Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంటర్నేషనల్ ఫ్లయిట్‌లో మీల్స్ సమస్య… ఇలా సొల్యూషన్ దొరికింది…

June 5, 2024 by M S R

ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీకి (అమెరికా రాజధాని) వెళ్లే ఫ్లయిట్ అది… స్ట్రెయిట్ ఫ్లయిట్… మధ్యలో ఎక్కడా దిగేది లేదు, ఆగేది లేదు… ఇప్పుడన్నీ అంతే కదా… ప్రత్యేకించి కొత్త విమాన సర్వీసులు ఆధునిక ఫ్లయిట్లను సమకూర్చుకున్నాక ఆగకుండా వెళ్తున్నాయి విమానాలు…

కాకపోతే సుదీర్ఘమైన ప్రయాణం… ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీ వరకు అంటే… దాదాపు 14, 15 గంటల ప్రయాణం… మనవాళ్లు ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఎకానమీ క్లాసే… అవేమో ఇరుకిరుకు సీట్లు… కాసేపటికి కాళ్లు పట్టేస్తాయి, కాసేపు అలా లేచి బాత్రూం వైపు లేదంటే అటూఇటూ నడవాలి…

సరే, ఇంటర్నేషనల్ ఫ్లయిట్ కదా… టైమ్‌కు మీ చాయిస్‌ను బట్టి ఇండియన్, చైనీస్, అమెరికన్ బ్రేక్ ఫాస్ట్, లంచ్ సర్వ్ చేస్తారు… ఆ ఎయిర్ సర్వీసును బట్టి… ఎయిర్ ఇండియా అయితే కొన్నిసార్లు ఇడ్లీ కూడా ఉంటుంది… ఒక స్మాల్ పెగ్, మీరు అడిగిన మద్యం ఇస్తారు, మరీ మరీ అడిగితే మరో స్మాల్… అంతే… (కొందరు పక్కకున్న ప్యాసింజర్ తాగేవాడు కాకపోతే ఆ కోటా తీసుకొమ్మని చెప్పి, తాము తాగేస్తారు, అది వేరే కక్కుర్తి కథ…)

Ads

ఓసారి ఓ విమానం బయల్దేరింది… 400 మంది ప్రయాణికులు… హాయిగా టేకాఫ్ అయ్యింది… అందరూ సీట్ బెల్టులు విప్పేశారు… ముచ్చట్లలో పడ్డారు… కాకపోతే పొరపాటున 200 మీల్స్ మాత్రమే లోడ్ చేయబడ్డాయి… ఉన్న ప్రయాణికులేమో 400… అయ్యో, ఇప్పుడెలా… సుదీర్ఘ ప్రయాణం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కడుపులోకి ఏదైనా తీసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు…

విమానయాన సంస్థ పరువు పోకుండా, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో … సిబ్బంది తెగ ఆలోచన చేయటం మొదలు పెట్టారు… ఓ ఫ్లయిట్ అటెండెంట్‌కు మంచి ఆలోచన తట్టింది… ఆమె కెప్టెన్‌ను సంప్రదించి ఇలా ప్రకటించింది…

‘‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ మాకు విమానంలో 400 మంది ప్రయాణికులు ఉన్నారు… కానీ , 200 మందికి మాత్రమే సరిపడా భోజనాలు ఉన్నాయి… ఎవరైనా తమ భోజనాన్ని మరొకరి కోసం వదులుకునేంత దయతో ఉంటే , వారికి ఫ్లయిట్‌లో ప్రయాణించే సమయం మొత్తం కూడా … ఉచిత, అపరిమిత మద్యం 🥃 సరఫరా చేయబడుతుంది…. ఇదీ ఆమె ప్రకటన…

ఆమె తదుపరి ప్రకటన 6 గంటల తర్వాత వచ్చింది… ‘‘లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరైనా తమ మనసు మార్చుకోవాలని అనుకుంటే, మా వద్ద ఇంకా 180 భోజనాలు అందుబాటులో ఉన్నాయి!”…

కథ యొక్క నీతి: మద్యపానం 🥴 చేసే వ్యక్తులు చాలా దయగల హృదయాలను కలిగి ఉంటారు. 💗దయచేసి వారిని గౌరవించండి..!….. (డౌటేముంది..? ఇది పక్కా వాట్సప్ పోస్టు… అజ్ఞాత రచయితకు ధన్యవాదాలు, కాకపోతే కథీకరణ నాది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions