అమితాబ్… దేశం గర్వించతగిన నటుడు… కోట్ల మంది తనను అభిమానిస్తారు… వెరీ ఇంపార్టెంట్ సెలబ్రిటీ ఆఫ్ ఇండియా… తన మాట, తన అడుగు, తన భాష, తన ఆలోచనలకు ప్రాధాన్యం ఉంటుంది… లక్షల మంది అనుసరిస్తారు… ఇలాంటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి, జనం నవ్వుకునే విధంగా ఉండకూడదు…
ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… తను ప్రభాస్ నటిస్తున్న అత్యంత భారీ చిత్రం ప్రాజెక్టు కె లో నటిస్తున్నాడు… కమల్ హాసన్ కూడా దీనిలో భాగస్వామి (నటనపరంగా) అవుతున్నాడు… ఇప్పటివరకూ ఇండియాలో ఏ సినిమాకూ ఖర్చు పెట్టనంతగా బడ్జెట్ పెడుతున్నారు… బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన ప్రతిష్ఠాత్మక సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ మూడూ అట్టర్ ఫ్లాప్… అందుకే అందరి దృష్టీ ఇక సాలార్, ప్రాజెక్టు కె సినిమాలపై ఉంది…
ప్రాజెక్టు కె షూటింగ్ స్పాట్‌కు వెళ్లొచ్చిన ప్రముఖులు కూడా బాగా ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు… సినిమాకు హైప్ పెరుగుతోంది… టైమ్ ట్రావెల్, మరింత ఆధునిక టెక్నాలజీ జానర్ అంటున్నారు… ఈ సినిమాలో చాన్స్ ఇచ్చినందుకు ప్లస్ ప్రభాస్ తన పట్ల గౌరవం కనబరుస్తున్నందుకు అమితాబ్ బచ్చన్ ఓ ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలపాలని అనుకున్నాడు… అది ఆయన మంచితనం… ఇలా ట్వీటాడు…
Ads
T 4698 – I am honoured and have had the great privilege of being a part of this great enterprise in Telugu Cinema , ‘Project K’ and to have had the huge honour of being in the same frame of the Idol , Prabhas .. Thank you all .. and thank you Nagi Sir, for thinking of me .. The humility , the respect and the concern Prabhas has given me has been so so touching & emotional .. Not for me , but for all those involved in ‘Project K’ , may your hard work touch new horizons .. love and prayers
దీనికి తెలుగు ట్రాన్స్‌లేషన్ ఎంత దరిద్రంగా ఉందంటే… ఓసారి మీరే చదవండి… ‘‘ తెలుగు సినిమా మరియు దాని ఆరాధ్యదైవం ప్రభాస్ కీర్తిలో ఉండాలనే గౌరవం మరియు గొప్ప అధికారాన్ని పొందడం. నేను ధన్యుడిని అని మాత్రమే చెప్పగలను.. వారి వినయం, వారి గౌరవం, వారి శ్రద్ధ చాలా హత్తుకునే మరియు భావోద్వేగ … నా కోసం కాదు, ‘ప్రాజెక్ట్ K’లో పాలుపంచుకున్న వారి కోసం, మీరు పడిన కష్టాన్ని వర్ధిల్లాలని మరియు కొత్త క్షితిజాలను పొందాలని కోరుకుంటున్నాను…’’
మామూలుగా మనం గూగుల్ అనువాదాల మీద మస్తు జోకులేసుకుంటాం కదా… ఇది చదివితే కూడా అంతే నవ్వొచ్చింది… అసలు తెలుగులో ట్వీటాలనే తాపత్రయం దేనికి..? సరే, మరిన్ని లక్షలాది మందికి తన సందేశం చేరాలని తపన కనబరిచాడు అనుకుందాం… అలాంటప్పుడు ఈ చెత్త ట్రాన్స్‌లేషన్ ప్లాట్‌ఫారాలను ఆశ్రయించడం కన్నా తన టీంలో తెలుగు తెలిసినవాళ్లతో ట్వీటించవచ్చు కదా…
తను హిందీలో లేదా ఇంగ్లిషులో రాయడం, దాన్ని వివిధ భారతీయ భాషల్లోకి అచ్చం ఇలాగే వంకర టింకర భాషల్లోకి అనువదించడం అవసరమా..? జనం నవ్వుకోరా..? ఏదో ఆశిస్తే ఇంకేదో జరిగినట్టు కాదా..? ఒక భాషలోని భావాన్ని యథాతథంగా వేరే భాషలోకి యాంత్రికంగా… కాదు, యంత్రం ద్వారానే అనువదించడం ఎప్పుడూ సాధ్యం కాదు… వర్తమాన కృత్రిమ మేధస్సు కూడా ఇంకా అంతగా ఎదగలేదు… అమితాబ్ సార్, మిమ్మల్నే… వింటున్నారా.. లేదా..?!
Share this Article