.
Shankar G…. తారలు మారుతారు, అదృష్టాలు మారుతాయి … అక్కినేని హీరోగా చేయాల్సిన పాతాళభైరవిలో ఎన్టీఆర్ హీరోగా చేసి రాత్రికి రాత్రి సూపర్ మాస్ ఇమేజ్ తో సూపర్ స్టార్ అయ్యాడు. షావుకారు జానకి చేయాల్సిన దేవదాసులో పార్వతి క్యారెక్టర్ చేసి మహానటి అయ్యింది సావిత్రి.
శోభన్ బాబు హీరోగా చేయాల్సిన గూఢచారి 116 లో కృష్ణ ఛాన్స్ కొట్టేసి తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించి సూపర్ స్టార్ అయ్యాడు. కృష్ణ చేయాల్సిన ఖైదీ మూవీ చిరంజీవి చేసి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు.
Ads
అలాగే బాలీవుడ్ లో ఇలాంటి విచిత్రం ఒకటి జరిగింది అదేంటంటే… అమితాబ్ బచ్చన్ తన 5 దశాబ్దాల సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు. ఆ చిత్రాలన్నింటిలో, యశ్ చోప్రా దర్శకత్వం వహించిన ‘దీవార్’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా అమితాబ్ బచ్చన్‌ను రాత్రికి రాత్రే సూపర్‌స్టార్‌గా మార్చింది. అయితే, ఈ క్లాసికల్ చిత్రానికి బిగ్ బి మొదటి ఎంపిక కాదనే విషయం చాలా తక్కువ మంది అభిమానులకు మాత్రమే తెలుసు.
యశ్ చోప్రా ‘దీవార్’ స్క్రిప్ట్‌ను చూసినప్పుడు, ఆయన వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. మీడియా నివేదికల ప్రకారం…, యశ్ చోప్రా ఈ చిత్రంలో ‘విజయ్ వర్మ’ పాత్రలో రాజేష్ ఖన్నాను తీసుకోవాలనుకున్నారు. గతంలో యశ్ చోప్రా, రాజేష్ ఖన్నాతో ‘దాగ్’ చిత్రంలో పనిచేశారు. ఈ కారణంగానే దర్శకుడు రాజేష్ ఖన్నాను ఈ చిత్రంలో తీసుకోవాలనుకున్నారు.
ఆ రోజుల్లో రాజేష్ ఖన్నాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది. కాకా (నిక్ నేమ్ ) దగ్గర చిత్ర నిర్మాతల లైన్ ఉండేది. ఈ కారణంగా, రాజేష్ ఖన్నా ‘దీవార్’ చిత్రానికి డేట్స్ ఇవ్వలేకపోయారు.
సినిమాలో అమితాబ్ ప్రవేశం
రాజేష్ ఖన్నా ఈ సినిమాకు డేట్స్ ఇవ్వకపోవడంతో సలీం- జావేద్ అమితాబ్ బచ్చన్ పేరును సూచించారు. దీని తర్వాత, యశ్ చోప్రా ‘దీవార్’లో ‘విజయ్ వర్మ’ పాత్రను అమితాబ్‌కు ఇచ్చారు. దీని తర్వాత జరిగిన చరిత్ర అందరికీ తెలిసిందే, ఈ సినిమా రాత్రికి రాత్రే అమితాబ్ బచ్చన్‌ను ఎలా సూపర్‌స్టార్‌గా మార్చిందో. తర్వాత మాస్ గాడ్ గా మారిపోయాడు.
‘దీవార్’లో అమితాబ్ బచ్చన్‌తో పాటు, శశి కపూర్, పర్వీన్ బాబీ, నీతూ సింగ్, నిరూపా రాయ్ వంటి తారలు తమ నటన ప్రతిభను ప్రదర్శించారు. IMDb ఈ సినిమాకు 8 రేటింగ్ ఇచ్చింది…
Share this Article