Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈమె కూడా ఓ గంధర్వగాయని..! కానీ ఆ ఇద్దరికే దక్కిన తెలుగు అభిమానం..!

August 24, 2025 by M S R

.

తెలిమంచు కరిగింది, తలుపు తీయనా ప్రభూ అంటూ టీవీలో ఓ గీతం స్వరమాధుర్యాల్ని వెదజల్లుతుంటే హఠాత్తుగా మెలకువ వచ్చింది… కళ్లు మూసుకుని ఆ తదాత్మ్యంలోనే కాసేపు మునిగీ తేలాక, పాట ఆగింది…

కాసేపు శూన్యం… ఎంతటి శ్రావ్యత… ఏదో టీవీలో పొద్దున్నే వాణిజయరాం పాటల మీద ఏదో స్పెషల్ స్టోరీ వస్తోంది… అదీ నిద్రలేపింది… నీ దోవ పొడవునా కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెళకువల వందనం… దొరలని దొరనగవు దొంతరని, తరాలని దారి తొలిగి రాతిరిని…

Ads

సిరివెన్నెల కలం, వాణిజయరాం గళం… స్వాతికిరణంలోని ఈ పాట ఆమె కీర్తికిరీటాల్లో జస్ట్, చిన్నది… ఆ సినిమాలో 11 పాటలు… అన్నీ సంగీత ప్రధానమే… అసలు సినిమా కథే సంగీతానికి సంబంధించింది… భక్తి, సంగీత ప్రధానమైన పాట అనగానే దర్శకులకు గుర్తొచ్చేది వాణిజయరాం…

కొందరికి కలుక్కుమనవచ్చుగాక… కొన్ని పాటలను సుశీల, జానకిలను గాకుండా వాణిజయరాంనే పిలిచి పాడించుకున్నారు… ప్రత్యేకించి తెలుగులో విశ్వనాథ్… స్వాతికిరణంలోని 11 పాటల్లో ఎనిమిది ఆమే పాడింది… మిగతావి మేల్ సాంగ్స్, బాలు పాడాడు…

ఆ సినిమాలో శివానీ, భవానీ పాట ఈరోజుకూ అల్టిమేట్… విశ్వనాథ్ సినిమాల్లో ఇదొక్కటే కాదు, స్వరప్రధానంగా సాగే శృతిలయలు, శంకరాభరణం… అన్నిరకాల పాటలు పాడినా సరే ఆమెకు పేరు తీసుకొచ్చింది శాస్త్రీయ సంగీతం వాసనలున్న ట్యూన్లే…

సెర్చింగులో ఆమె వివరాలు చదివేకొద్దీ, నిజానికి ఈమెకు దక్కాల్సినంత గుర్తింపు నిజంగా దక్కిందా అనే డౌటూ వచ్చింది… రెండు కాదు, మూడు కాదు, 19 భాషల్లో పాటలు పాడింది ఆమె… హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు అనబడే పాన్ ఇండియా భాషలతోసహా గుజరాతీ, మరాఠీ, మార్వారీ, హర్యాన్వి, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిషు, భోజ్‌పురి, రాజస్థానీ, బడగ, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ, తుళు… ట్రెమండస్ రికార్డు…

20 వేల సినిమా పాటలు, వేలాది ప్రైవేటు భక్తి ఆల్బమ్స్… ఎనిమిదో ఏట కచేరీ మొదలుపెట్టిన ఆమెకు 3 జాతీయ అవార్డులు… సంపూర్ణమైన, సార్థకమైన జీవితం… ఇంకేం కావాలి ఒక గాయనికి..?

నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా అని చిలిపిగా, రొమాంటిక్‌గా పలికిన గొంతే విధి చేయు వింతలన్నీ అని వైరాగ్యభావనల్లో ముంచెత్తుతుంది… దొరకునా ఇటువంటి సేవ అంటూ ఆ స్వరేశ్వరుడిని అర్చిస్తూనే, అలలు కలలు ఎగిసి ఎగిసి అలసి సొలసి పోయే అని అలసటకూ గురవుతుంది…

అన్ని వేదికల మీద ప్రముఖులంతా జానకి, సుశీల ప్రస్తావనకు తీసుకొస్తూనే ఉంటారు… చప్పట్లు కొడతారు, కొట్టిస్తారు… వాళ్లు తెలుగు స్వరకీర్తులే… సందేహం లేదు… మరుపురాని పాటలెన్నో పాడిన గొంతులే… కానీ తెలుగువాళ్లు నిజంగా జానకి, సుశీల మీద చూపిన అభిమానాన్ని వాణిజయరాం మీద చూపించారా..?

ఆ ఇద్దరూ మన తెలుగువాళ్లు, వాణిజయరాం తమిళియన్ అనే భావనా..? (స్థానికాభిమానమా..? ఒకరిది రేపల్లె, మరొకరిది విజయనగరం) కావచ్చు… కావచ్చు…!! అదుగో టీవీలో మరో పాట ప్రారంభమైంది… సీతాకోకచిలుకలోని సాగరసంగమమే పాట పరిమళం వ్యాపిస్తోంది… ఆహా… చెవుల్లోకి అమృతధార… నిజంగా ఆమె గంధర్వగాయని..!! (మూడేళ్ల క్రితం కథనం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • BB9Telugu..! ఫాఫం కింగ్ నాగార్జునకే అగ్నిపరీక్ష… నో బజ్, నో వ్యూయర్స్…
  • ఫాఫం మిరయ్… ఆ నిర్మాతలు ఎవరో గానీ… థియేటర్ వెళ్లే పనిలేదు..!!
  • టార్గెట్ సాక్షి ఎడిటర్..! జగన్ సన్నిహితగణంపై పాలకుల ప్రత్యేక దృష్టి..!!
  • నేపాల్ అల్లర్ల విశ్లేషణలోనూ… అదే యాంటీ- జగన్, అదే ఆవు వ్యాసం…
  • పార్టీ పాలసీల్లో గందరగోళం, అస్పష్టత… అమరావతిపై యూటర్న్ అదే…
  • ‘కూలీ’ ఇచ్చి మరీ… కొరడాలతో కొట్టించుకోవడమంటే ఇదే…
  • నాటకాలు, సినిమాలు… రచన, నటన… విసు ఓ తమిళ దాసరి…
  • కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…
  • GenZ … నెట్ వీథుల్లో విప్లవరచన… అసలు ఏమిటీ తరం..? చదవండి..!
  • Air Bag to Air Bus …. ప్రయోగాలు ఫలిస్తే విమానప్రాణాలకు శ్రీరామరక్ష…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions