1992లో బాలకృష్ణ, దివ్యభారతి ధర్మక్షేత్రం సినిమాలో ‘ఎన్నో రాత్రులొస్తాయి’ అని ఒకరినొకరు గట్టిగా అల్లుకుపోయిన పాట… ట్యూన్ బాగుండి, పైకి క్లాస్‌గా వినిపించినా సరే… ఊర మాస్ పాట అది… వేటూరి అంత త్వరగా దొరకడు గానీ పచ్చిదనం పులుముకున్న పాట… పెదవి కొరికే పెదవి కొరకే వంటి భేషైన పదప్రయోగాలు ఒకటీరెండు బాగున్నా… వేడి చెమ్మ, తొడిమ తెరిచే తొనల రుచికే వంటి చాలా కథలు పడ్డాడు…
ఈ సినిమా పాటతో కథనం మొదలుపెట్టేందుకు కారణముంది… ఆ పాటను కొత్తగా వచ్చిన అమిగోస్ సినిమా కోసం రీమిక్స్ చేసి వదిలారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే పాట బాగానే వినిపిస్తోంది… కానీ చిత్రీకరణలో ఖూనీ చేశారు… కళ్యాణరాముడు అస్సలు సూట్ కాలేదు… కానీ హీరోయిన్ ఆషికా మాత్రం ఇరగదీసింది… ఆమె సరిగ్గా ప్రయత్నిస్తే తెలుగు సినిమాల్లో ఫ్యూచర్ ఉన్నట్టనిపిస్తోంది… సినిమాలో మిగతా చోట్ల కూడా ఆమె బాగుంది…
సినిమా కూడా అంతే… పైకి చూస్తే మైత్రీ మూవీస్ సినిమా… కళ్యాణరామ్ బింబిసార రీబర్త్ తరువాత చేసిన మాస్ సినిమా… పైగా మూడు పాత్రలు… అందులో విలన్ పాత్ర… ట్రెయిలర్లు కూడా కాస్త బాగానే ఉన్నట్టనిపించాయి… ఎటొచ్చీ ఎందుకో బజ్ రాలేదు… హైప్ క్రియేట్ కాలేదు… బింబిసార వసూళ్లను బట్టి సినిమాకు మంచి బిజినెస్ జరిగి ఉండాల్సింది… కాలేదు, అంటే అదే చెబుతోంది ఈ సినిమాకు అంత సీన్ లేదని… అదే జరిగింది… బింబిసార తరువాత సినిమా ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ క్షణాల్లో కరిగిపోతుంది…
Ads
ఒక హీరో… పేరు సిద్ధార్థ… తన బిజినెస్ ఏదో తను చూసుకుంటుంటాడు… ఇషిక (అషిక)ను ప్రేమిస్తాడు… పెళ్లాడాలని ప్రయత్నాలు… ఓ వెబ్‌సైట్ ద్వారా తనలాగే ఉండే మరో ఇద్దరిని కలుస్తాడు… ముగ్గురూ మిత్రులవుతారు… ఏదో ఓ పిచ్చిపాట పెట్టారు వాళ్ల దోస్తీ చూపించడానికి… ఎకఎక అంటూ మొదలయ్యే ఈ పాట పకపకా నవ్వుకునేలా ఉంది… పైగా పఠాన్ సినిమాలోని బేశరం పాటకన్నా కాస్త వెగటు చిత్రీకరణ అని కూడా మనం గతంలో చెప్పుకున్నాం… (ఎటో ఎటో వెళ్లిపోయే ఈ తిక్క పాటను రాసింది ‘‘సరస్వతీపుత్రుడు’’ రామజోగయ్య శాస్త్రి)
ఈ ముగ్గురిలో మైఖేల్ గతంలో హైదరాబాదులో ఓ ఎన్ఐఏ అధికారిని చంపేసి ఉంటాడు… తనలాగే ఉన్న సిద్ధార్థను బుక్ చేయిస్తే సరిపోతుందని అనుకుంటాడు… ఆ విలన్ బారి నుంచి మిగతా ఇద్దరు ఎలా తప్పించుకున్నారనేదే స్టోరీ… కథ భిన్నంగా బాగుంది… కానీ దాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు రాజేంద్రరెడ్డి బాగా తడబడ్డాడు… బోల్తాపడ్డాడు…
ప్రేమ కథ మరీ వీక్… హీరోయిన్ చెప్పే థియరీ రిపీట్ చేసి విసిగించారు… ఇంటర్వెల్ తర్వాత యాక్షన్ మోడ్ మొదలై, ఆసక్తిగా ఉంటుందని అనుకుంటే… అక్కడ సాగదీత సహనానికి పరీక్ష పెడుతుంది… మూడు కేరక్టర్లలో ప్రేక్షకుడు ఒక్క దానితోనూ కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ సీన్స్ లేవు. ఉన్నవి సోసో… కల్యాణరామ్ నటన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీలేదు, తనకు పరీక్ష పెట్టిన సీన్ అంటూ ఉంటే కదా… కామెడీ పార్ట్ కూడా పెద్దగా నవ్వించేలా లేదు… ప్చ్, కల్యాణరామ్, lనీ సినిమా గురించి పాజిటివ్‌గా చెప్పడానికి ఒక్క పాయింటైనా లేనంత పకడ్బందీగా సినిమా ఉంది బ్రో…!!
ఒక్కటి మాత్రం నవ్వించింది… మూడు పాత్రల లుక్కుల్లో వేరియేషన్ ఏమిటో తెలుసా..? ఒకటేమో ప్రజెంట్ ట్రెండ్ ఫుల్ బవిరి గడ్డం… రెండో పాత్ర కాస్త స్టయిలిష్ గడ్డం… మూడోది రాముడు మంచి బాలుడు తరహాలో క్లీన్ షేవ్… మూడు పాత్రల నడుమ వేరియేషన్ ఇదే తప్ప ఇంకేమీ కనిపించదు…!!
Share this Article