Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక మీడియా హౌజ్… ఆఫీస్ క్లోజ్… అందరూ కలం పోరాటయోధులే మరి..!!

September 12, 2025 by M S R

.

Murali Buddha …. జర్నలిస్ట్ కథలు 1 …. రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వలేక పోతున్నాం . మా బాధలు అర్థం చేసుకోండి … అంటూ ఆ బాస్ దీనంగా తన మీడియా సంస్థ దీన కథ చెబుతూ పోతున్నాడు …

బాస్ చెప్పడం ముగియక ముందే ఓ పాలమూరు బిడ్డ లేచి… సార్, మీరు ఇంతగా బాధ పడడం ఎందుకు ? మనం ప్రపంచ సమస్యలు పరిష్కరించే వాళ్ళం . మేధావులకు దారి చూపే వాళ్ళం .రాజకీయ నాయకులకు రాజకీయం నేర్పే వాళ్ళం . ఇంత చిన్న సమస్యకు మనం దిగులు పడటమా ? ఇవ్వాల్సింది జీతమే కదా ? 20 లక్షల చిట్టీ ఎత్తుదాం … మా ఊరిలో నేను చిట్టీ ఎత్తుతా . దానితో జీతాలు ఇవ్వండి . నెల నెల చిట్టీ కట్టండి చాలు అని అందరి వైపు గర్వంగా చూశాడు పాలమూరు బిడ్డ …

Ads

కష్టకాలంలో రైతుకు యూరియా బస్తాలు దొరికినట్టు … ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ అందించినట్టు .. దాహంతో అల్లాడుతున్న వాడికి అమృతం అందించినట్టు… ఒక్క మాటలో చెప్పాలి అంటే తల వెనుక చక్రం లేని దేవుడిలా కనిపించాడు …

అతని దాతృత్వానికి అంతా చప్పట్లు కొట్టి అభినందించారు … కార్యశూరుడు మాటలకే పరిమితం కాడు… రంగంలోకి దిగి, చిట్టి పాడి, నగదు బాస్ బల్ల మీద వేసి విజయ గర్వంతో చూశాడు … మరుసటి రోజు నుంచి పాలమూరు బిడ్డ ఏం రాసినా పబ్లిష్ చేయాలి అనే ఆదేశాలు కంటి చూపుతోనే జారీ అయ్యాయి …

ఆఫ్టరాల్ ఓ కుర్ర కుంకకు ఇంత పలుకుబడి ఉంటే, పెద్ద కుంకలం, మాకెంత ఉండాలి అని బాస్ మనసులోనే అనుకుని…..  పైకి మాత్రం సంస్థను కాపాడావు అన్నట్టుగా పాలమూరు బిడ్డ వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూశాడు …

రోజులు గడుస్తున్నాయి … చిట్టి పాడిన డబ్బులు జేబులు మారాయి … ఆఫీస్ కళకళలాడింది … క్యాంటీన్ లో కబుర్లు గలగలలడాయి … ఎంత పెద్ద చిట్టి డబ్బయినా ఎన్ని రోజులు ఉంటుంది … జేబులు ఖాళీ అయ్యాయి …

అద్దె కట్టలేదు అని ఆఫీస్ ఓనర్ ఆఫీస్ కు తాళం వేసి , తాళం చెవి తన జేబులో వేసుకున్నాడు… మీడియా స్వేచ్ఛపై దాడి అని ఒక్క మీడియా గొంతు కూడా గళం ఎత్తలేదు … తాళాలు తెరుచుకుంటాయా ? సిబ్బందికి జీతాలు ముడతాయా ? పాలమూరు బిడ్డకు చిట్టి డబ్బులు తిరిగి వస్తాయా ?

ఈ బేతాళ కథ విన్నావు కదా ? ఇందులో తప్పెవరిది ? కష్టాలు చూసి చీటీ పాడిన ఆ పాలమూరు బిడ్డదా ? అర్ధంతరంగా తాళాలు వేసిన బిల్డింగ్ ఓనర్ దా ? అమాయక పాలమూరు బిడ్డ ఆవేశంతో చీటీ పాడుతా అంటే వోకే వోకే అన్న ఆ  ముదురు బాస్ దా ? తప్పెవరిది ? ఎలా ముగుస్తుంది ?………. జవాబు చెప్పలేదనుకో, తెలుసుగా… తల వేయి వ్రక్కలు ఎట్సెట్రా…

వీరెవరిదీ తప్పు కాదు… మొదటి తప్పు ఆ చీటీల అతనిది … అసలే జర్నలిస్ట్, పైగా యూనియన్ నాయకుడు, అతనికి చీటీ ఇవ్వడం తప్పు … చీటీ పాడిన పాలమూరు బిడ్డ స్వయంగా తాను జర్నలిస్ట్ + నాయకుడు అయి ఉండీ, అంత అమాయకంగా నాయకులను నమ్మి, చీటీ పాడిన వాడు రెండో ముద్దాయి …

మరి బాస్ తప్పేమీ లేదా ? బాస్ తన బాధ్యత తాను నిర్వర్తించాడు . మోసం చేయడం తప్పు కాదు మోసపోవడం తప్పు … ఇక చివరగా ఏమవుతుంది అంటే చీటీ ఓ విష వలయం… పాలమూరు బిడ్డ తన ఇంటినో పొలాన్నో అమ్మి చీటీ కట్టాల్సి రావచ్చు … ఇది చీటీ… అతని ధైర్యం, బలం మీద ఆధారపడి ఉంటుంది … లేదంటే తన వల్ల కాదు అని అందరినీ ముంచి చీటీల అతను పారిపోవచ్చు … ( సంఘటన వాస్తవం ... వర్ణన కల్పితం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions