.
ఓ తండ్రి… ఈ ప్రపంచంలో ఎక్కడో ఓచోట… అఫ్‌కోర్స్, తండ్రి ఎప్పుడూ తండ్రే కదా… తొలిగురువు తల్లి అంటారు గానీ, ఈ ప్రపంచంలో ఎలా బతకాలో నేర్పే తొలిగురువు నిజానికి తండ్రే… సరే…
ఓరోజు బిడ్డను పిలిచి చెప్పాడు.., ‘తల్లీ, పట్టభద్రురాలివయ్యావు, సంతోషం… ఇదుగో ఇక్కడ మనదే ఓ కారు ఉంది, చూడు… అప్పుడెప్పుడో ఏళ్ల క్రితం కొన్నాను దీన్ని…
Ads
పాతగా ఉన్నా ఎంత ముద్దొస్తుందో చూడు… ఇది నీకిస్తాను… తీసుకెళ్లు… నువ్వు నీ తెలివిని ఉపయోగించి, ఈ పాత కారును ఎంతకు అమ్మగలవో ఓసారి చూస్తాను…’’ అన్నాడు…
ఓసోస్, ఇదెంత పని..? అసలు ఇదొక పనా..? ఇదొక పరీక్షా… అనేసింది… కారు స్వయంగా నడిపించుకుంటూ కొన్నిచోట్లకు తిరిగి వచ్చింది… ‘డాడ్, కారు బాగుందని అంటూనే జస్ట్, 1000 డాలర్లకు అడుగుతున్నారు దీన్ని’ అని చెప్పింది నిరాశగా…
సరే, ఈసారి తాకట్టు వ్యాపారుల దగ్గరికి వెళ్లి చూడు అన్నాడు తండ్రి… ఆమె వెళ్లింది… తిరిగి వచ్చింది… ‘ఇది మరీ ఘోరం డాడ్, పాత కారు, దీనికి 100 డాలర్లు కూడా ఎవడూ పెట్టడు, దాని విలువ అంతే మరి అన్నారు తాకట్టు వ్యాపారులు…’ అని చెప్పింది…
వోకే, వోకే మై డియర్ చైల్డ్.., నిరాశపడకు… ఈసారి నువ్వు కారు క్లబుకు తీసుకెళ్లు దీన్ని అని చెప్పాడు ఆ తండ్రి… ఆమె అలాగే చేసింది…
‘‘వావ్ డాడీ, ఇదేం విచిత్రం… కొందరైతే ఏకంగా లక్ష డాలర్లు ఇస్తామన్నారు… ఇదొక సూపర్ ఐకానిక్ కార్, అసలు దీనికి వింటేజ్ కార్ల మార్కెట్‌లో ఎంత గిరాకీ ఉందో తెలుసా అని నన్నే అడుగుతున్నారు..,’’ అని చెప్పింది బిడ్డ…
అప్పుడు చెబుతున్నాడు తండ్రి… ‘‘అమ్మా, మన ప్రతిభ కూడా అంతే.., ఎక్కడ అమ్ముకోెవాలో తెలియాలి ముందుగా… ఎంతకు అనేది వేరే సంగతి… మన విలువ తెలిసినవాడికే మన సరుకు అమ్మాలి… మన కారు సంగతే చూడు, ఒకడు వంద, ఒకడు వెయ్యి, మరొకడు పది వేలు….
కానీ సరైన మార్కెట్‌కు వెళ్తే అదే కారు లక్ష డాలర్లు… సరుకులో తేడా లేదు, మనం అమ్మే స్థలాలు వేరు… అదుగో అది పట్టుకుంటే నువ్వు సక్సెస్… లేదంటే నువ్వూ ఓ ఓల్డ్ కార్…’’ అన్నాడు… ఆమెకు ఏం అర్థమయిందో గానీ తలపంకించింది అవునన్నట్టుగా..!! అన్నట్టు, ఇది చదివేవారికి కూడా అంతే… ఎవరికి ఎంత అర్థమైతే అంత…!! (A.Saye Sekhar)
Share this Article