దేశాల నడుమ సత్సంబంధాలు లేనప్పుడు, ఉన్న సంబంధాలు క్షీణించినప్పుడు… కొన్ని అంశాలు భూతద్దంలో చూడబడతాయి..! కొత్త వివాదానికి తెరతీస్తాయి… ఇదీ అలాంటిదే… అనేకానేక అంశాల్లో అమెరికా- చైనా నడుమ వైరం సాగుతోంది… ప్రపంచ అధిపత్యం కోణంలోనే..! ఏ విషయమైనా సరే ఒకదానికొకటి లక్ష సందేహాలతో చూస్తున్నయ్… తాజాగా ఓ వార్త కాస్త చదవబుల్ అనిపించింది… ఈమధ్య చైనా కరోనా పరీక్షలకు సంబంధించి ఏం చేస్తున్నదంటే… వేరే దేశాల నుంచి వచ్చినవాళ్లకు, క్వారంటైన్లలో ఉన్నవాళ్లకు, అనుమానితులకు యానల్ స్వాబ్ టెస్టులు చేస్తోంది కొన్ని ప్రావిన్సుల్లో..! అంటే తెలుసు కదా… థ్రోట్ స్వాబ్, నోస్ స్వాబ్ అంటే ముక్కు లోపల గోడలకు, గొంతు లోపల గోడలకు ఉండే జిగట, శ్లేష్మాన్ని శాంపిల్‌గా తీసుకుని వైరస్ ఉనికి కోసం పరీక్షించడం… దానికన్నా యానల్ స్వాబ్ టెస్టు వల్లే రిజల్ట్ బాగా ఉంటుందనే భావనతో ఈమధ్య ఆ టెస్టులే ఎక్కువగా చేస్తోంది… అంటే మలవిసర్జనమార్గం, అంటే గుదము నుంచి శాంపిల్ తీసుకోవడం..!
నిజంగానే ఈ టెస్టుల వల్ల సరైన రిజల్ట్ వస్తున్నట్టయితే… ముక్కు, గొంతు స్వాబ్ శాంపిళ్లకన్నా ఇదే బెటర్ అయ్యే పక్షంలో ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు… ఉన్నా చైనా పట్టించుకోదు… అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే… అమెరికన్ దౌత్య సిబ్బందికి కూడా నిర్బంధంగా ఈ పరీక్షల్ని చేయడం మొదలుపెట్టింది చైనా… వాళ్లు లబోదిబోమంటూ అమెరికా విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేశారు… ఏమయ్యా, మా సిబ్బంది మీద పడ్డారు, మావాళ్ల పట్ల ఇది అగౌరవ చర్య, మర్యాద తప్పడం, ఏమాత్రం హుందాగా లేదు, వాటీజ్ దిస్..? వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్య సిబ్బంది మానమర్యాదల్ని కాపాడాల్సింది పోయి మీరే మర్యాదల్ని అతిక్రమిస్తారా..? ఏం బాగాలేదు, మీ వివరణ ఏమిటి..? ఆ పరీక్షలు తక్షణం ఆపండి అంటూ అమెరికా చైనాపై ఫైరయింది…
Ads
ఇవన్నీ లైట్ తీసుకునే రకం కదా చైనా… ఎహెఫో, నీకెవడో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, గుద పరీక్షల్లేవు., మీవాళ్ల మర్యాదకు వచ్చిన ఢోకా ఏమీ లేదు, ఇక మూసుకో అన్నట్టుగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కస్సుమన్నాడు మొదట్లో… అమెరికా కూడా అలా తేలికగా విడిచిపెట్టే రకం ఏమీ కాదు కదా… పక్కా ఆధారాలతో మళ్లీ ఫిర్యాదు చేసింది.., మీరు ఇలాగే మావాళ్ల ఆ ప్రైవేటు పార్ట్స్ జోలికి వస్తే, మీ మర్యాద దక్కదు, అంతర్జాతీయ వేదికల మీద మీ బట్టలు విప్పాల్సి ఉంటుంది అని హెచ్చరించింది… ఇక దీన్ని ఇలా కొనసాగించడం, బొంకడం మంచిది కాదని తెలుసుకుని చైనా వెంటనే ప్లేట్ ఫిరాయించింది… నిజమే సుమీ, కాస్త పొరపాటు జరిగింది, ఇకపైన అలాంటి పరీక్షలు మీవాళ్లపై చేయబోం, మీవాళ్ల ప్రైవేటు పార్ట్స్‌కు వచ్చిన ముప్పేమీ లేదు అని చెప్పింది… దాంతో అమెరికన్ దౌత్య సిబ్బంది తేలికగా ఊపిరి పీల్చుకున్నారు…!!
Share this Article