Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఖర్మ… లైంగిక దాడులు చేసేవాళ్లూ హీరోలే మన దరిద్రానికి..!!

June 9, 2024 by M S R

సినిమాల్లో రేపులు విలన్లే కాదు ; హీరోలూ చేస్తారు . స్తీజన్మలో NTR , ఈ సినిమాలో ANR . ఒకరు తాగిన మైకంలో , మరొకరు ఆగ్రహావేశంలో . ఈ సినిమాల్లో ఆ రేపులే మలుపులు . ANR-వాణిశ్రీ జోడీ జైత్రయాత్రలో మరో సినిమా 1972 అక్టోబరులో వచ్చిన ఈ విచిత్రబంధం సినిమా . సిల్వర్ జూబిలీ ఆడిన మ్యూజికల్ హిట్ . యద్దనపూడి సులోచనారాణి నవల విజేత ఆధారంగా నిర్మించబడిన సినిమా .

అన్నపూర్ణ బేనర్లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో , కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వాణిశ్రీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిందే . ఆత్మాభిమానం , ఆత్మవిశ్వాసం , అతిశయం , పొగరు అన్నీ కలబోసిన పాత్రలు వేయటంలో సిధ్ధహస్తురాలు వాణిశ్రీ . నవలా నాయకి . ప్రేమనగర్ , సెక్రటరీ , ఈ సినిమా , జీవనతరంగాలు వంటి ఎన్నో నవలలకు ప్రాణం పోసింది .

ఈ సినిమా సూపర్ సక్సెస్ కు కారణం పాటలు . ఆత్రేయ విరచిత చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి పాట సూపర్ హిట్ . అందమైన జీవితమూ అద్దాల సౌధము , చల్లని బాబు నా అల్లరి బాబు , వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట , అమ్మా అమ్మా అనీ పిలిచావు , చిక్కావు చేతిలో చిలకమ్మా పాటలన్నీ వీర హిట్టయ్యాయి .

Ads

ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ భాగ్యనగరం ఆవిర్భావ కధ . బుర్రకధ రూపంలో ఆత్రేయ విరచిత భాగమతి నాటకం . చాలా బాగా చిత్రీకరించారు . ANR , వాణిశ్రీ అందంగా కనిపిస్తారు . చాలామందికి భాగ్యనగరం వెనుక ఉన్న ప్రేమ కధ తెలియదు . ఈ సినిమాలోని ఈ బుర్రకధ కం నాటకం తెలుగు వారికి ఆ కధ తెలిపింది .

ANR , వాణిశ్రీ , SVR , గుమ్మడి , పద్మనాభం , రాజబాబు , అల్లు రామలింగయ్య , నాగయ్య , అంజలీదేవి , సంధ్యారాణి , లీలారాణి , సూరేకాంతం , మాస్టర్ ఆదినారాయణ ప్రభృతులు నటించారు . ఈ సినిమా వచ్చేటప్పటికి నేను M Com లో జాయినయ్యాను కూడా .

గుంటూరులో , నరసరావుపేటలో రెండు చోట్లా చూసా . టివిలో చాలాసార్లే . యూట్యూబులో ఉంది . చూసి ఉండనివారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . An entertaining , feel good , musical hit movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …… (డోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సరిత..! అప్పట్లో ఈ నటి విడాకుల కేసు ఓ సంచలనం…!!
  • స్టెమ్ సెల్ థెరపీ..! సుగర్ వ్యాధిపై మనిషి గెలుపు త్వరలోనే..!
  • కృష్ణంరాజు డేట్స్ ఇచ్చాడు… ఓ సినిమా లాగించేశారు… అంతే…
  • రెడ్ గోల్డ్..! బంగారం, వెండి మాత్రమే కాదు… రాగి కూడా ‘ఆకర్షిస్తోంది’…!!
  • ఆ ఎమ్మెల్యే ఎవరో గానీ… అయ్యా, సారూ, నీకో దండం సామీ…!!
  • శతాబ్దం తరువాత ఈ గర్భగుడి తెరుచుకుంటోంది..! అసలు ఏమిటీ కథ..?
  • గీ బూతులు, గీ పాటలు… అరె, గిట్ల తయారయ్యారేందిర భయ్…
  • హే బలవంత్..! ఒక ఈటీవీ జబర్దస్త్ తరహా పే-ద్ద సినిమా స్కిట్…!!
  • వెగటు స్టార్..! యాటిట్యూడ్‌ను ప్రేక్షకులు గుంజీ గుంజీ — పగులగొట్టారు…
  • డాక్టర్ శ్రీలీల..! కాలేజీకి ఎప్పుడు పోయింది..? ఎప్పుడు చదివింది..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions