Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

KBC … దేవియో ఔర్ సజ్జనో… బిగ్‌బీ ఇక సెలవు తీసుకుంటాడట !!

September 10, 2026 by M S R

.

అమితాబ్ బచ్చన్… రియల్ సూపర్ స్టార్… పదీపదిహేనేళ్ల పిల్లల దగ్గర నుంచి ప్రస్తుతం సెవెన్టీస్‌లో ఉన్నవాళ్ల దాకా… అందరికీ ఆరాధ్య నటుడు… కాదు, అంతకుమించి… ప్రధాన కారణాల్లో ఒకటి కేబీసీ… కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రాం ఇతర టీవీ రియాలిటీ షోల వంటిది కాదు… దాని విశేషం ఏమిటో సరిగ్గా చెప్పాలంటే ఓ పుస్తకమే కావాలి…

దాన్నుంచి అమితాబ్ రిటైర్ కాబోతున్నాడనే వార్తలు వైరల్ ఇప్పుడు… ఈ ఊహాగానాలకు ఆయన స్వయంగా రాసుకున్న తన బ్లాగ్ పోస్టే కారణమైంది… ప్రస్తుతం జరుగుతున్న KBC 18వ సీజన్ షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ ఆయన తన అధికారిక బ్లాగ్‌లో రాసుకొచ్చిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు ఈ చర్చకు దారితీశాయి…

Ads

‘‘షోలో పాల్గొనే కొంతమంది కంటెస్టెంట్లు తమ జీవితంలోని తీవ్రమైన వ్యక్తిగత విషాదాలు, కష్టాలను పంచుకుంటారు… వాటిని విన్నప్పుడు కలిగే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మాత్రమే కాకుండా, షోను కంట్రోల్ చేస్తూ ముందుకు వెళ్లడం కూడా చాలా కష్టంగా మారుతోంది… ఈ షోలో ఎంతగానో కలచివేసిన కొన్ని కంటెస్టెంట్ల కథల గురించి నేను పూర్తిగా బయటపెట్టలేను… అలా చేయడం ఛానెల్‌ నిబంధనలకు విరుద్ధం…

ఇది నాకు ఎంతో “హృదయ విదారకమైన అనుభవం” (heart-breaking experience)… ఇక నేను రిటైర్ కావాలని కోరుకుంటున్నాను.. చాలా పొద్దుపోయింది.. రాత్రి ఆహ్వానిస్తోంది.. లవ్” (I wish to retire now .. it is late .. and the night invites .. Love) అని ముగించాడు… అయితే అమితాబ్ రాసిన ఈ చివరి వాక్యాలు కేవలం ఆ రోజు రాత్రి బ్లాగ్ ముగింపు కోసం రాసిన లేటు నైట్ సైన్- ఆఫ్ కామెంట్‌లా ఉన్నప్పటికీ, కంటెస్టెంట్ల భావోద్వేగ గాయాలు తనపై చూపుతున్న ప్రభావాన్ని ఆయన చాలా బలంగా వ్యక్తపరిచాడు… త

తన రాతలో, తన వ్యక్తీకరణలో కనిపిస్తున్న తేడా ఇక ఆయన కేబీసీ నుంచి రిటైర్ కానున్నాడనే వార్తలకు కారణమైంది… 26 ఏళ్లుగా (ఒక్క మూడో సీజన్ మినహా) తనదైన శైలిలో హోస్ట్ చేస్తూ వస్తున్నాడు… తన బ్లాగ్ రాతలు తాను అలిసిపోయాననే చెబుతున్నాయి…

అమితాబ్ బచ్చన్ లేకుండా ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (KBC) ఊహించడం నిజంగా అసాధ్యం… బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద యాంగ్ యాంగ్రీ మ్యాన్‌గా, దశాబ్దాల పాటు యావత్ దేశాన్ని ఏలిన మెగాస్టార్‌గా ఆయన ప్రస్థానం ఒక అద్భుతం. అయితే, కేవలం వెండితెరకే పరిమితమైన ఆ ఇమేజ్‌ను బద్దలు కొట్టి, దేశంలోని ప్రతి పల్లెటూరికి, ప్రతి ఇంటి గదిలోకి, చివరకు టీవీ ముందు కూర్చునే పసిపిల్లల వరకు అమితాబ్‌ను అత్యంత సన్నిహితుడిగా మార్చింది మాత్రం కేబీసీనే…

ఇతర భాషల్లో కూడా చాలామంది నటులు కేబీసీ హోస్ట్ చేశారు… మెగాస్టార్లు సైతం చేతులెత్తేశారు… కానీ కేబీసీ అంటే అమితాబ్ మాత్రమే అనే రేంజులో సక్సెస్‌ఫుల్ హోస్టింగ్ మాత్రం అమితాబ్‌దే… తను అలా కనెక్ట్ అవుతాడు…

ఈ ప్రయాణం వెనుక ఒక చారిత్రక సత్యం ఉంది. ఒక దశలో అమితాబ్ స్థాపించిన ఏబీసీఎల్ (ABCL) సంస్థ ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, కోట్లాది రూపాయల అప్పులు ఆయనను దివాలా అంచున నిలబెట్టాయి. సరిగ్గా ఆ కష్టకాలంలో, 2000 సంవత్సరంలో కేబీసీ రూపంలో వచ్చిన అవకాశం ఆయన జీవితాన్ని మళ్లీ నిలబెట్టింది. కెరీర్ పతనావస్థలో ఉందనుకున్న సమయంలో టెలివిజన్ మాధ్యమం ద్వారా ఆయన రీఎంట్రీ ఇచ్చి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ షో సంపాదించిపెట్టిన ఆదరణ, ఆర్థిక పునరుజ్జీవనం ఆయనను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకువెళ్లడమే కాకుండా, భారతీయ టెలివిజన్ చరిత్రను తిరగరాశాయి.

“దేవియో ఔర్ సజ్జనో” అనే తన పిలుపు వినిపించకపోతే అది అసలు కేబీసీయే కాదు… ఇది బిగ్‌బాస్ కాదు, పిల్లల నుంచి పెద్దల దాకా కనెక్టయ్యే షో…  అమితాబ్ – కేబీసీ అనేది ఒకరినొకరు విడదీయరాని బంధం. ఆ ఇద్దరి అనుబంధం కేవలం ఒక టెలివిజన్ గేమింగ్ షో మాత్రమే కాదు; ఒక తరం జీవితాలతో ముడిపడిన భావోద్వేగ ప్రయాణం… ముసలితనపు వణుకు ఇంకా ఆ గొంతును తాకలేదు… సో, అమితాబ్ జీ… ప్లీజ్ కంటిన్యూ… ఇది జాతి యావత్తూ కలిసి చేసే ఓ భిన్నమైన జర్నీ !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • KCR ‘మైల దారి’ … గంగ పూర్తిగా చంద్రముఖిగా మారిపోయింది !!
  • KBC … దేవియో ఔర్ సజ్జనో… బిగ్‌బీ ఇక సెలవు తీసుకుంటాడట !!
  • ‘‘అంత బిజీ అయితే- థియేటర్ వెళ్లి సినిమా ఎవడు చూడమన్నాడు’’
  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions