Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాపం మహానటి సావిత్రి… అప్పటికే అప్రధాన వదిన పాత్రలోకి…

June 15, 2024 by M S R

ఆకలయి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు అనే పద్మనాభం పాత్ర పాడే పాట ఆరోజుల్లో గొప్ప సంచలనమయింది . ఆ పాట వలన పద్మనాభానికి కూడా మంచి పేరు వచ్చింది . సినిమాకు రన్ ని పెంచింది . విశేషం ఏమిటంటే ఈ పాటను నిర్మాత విశ్వేశ్వరరావు వ్రాసారట .

సి యస్ రావు దర్శకత్వంలో NTR మొదటి పూర్తి రంగుల సాంఘిక చిత్రం 1973 లో రిలీజయిన ఈ దేశోధ్ధారకులు సినిమా . సినిమా సూపర్ హిట్ . 12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . కడపలో 210 రోజులు ఆడింది . ఇలాంటి కధాంశంతో NTR చాలా సినిమాలే చేసారు . దేశద్రోహులు , కధానాయకుడు , వగైరా . అయితే ఈ సినిమా కలర్ సినిమా కావటం , వాణిశ్రీ , కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో హిట్ సాంగ్స్ ఉండటం , మోదుకూరి జాన్సన్ – మహారధిల మాటల తూటాలు చిత్రం ఘన విజయానికి కారణాలయ్యాయి .

ntr

Ads

ఆత్రేయ విరచిత ఈ వీణకు శృతి లేదు ఎందరికో హృదయం లేదు అనే పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . నటి శుభ మీద చిత్రీకరించబడింది . ఇది కాదు మా సంస్కృతి ఇది కాదు మా ప్రగతి , మబ్బులు రెండూ భేటీ అయితే మెరుపే వస్తుంది , కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . స్వాగతం దొరా సుస్వాగతం తేనె లాంటి పిలుపువున్న తెలుగు నేలకు అన్నపూర్ణను మించిన ఆంధ్రభూమికి అనే వాణిశ్రీ గ్రూప్ డాన్స్ బాగుంటుంది .

పాపం సావిత్రి ! మహానటి !!! తెలుగు చలనచిత్ర రంగాన్ని శాసించిన సావిత్రి ఎలాంటి ప్రాధాన్యత లేని వదిన పాత్రలో , ఏవో కొన్ని సీనుల్లో కనపడే పాత్ర వేయటం బాధ కలుగుతుంది . అందరినీ నమ్మి మోసపోయి , నిస్పృహతో తన జీవితాన్నే తాను నాశనం చేసుకున్న అభాగ్యురాలు . కొందరి జీవితాలు అలాగే ముగుస్తుంటాయి .

ntr

నాగభూషణం , ప్రభాకరరెడ్డి , మిక్కిలినేని , ధూళిపాళ , నాగయ్య , రాజనాల , సత్యనారాయణ , రావు గోపాలరావు , రాజసులోచన , పద్మా ఖన్నా ప్రభృతులు నటించారు . By the way , ఈ సినిమాలో NTR సిబిఐ ఆఫీసర్ . ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా NTR కు మారు వేషాలు ఉంటాయి . లేకపోతే జనానికి ఎక్కదు .

కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో ఓ నాలుగయిదు సార్లు చూసి ఉంటా . వెంకటేశ్వర పిక్చర్ పేలసులో ఆడినట్లు గుర్తు . టివిలో కూడా చాలాసార్లు వచ్చింది . An excellent entertaining , musical hit movie . ఈతరం వారిలో చూడని వారుంటే వాచ్ లిస్టులో వేసేసుకోవచ్చు . యూట్యూబులో ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…………. (డోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇదే మరి… అనవసరంగా గోకనేల..? ఆనక సారీతో లెంపలేసుకోనేల..?!
  • కడియం, దానం… అసలు జవాబులు దొరకని కొన్ని భేతాళ ప్రశ్నలు…
  • అమెరికాలో రిలయెన్స్ రిఫైనరీ… ఆయిల్ మార్కెట్‌లో సంచలనం…
  • తెలుగు బుల్లితెరపైకి సోనీ… స్టార్‌మా, జీతెలుగు చానెళ్లకు పోటీ…
  • ‘‘స్వాతిముత్యపు జల్లులలో….’’ ఈ పాటొక్కటే సినిమాలో చూడబుల్…
  • ‘నీ దుకాణం మూసుకుంటావా’… నమస్తే తెలంగాణకు బిగ్‌ టీవీ సవాల్…
  • సిందూర్ దెబ్బ… రిపేర్లూ కష్టమై ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’ కూల్చివేత…
  • కక్కు- కిక్కు…! సర్కారు సారా Vs చీప్ లిక్కర్…! ఏ భూతం తక్కువ డేంజర్…?!
  • మళ్లీ ఏదో కూశాడు… ఇక మారడు, సైకియాట్రిస్టులే శరణ్యం…
  • జ్యోతిష నామ ధూర్తత్వం సమాజానికి కీడు చేస్తోంది… జాగ్రత్త సుమీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions