Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కమల్‌హాసన్, కృష్ణంరాజు నడుమ అప్పట్లో స్టెప్పుల పంచాయితీ…

September 11, 2022 by M S R

Bharadwaja Rangavajhala….  ఒకే క‌థ రెండు కోణాలు…. 1972-73 ప్రాంతాల్లో … మ‌న ప్ర‌త్య‌గాత్మ గారి సోద‌రుడు హేమాంబ‌ర‌ధ‌ర‌రావు గారి ఇంటిదొంగలు సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. కృష్ణంరాజు గారు హీరో. జ‌మున గారు హీరోయిన్.

ఇద్ద‌రి మీద కొండ‌మీద వెండివాన పాట… ఊటీలో షూటింగ్ న‌డుస్తోంది… తంగ‌ప్ప అనే నృత్య‌ద‌ర్శ‌కుడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌ర‌ణ న‌డుస్తోంది… తంగ‌ప్ప ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా ఓ కుర్రాడు ప‌నిచేస్తున్నాడు. అత‌ను హీరో గారికి మూమెంట్స్ చూపిస్తున్నాడు.

హీరో కృష్ణంరాజుకు వాటిని అందుకోవడం చాలా క‌ష్టంగా అనిపించింది. ఆ కుర్రాడు మెరుపులా చేసుకు వెళ్లిపోతున్నాడు. అసలే జ‌నం మ‌ధ్య న‌డుస్తున్న షూటింగు. ఆ కుర్రాడు చేస్తున్నాడు … హీరో గారి వ‌ల్ల కావ‌డం లేదు అని జ‌నం అనుకుంటారేమో అని హీరో గారికి అనుమానం.

Ads

దీంతో … ఇలా లాభం లేద‌ని ఆ కుర్రాణ్ణి ప‌క్క‌కు తీసుకెళ్లి … నువ్వు డాన్స‌ర్ వి బాబూ నేను కాదు … కాబ‌ట్టి నేను నేర్చుకుని చేసేలా ఉండాలి మూమెంట్స్ … నువ్వు స్టైల్ మారుస్తావా … లేక మీ గురువుతో మొర‌పెట్టుకోనా అని అడిగారు.

ఆ కుర్రాడు త‌ల‌గోక్కుని స‌రే … అయితే అలాగే చేద్దాం… నో ప్రాబ్ల‌మ్ అని కృష్ణంరాజు గారికి క‌న్వినియంట్ గా ఉండేలా డాన్స్ మూమెంట్స్ చూపించి ఓకే చేయించాడు. ఆ కుర్రాడి పేరు క‌మ‌ల్ హ‌స‌న్. ఈ విష‌యాన్ని కృష్ణంరాజు గారూ క‌మ‌ల్ హ‌స‌న్ గారూ ఇద్ద‌రూ వేరు వేరు సంద‌ర్భాల్లో చెప్పుకున్నారు.

ఇది కృష్ణంరాజు గారి వ‌ర్ష‌ను. కృష్ణంరాజు గారు నాకు వార్నింగ్ ఇచ్చారు అని క‌మ‌ల్ హ‌స‌న్ చెప్పారు. అంతే తేడా … మిగిలిన సీనంతా సేమ్ టూ సేమ్ …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions