‘‘ముందుగా మీ సినిమా మొత్తాన్ని మాకు చూపించండి… తరువాత దాని భవిష్యత్తేమిటో మేం డిసైడ్ చేస్తాం…’’ నిజం… ఓ సినిమా గురించి ఓ హిందూ మత సంస్థ ఇలాగే హెచ్చరించింది… మనోభావాలు దెబ్బతినడం, గొడవలు, ఆందోళనలు ఎట్సెట్రా మన ఇండస్ట్రీకి సంబంధించి కామనే కదా… ఎన్ని జరిగినా సరే మన ఘన దర్శకులు కూడా గోక్కుంటూనే ఉంటారు కదా…
ఇది మహారాజ్ అనే సినిమాకు సంబంధించిన లొల్లి… ఆమీర్ ఖాన్ కొడుకు జునయిద్ తొలి సినిమా ఇది… డాడీకి సంబంధించిన సొంత సినిమాలే కాదు, పలు సినిమాలకు సంబంధించి ఆడిషన్లు జరిగినా సరే ఈ హీరోను చాలామంది రిజెక్ట్ చేశారు… ఐనా అలెగ్జాండర్ దండయాత్రలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, చివరకు 2021లో యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఆమీర్ ఖాన్ అబ్లిగేషనో లేకపోతే ఆయన కొడుకుగా సినిమాను మంచిగానే అమ్మేసుకోవచ్చు అనుకున్నారో గానీ ఈ సినిమా స్టార్ట్ చేశారు…
ఎనిమిది నెలల్లోనే పూర్తి చేసినా, అనేక కారణాలతో అది రిలీజ్ కావడం లేదు… చివరకు నెట్‌ఫ్లిక్స్‌తో ఓటీటీ బేరం కుదిరాక ఇక ఇప్పుడు జూన్ 14న రిలీజుకు నోచుకుంటోంది… ఈలోపు విశ్వహిందూపరిషత్ యువవిభాగం భజరంగ్‌దళ్ ఎంటరై ఇదుగో ఈ హెచ్చరికల్ని జారీ చేసింది… 1862లో కేవలం మూణ్నాలుగు యూనివర్శిటీలే ఉన్న రోజుల్లో జరిగిన ఓ రియల్ కథకు ఇది సినిమా రూపమట…
Ads
జూన్ 3న కొంకణ్ రీజినయన్ భజరంగదళ్ కోఆర్డినేటర్ గౌతమ్ రావ్రియా యశ్‌రాజ్ ఫిలిమ్స్, నెట్‌ఫ్లిక్స్‌కు ఓ లేఖ రాశాడు… అసలు సినిమా పోస్టరే ప్రముఖ హిందూ మత నేతను నెగెటివ్ లుక్స్‌లో చూపిస్తోందట… చూడబోతే సినిమా మొత్తం ఈ ధోరణితో ఉండబోతోందనే సందేహాలొస్తున్నాయనీ, అదే జరిగితే శాంతిభద్రతల సమస్యగా తలెత్తుతుందనీ ఆ లేఖలో పేర్కొన్నాడు ఆయన…
లేఖ చివరలో… మీరు మాకు ఈ సినిమాను ముందే చూపించండి, తరువాత ఏం చేయాలో మేం చెబుతాం, సినిమా భవిష్యత్తు, మా భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో కూడా చెబుతాం అని ముక్తాయించాడు… కొందరు తన మద్దతుదారులు, పోలీసుల సమక్షంలో తనే ఆ లేఖను స్వయంగా నెట్‌ఫ్లిక్స్ లోకల్ ఆఫీసులో ఇచ్చి, ఆ వీడియోను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశాడు కూడా… సేమ్, యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఆఫీసు దగ్గర కూడా..!
1862లో సుప్రీంకోర్టులో ఓ ఫేమస్ లీగల్ ఫైట్ నడిచింది… ఓ ప్రముఖ మత నాయకుడికీ, కర్సన్‌దాస్ ముల్జీ అనబడే జర్నలిస్టు కమ్ సోషల్ యాక్టివిస్టుకూ నడుమ సాగిన ఈ న్యాయపోరాటం దేశ ప్రముఖ కేసుల్లో ఒకటిగా చెబుతారు… ఆమీర్ ఖాన్ కొడుకు ఆ జర్నలిస్టు పాత్రను పోషించాడు ఇందులో… శాలినీ పాండే కూడా నటించిన ఈ సినిమాకు హిచ్‌కీ సినిమా తీసిన సిద్ధార్థ మల్హోత్రా దర్శకుడు…!!
Share this Article