Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాత్రి ప్రపోజ్ చేసినట్టు గుర్తు… కానీ ఆమె ఏమన్నదో చస్తే గుర్తురావడం లేదు…

March 6, 2023 by M S R

ఆయన రిటైరయ్యాడు, భార్య లేదు, విధురుడు… ఆమె కూడా రిటైరైంది, భర్త పోయి చాలారోజులైంది, విధవ… ఇద్దరూ ఒంటరే… స్కూల్ రోజుల నుంచీ ఒకరికొకరు తెలిసినవాళ్లే… చాలా సందర్భాల్లో కలుసుకుంటూనే ఉంటారు… వృద్ధాప్యం కదా.., మతిమరుపు, తగ్గిన కంటిచూపు, ఛాందసం గట్రా కనిపిస్తున్నయ్… ఒంటరి బతుకుకన్నా ఓ జంటను వెతుక్కోవాలనే ఆలోచనల్లోనే ఉన్నారు ఇద్దరూ…

.

స్కూల్ రీయూనియన్ ఫంక్షన్‌ జరిగింది… ఇద్దరూ హాజరయ్యారు దానికి… పార్టీ మాంచి జోష్ మీద సాగుతోంది… మందూ, మటనూ, డాన్సులు, కబుర్లు, హుషారు… ఎవరో తెలియని వాళ్లను చేసుకోవడంకన్నా… ఎన్నేళ్లుగానో తెలిసిన ఆమెను పెళ్లి చేసుకుంటే బెటర్ కదా అనేది ఆయన ఉద్దేశం… ఆమెలోనూ దాదాపు అదే భావన ఉంది… సో, ఆయన ధైర్యం చేసి ఆమెను అక్కడే అడిగేశాడు ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ అని… ఆమె చెప్పింది వెంటనే… ‘తప్పకుండా పెళ్లి చేసుకుందాం’…

Ads

.

ఆ రాత్రి పార్టీ లేట్‌‌గా ముగిసింది… ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు… తెల్లవారింది… పొద్దున లేవగానే మన మతిమరుపు హీరోకు ఓ సందిగ్ధం… ఆమెకు పెళ్లి ప్రపోజల్ పెట్టినవరకూ గుర్తుంది తనకు… కానీ ఆమె ఎస్ అని చెప్పిందా..? నో అని కొట్టిపారేసిందా..? నెత్తి మీద మిగిలిన నాలుగు పోచల్ని ఎంత పీక్కున్నా గుర్తుకురావడం లేదు తనకు…

.

సరే, ఏమయితే అదయింది… ఆమెనే అడిగేద్దాం, ఇక తప్పేదేముంది..? అనుకుని, గత రాత్రి చూపిన ధైర్యాన్నే మళ్లీ అరువు తెచ్చుకుని ఆమెకు ఫోన్ చేశాడు… ఏమీ అనుకోకు, నేను నిన్నునిన్న రాత్రి మనం పెళ్లిచేసుకుందామా అని అడిగాను, నువ్వేమని బదులిచ్చావో మాత్రం నాకు చస్తే గుర్తుకురావడం లేదు… ఇంతకీ నువ్వేమన్నావ్..? చెప్పవా ప్లీజ్..? అనడిగేశాడు… అవతలి వైపు నుంచి తేలికగా ఊపిరి పీల్చుకున్న శబ్దం… తరువాత ఆమె నెమ్మదిగా రిప్లయ్ ఇచ్చింది…

.

‘అవును, పెళ్లి చేసుకుందాం అనే అన్నాను… నా గుండె లోతుల్లో నుంచి వచ్చిందా మాట తెలుసా…’ ఆయన భలే పరవశించిపోయాడు… గుండె లయ తప్పింది… ఫోన్ పెట్టేస్తూ ఆమె ఏమన్నదంటే..?

.

.

.

‘‘నువ్వు పొద్దున్నే ఫోన్ కాల్ చేసి అడగడమే మంచిదైంది డియర్… అసలు గత రాత్రి నాకు ఎవరు ప్రపోజ్ చేశారో గుర్తుకురాక తన్నుకుంటున్నాను ఇప్పటిదాకా…!!”

.

(ఒక వాట్సప్ ఇంగ్లిషు పోస్టుకు తెలిసీతెలియని నా తెలుగు అనువాదం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions