి పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మధ్య అగాధం ఏర్పడింది అనే వార్తలు వస్తున్నాయి.

2. అమెరికన్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ బ్లింకేన్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ సమస్యని మేము భారత దేశ కళ్ళతో చూడలేము అంటూ వ్యాఖ్యానించాడు. మరి అటువంటప్పుడు దక్షిణ చైనా సముద్రం సమస్యని భారత్ ఎందుకు అమెరికా కళ్ళతో చూడాలి ? క్వాడ్ నుండి భారత్ బయటికి వచ్చేస్తే సరి ! మీ చావు పసిఫిక్ మహా సముద్రంతో ముడి పడి ఉంటే దానికి భారత్ మద్దతు ఎందుకు ?

3. పెంటగాన్ ఇప్పటికే సౌత్ చైనా సీ మీద సమగ్ర రిపోర్ట్ ఇచ్చింది .. ఏం చేయాలో ! ఏం చేయకూడదో…! దాని ఫలితమే గల్ఫ్ రీజియన్ నుండి దళాల ఉపసంహరణ జరుగుతున్నది. పెంటగాన్ రిపోర్ట్ లో దక్షిణ చైనా సముద్రంలో చైనాని ఎదుర్కోవాలంటే భారత్ మద్దతు తప్పనిసరి అని ఉంది. భూమి మీద యుద్ధానికి అయితే నాటో దేశాల సహకారం అవసరం. అదే సముద్రం మీద అయితే భారత్ అవసరం ఉంది. ఒక వేళ యుద్ధం అంటూ జరిగితే భారత్ నేవీకి జరిగే నష్టం ఎవరు పూడుస్తారు? అమెరికాకి మద్దతుగా ఫ్రాన్స్ తన ‘చార్లెస్ డి గల్లే ‘ విమాన వాహక నౌకని పంపిస్తుందా ? ఇక బ్రిటన్ విమాన వాహక నౌక క్వీన్ ఎలిజబెత్ చైనాని ఎదుర్కొని రెండు రోజులు కూడా నిలబడలేదు. అలాంటప్పుడు ఫ్రాన్స్ సహకారం కూడా కావాలి కానీ ఫ్రాన్స్ ఒప్పుకుంటుంది అన్న ఆశ లేదు. జో బిడెన్ యంత్రాంగంకి ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు అని ఆఫ్ఘనిస్తాన్ సమస్యని భారత్ కళ్ళతో చూడలేము అని అన్నప్పుడే అర్ధంఅయిపోయింది. ఇదే మాట ఫ్రాన్స్, భారత్ లు కూడా అంటే మొహం ఎక్కడ పెట్టుకుంటుంది జో బిడెన్ యంత్రాంగం ? అయితే గియితే జపాన్ తో మనకి ఉన్న స్నేహసంబంధాలని దృష్టిలో పెట్టుకొని క్వాడ్ (నాలుగు దేశాల వ్యూహాత్మక కూటమి)లో కొనసాగాల్సి ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంలో జపాన్ కి చైనా నుండి ముప్పు ఉంది.

గత 15 రోజుల వ్యవధిలో కమాలా హారిస్ చైనా పర్యటనకి ఎందుకు వెళ్లారు ? పెంటగాన్ చైనాని ఎదుర్కోవడం ఎలా అనే వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న వేళ కమలా హారిస్ చైనా పర్యటన వెనుక అంతరార్ధం ఏమిటీ ? అమెరికన్ ఆయుధ లాబీ కమలా హారిస్ మీద ఒత్తిడి తెస్తున్నది. ఇప్పటికిప్పుడు ఏ దేశం కూడా ఆయుధాలు కొనే స్థితిలో లేవు కాబట్టి దేశాల మధ్య యుద్ధాలు జరిగితేనే కానీ ఆయుధాలకి డిమాండ్ రాదు కాబట్టి రాబోయే రోజుల్లో గల్ఫ్ రీజియన్ తో పాటు దక్షిణాసియా ప్రాంతాల్లో యుద్ధ జ్వాలలు ఎగదోసి ఆయుధాలని అమ్ముకునే డబుల్ గేమ్ ఆడబోతున్నది అమెరికా. ఈ ఉచ్చులో ఏ ఏ దేశాలు పడబోతున్నాయో త్వరలోనే తెలిసిపోతుంది. అమెరికన్ ఆయుధాలు అమ్ముడుబోవాలంటే రెండో దేశం దగ్గర ఖచ్చితంగా రష్యా ఆయుధాలు ఉండి తీరాలి….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions