…….. By….. Gottimukkala Kamalakar………………… వర్మ శ్రద్ధగా చదివి, ఫెళ్లుమని నవ్విన పచ్చి జ్ఞాపకం అలాగే ఉంది… రెండేళ్ల క్రితం నాటి పోస్టు ఇది…. కళారంగంలోకి వచ్చిన, రావాలనుకుంటున్న ఏ మహిళకైనా మగపురుషపుంగవుల నుండి అసంఖ్యాకంగా అభ్యర్ధనలూ; వేడుకోళ్లూ; బెదిరింపులూ; ప్రలోభాలూ రాజకీయ నాయకుల వాగ్దానాలకు మించి వస్తూనే ఉంటాయి. మియా మల్కోవా అందుకు మినహాయింపేం కాదు. ఆమెని శారీరకంగా వాడుకుని, అమ్ముకుని తన వాటా న్యాయంగా పంచిన శృంగార పరిశ్రమ నిజాయితీ ముందు; ఆమె అంతరంగాన్ని తాత్వికంగా ఆవిష్కరిస్తున్నానంటూ కొన్ని ఓషో మాటలు; కొన్ని చెలం మాటలూ; Francisco D Anconica speech on సంభోగం..; ఇంకొన్ని Paulo Coelho రాసిన eleven minutes నమిలి మింగి వర్మ విసర్జించిన వరాహ అశుద్ధం సూర్యుడి ముందు మిణుగురు…
అనేకానేక బహిరంగ హేళనలకూ,రహస్య స్ఖలనాలకూ కారణభూతురాలైన షకీలా, సారధీ స్టూడియోలో తనను చూడడానికి విరగబడుతున్న పురుషోత్తములను చూస్తూ “వీళ్లల్లో ఒక్కరైనా నన్ను పెళ్లి చేసుకుంటే, ఈ క్షణం సినిమాలు మానేసి, వాడితో నా ఆఖరి శ్వాస వరకూ సంసారం చేస్తా”నని భోరుమంటూ ఏడ్చిందని ఆ సినిమా దర్శకుడు తడిబారిన కళ్లతో చెప్పి నా మనసు తడి చేసాడు..! ఖర్మేంటంటే పురుషుడి భౌతిక అవసరాలు; మహిళల మానసిక అవసరాలకు విలోమానుపాతంలో ఉంటాయి. దీన్ని సమతుల్యం చేయడానికే వివాహ వ్యవస్థ అవసరం సమాజానికి ఉందేమో.
Ads
Share this Article