Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బ్లాక్‌మెయిల్ టాక్టిస్‌తో రష్యా, చైనా వైపు అమెరికాయే ఇండియాను నెట్టేస్తోందా..?

July 31, 2025 by M S R

.

ట్రంపుకి ఏమైంది..? ఏమీ కాలేదు… ఇండియాను మిత్రదేశం అంటూనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు… రష్యా, చైనాలకు అనుకూలంగా మారితే నాకు శత్రువు అయిపోతావు బహుపరాక్ అని బెదిరిస్తున్నాడు… తన ప్రతి నిర్ణయమూ ఇదే దిశలో…

కాకపోతే ట్రంపు సర్కారుకు ఈ కోణంలో ఓ దశ లేదు, ఓ దిశ లేదు… ఎలాగంటే..? 25 శాతం సుంకాలు అన్నాడు… రష్యా చమురు కొంటే పెనాల్టీ అన్నాడు… తను మరిచిపోయింది ఒకటుంది… ప్రస్తుతం ప్రపంచంలోనే ఇండియా అతి పెద్ద వినిమయ మార్కెట్… మనమూ అదే రేంజ్ సుంకాలు వేస్తే, అమెరికన్ కంపెనీలకే నష్టం…

Ads

నువ్వు బ్రిక్స్ మాటెత్తినా, బ్రిక్స్ కరెన్సీ ఆలోచన చేసినా మర్యాద దక్కదు అంటాడు ట్రంపు… సో వాట్… తనే అనివార్యంగా మరింతగా రష్యా వైపు నెట్టేస్తున్నాడు మనల్ని, ఆల్రెడీ చైనా, రష్యా, ఇండియా (RIC) కూటమి కడతాం, అమెరికా దాని మిత్ర దేశాల కథేమిటో చూద్దామని రష్యా, చైనా మనల్ని అడుగుతున్నాయి కూడా…

ఈ మూడు దేశాలు గనుక కలిసి, అమెరికాపై ఉల్టా సుంకాలు వేస్తే తీవ్రంగా  నష్టపోయేది అదే… డాలర్‌లో చైనా పెట్టుబడులు గానీ, అమెరికాతో వాణిజ్య పరిమాణం గానీ ట్రంపుకి గుర్తొస్తున్నట్టు లేదు, ఆల్రెడీ అమెరికా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు కూడా…

ఇప్పుడున్న స్థితిలో ఇండియా బ్రిక్స్ వదిలేసి, జై నాటో, జై అమెరికా అనలేదు… మన అవసరాలు వేరు, కానీ పదే పదే ట్రంపు మాటలు, నిర్ణయాలు అనివార్యంగా అమెరికా నుంచి దూరం అయ్యేలా చేస్తున్నాయి… తనే మరోవైపు క్వాడ్ అంటాడు… అంటే అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ కూటమి… అదెలాగూ ప్రస్తుతం యాక్టివ్‌గా లేదు…

చైనాతో పోరాటంలో తనకు ఇండియా కావాలి… కానీ తనే చైనా వైపు నెట్టేస్తుంటాడు మనల్ని… అదే చైనా తొత్తు పాకిస్థాన్‌కు మద్దతు అంటాడు… ఇరాన్ ఉగ్రదేశం కాబట్టి దాంతో వ్యాపారం చేస్తే మన కంపెనీల్ని నిషేధిస్తాడట, ఆంక్షలు పెడతాడట… అదేసమయంలో పాకిస్థాన్‌కు చమురు అన్వేషణలో, వెలికితీతలో సాయం చేస్తాడట, ఏదో ఓ రోజు పాకిస్థానే ఇండియాకు చమురు అమ్ముతుందట… అసలు ఉగ్రవాదం విషయంలో ప్రపంచంలోకెల్లా ధూర్తదేశం పాకిస్థానే కదా…

తెలుగులో ప్రేలాపనలు అనే ఓ పదం ఉంది… ఇదే… ఇరాన్ చమురు కొంటున్న 20 సంస్థలపై తాజాగా ఆంక్షలు విధించింది… వాటిల్లో ఆరు ఇండియన్ కంపెనీలు… మరో కంపెనీకి మైక్రో‌సాఫ్ట్ చెప్పాపెట్టకుండా సర్వీస్ బంద్ పెట్టింది… (ఆ ఇష్యూ వేరు కావచ్చు… కానీ మనం అమెరికన్ కంపెనీలపై డిపెండెన్సీ తగ్గించుకుని, రష్యా- చైనాలాగే సొంత ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద దృష్టి పెట్టడం మేలు)…

అఫ్‌కోర్స్, యాపిల్ ట్రంపు బెదిరింపులను పసిఫిక్ సముద్రంలో తొక్కినట్టు, మైక్రోసాఫ్ట్ కూడా రేప్పొద్దున ట్రంపును ఫోఫోవోయ్ అనేస్తుంది… అవి వ్యాపార కంపెనీలు… వాటి అవసరాలు వేరు… ఎస్, ఇండియా- అమెరికా ట్రేడ్ డీల్‌లో… అమెరికా సప్లయ్ చేయాలనుకునే నాన్-వెజ్ పాలను వద్దంటోంది… అలాగే జీఎం ఫుడ్స్ (జన్యుమార్పిడి ఆహారం) వద్దంటోంది… అవి వస్తే దేశ రైతాంగానికి నష్టం…

ఇలా వద్దనడంతో ట్రంపుకి మండుతోంది… సుంకాలు సుంకాలు అని ట్వీటాడా..? మళ్లీ వెంటనే ఇంకా ఇండియాతో సంప్రదింపులు జరుపుతున్నాం అంటాడు… ఓ కన్సిస్టెన్సీ లేదు మనిషికి… రష్యాతో వ్యాపారం చేస్తే బహుపరాక్ అంటాడు, మళ్లీ తనే మీ వ్యాపారం మీ ఇష్టం, మీ ఆర్థిక వ్యవస్థలకే నష్టం అంటాడు…

అమెరికా మిత్రదేశం బ్రిటన్‌తో ఇండియా ఇటీవలే ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న సంగతి కూడా సోయి లేనట్టుంది ట్రంపుకి…  అసలు ఓ అగ్రదేశాధినేతకు ఉండాల్సిన కనీస లక్షణాలు కూడా లేవు ట్రంపులో… తనకు మద్దతు ఇచ్చినందుకు, ప్రచారం చేసినందుకు మోడీ తనే తలవంచుకుని బాధపడుతున్నాడేమో..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions