Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ సినిమాకు దాసరి అసోసియేట్ డైరెక్టర్… ఓ పాట కూడా రాశాడు…

April 7, 2024 by M S R

Subramanyam Dogiparthi….   మత సామరస్యాన్ని , మతంకన్నా మానవత్వం గొప్ప అనే సందేశాలను ఇచ్చే సినిమా 1970 లో వచ్చిన ఈ ఒకే కుటుంబం సినిమా . నాగభూషణం నిర్మించిన ఈ సినిమాకు భీం సింగ్ దర్శకులు . తమిళంలో వచ్చిన పాపమణిప్పు అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . పాప పరిహారం అనే టైటిల్ తో తెలుగులోకి డబ్బింగ్ చేయబడింది కూడా . తమిళంలో శివాజీ , జెమిని , సావిత్రి , దేవిక , యం ఆర్ రాధా నటించారు .


నిజ జీవితంలో తల్లీకూతుళ్ళు అయిన రుక్మిణి , లక్ష్మి ఈ సినిమాలో అత్తాకోడళ్ళు . అన్ని సినిమాల్లో తమ్ముడుగా నటించే కాంతారావు ఈ సినిమాలో NTR కు అన్నయ్య . NTR తో లక్ష్మి మొదటిసారిగా జోడీగా నటించింది .

యస్ పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో పాటలు బాగా హిట్టయ్యాయి . ముఖ్యంగా అందరికీ ఒక్కడే దేవుడు కొందరికి రహీము కొందరికి రాముడు , మంచిని మరిచి వంచన చేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఓటున్న బాబులారా అనే పాట ఈనాటి ఎలక్షన్లకు బాగా సూటవుతుంది . మిగిలిన పాటలు ఔనే తానే నన్నేనే నిజమేనే అంతా కధలే , కావాలి తోడు కావాలి ఒంటరిదైన రామచిలుకకు జంట కావాలి , నవ్వలేక ఏడ్చాను ఏడ్వలేక నవ్వేను కూడా బాగుంటాయి .

Ads

మూడు మతాలకు సంబంధించిన ప్రజలు ఒకే చోట అన్నదమ్ములుగా , ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి జీవించటాన్ని మనసులకు హత్తుకుపోయే విధంగా చూపారు దర్శకులు భీం సింగ్ . NTR , లక్ష్మిల జంట అందంగా ఉంటుంది . దాసరి నారాయణరావు ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ . మంచిని మరిచి వంచన నేర్చి అనే పాటను కూడా ఆయనే వ్రాసారు .

NTR , లక్ష్మి , కాంతారావు , రాజశ్రీ , నాగభూషణం , రుక్మిణి , ధూళిపాళ , నాగయ్య , సి హెచ్ నారాయణరావు , అల్లు రామలింగయ్య , రాజబాబు ప్రభృతులు నటించారు . ఓటున్న బాబుల్లారా పాటకు హిందీ డాన్సర్ జయశ్రీ డాన్స్ చేసింది .

మా నరసరావుపేటలో రెండు మూడు సార్లు చూసి ఉంటా . టి విలో వచ్చిననప్పుడల్లా కాసేపయినా చూస్తా . నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఒకటి ఇది . కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయింది . యూట్యూబులో ఉంది . తప్పక చూడండి . An excellent feel good movie with a meaningful message . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions