Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కరిగిపోయాను కర్పూర వీణలా..! ఓ పాత ప్రేమకథకు కొత్త రూపు ఇలా…!!

August 20, 2024 by M S R

ఓ ప్రేమ జంటకు కొత్తగా పెళ్ళైంది… ఆ జంట తమ హానీమూన్‌కు ప్లాన్ చేసుకుంది… కాస్త భిన్నంగా, ఎప్పుడూ గుర్తుండేలా… అది మంచు పర్వతాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లడం… థ్రిల్లింగ్ కమ్ రొమాంటిక్… అనుకున్నట్టే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, ట్రెక్కింగుకు వెళ్తుంది ఆ జంట…

పూర్తిగా పైకి వెళ్ళాక అనుకోని ప్రమాదం… హఠాత్తుగా ఓ మంచు లోయలో పడిపోతాడు ఆ భర్త… షాక్ తింటుంది భార్య… కన్నీరుమున్నీరు అవుతుంది… హానీమూన్ కాస్తా తనకు అంతిమ యాత్రగా మారిన తీరుతో గుండె పగిలిపోతుంది…

తన మీద ఆమెకు పిచ్చి ప్రేమ… అలా ఆ మంచు గుట్టల్లో అతన్ని ఓ అనాథశవంగా వదిలేయదలుచుకోలేదు… మంచులో ఓసారి కూరుకుపోతే శవం కుళ్లిపోదు… అలా ఉండిపోతుంది భద్రపరిచిన మమ్మీలా… తన భౌతిక దేహం కోసం అన్వేషించదలుచుకుంది…

Ads

ఆ అమ్మాయి ఇక మంచు పర్వతాల్లో పరిస్థితులు, తలెత్తే ప్రమాదాలు, గ్లేసియర్లను అధ్యయనం చేయడం మొదలుపెడుతుంది… ఈ గ్లేసియర్ల పూర్తి అవగాహన కోసం వాటిని అధ్యయనం చేసే జియోఫిజిస్టులను కలుస్తుంది… తన భర్త శవం బయటపడే మార్గం కావాలంటూ ప్రాథేయపడుతుంది…

ఆమెకు అదే ధ్యాస… ఆ మంచు నిపుణులు ఆమె భర్త తప్పిపోయిన ప్రాంతంలోని పరిస్థితుల రీత్యా ఓ అంచనా వేసి చెబుతారు… నీ భర్త శవం ఎప్పుడు పైకి వస్తుందోనని ఉజ్జాయింపుగా నెలలు, తేదీలతో సహా వివరిస్తారు… 45 ఏళ్ల తరువాత శవం బయటికి రావాలన్నమాట… ఆ అంచనాల మేరకు…

ఆమె ఓ స్థిర నిర్ణయం తీసుకుంటుంది… వేరే పెళ్లి చేసుకోదు… ఆ భర్త స్మృతుల్లోనే బతుకుతుంది… అదే పిచ్చి ప్రేమ… భర్త శవం తనంతట తను పైకి వచ్చేవరకు ఎదురుచూపులు.,. ఇదోరకం ప్రేమకథ… కొన్ని ప్రేమలకు లాజిక్కులుండవు… అంతేకదా, ప్రేమ గుడ్డిదే కాదు, పిచ్చిది కూడా..!

ఆ నిరీక్షలోనే ఆమె ముసలిదైపోయింది… నిజంగానే మంచు నిపుణులు అంచనా వేసినట్టుగా ఓ రోజున భర్త శవం బయటికి వస్తుంది… అక్కడికి వెళ్లిన ఆమె ఆ శవం మీద పడి పొగిలి పొగిలి ఏడుస్తుంది… ఈ అన్వేషణలోనే ఆమె తన జీవితం మొత్తాన్ని గడిపేసింది కదా… అతని మెడలో ఓ లాకెట్ అలాగే భద్రంగా…

చేతులు వణుకుతుంటే… ఆర్తిగా దాన్ని చేతుల్లోకి తీసుకుని తెరిచి చూస్తుంది… ఈసారి మరింత షాక్… తన మొత్తం జీవితం వృథాగా కర్పూరదీపంలా వెలిగించుకుంటే… ఆ లాకెట్‌లో ఆమె ఫోటో లేదు… మరెవరో అమ్మాయి ఫోటో ఉంది…!!


ఇది అప్పుడెప్పుడో “విపుల” లో ప్రచురితమైన కథ అట… ఓ మిత్రుడి ఫేస్‌బుక్ పోస్టులో మరో మిత్రుడు చేసిన కామెంట్‌‌‌లో ఈ కథాసంగ్రహం ఉంది… దాన్ని కాస్త పొడిగిస్తే అదే పైన కథ… బాగున్నట్టుగా అనిపించి ఇలా….


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions