Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ గోనె సంచిలో నోట్ల కట్టలు కుక్కుకుని రజినీ హైదరాబాద్‌లో వాలిపోయాడు…

December 13, 2023 by M S R

 నిన్న కదా రజినీకాంత్ బర్త్ డే… చాలామంది చాలా విశేషాలు షేర్ చేసుకున్నారు… ఇంత వయస్సొచ్చినా, ఇన్ని సినిమాలు చేసినా, ఇంకా అదే ‘సౌత్ సూపర్ స్టార్ సుప్రీం హీరోయిక్ యంగ్ ఇమేజీ’ బిల్డప్పు వేషాలు, సంపాదన కోసం తాపత్రయం ఏమిటని కూడా నాలాంటివాళ్లు విమర్శ కూడా చేశారు… కానీ రజినీకి మరో కోణం కూడా ఉంది… అది పదిమందికీ ఆదర్శంగా ఉంటుంది…

అలాంటిదే ఇది కూడా… ప్రపంచం మెచ్చిన మన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు Nerella Venumadhav  కోణంలో వాళ్లబ్బాయి Nerella Sreenath. ‘ముచ్చట’తో షేర్ చేసుకున్నారు… పాతదే, 2017 నాటిది… వేణుమాధవ్ బతికి ఉన్నప్పటి పోస్టు… ఇంట్రస్టింగుగా ఉంది… చదవండి…


కీ.శే. రాజా రామదాసు (Former UNO Economic affairs Secretary-USA, 1st Principal Adayar Film Institute-Madras)… వీరి స్వస్థలం నల్లగొండ జిల్లాలో ఒక పల్లెటూరు… రామదాసు గారు హైదరాబాద్ లోనే Nizam Collegeలో చదువు MFA పూర్తి చేసుకొని, వివాహం తరువాత అమెరికాకు వెళ్ళి ఉద్యోగం చేస్తూ, అక్కడే ఇద్దరి పిల్లల తండ్రి అయ్యారు… పిల్లలు అక్కడే పుట్టిన కారణంగా వారి కుటుంబానికి అక్కడ America పౌరసత్వం కూడా వచ్చింది…

Ads

ఘంటసాల వారితో నాన్నగారి ప్రోగ్రాములు అమెరికాలో నిరాఘాటంగా జరుతున్నాయి, అక్కడి తెలుగు ప్రేక్షకులకి పండగే పండగ. అదే సమయంలో Raja Ramdas UNO Economic affairs officer గా పనిచేస్తున్నారు. USA లో వారు నాన్నగారిని కలిసి UNO Music appreciation club ద్వారా UNO Deligates కి నాన్నగారి ఇంగ్లీషు కార్యక్రమం ఏర్పాటు చేసారు.

ఇంకేముంది, ఇంగ్లీషు English Movie scenes, Mackenna’s Gold, Ten Commandments, Benhur, Shakesphere Drama Scenes మొదలగు ఐటమ్స్ చేస్తూ నాన్నగారు జాన్ ఎఫ్ కెనడి (John F Kennedy), సర్వేపల్లి రాధాకృష్ణగారి English speech , UNO లో వినిపించేటప్పటికి డెలిగేట్స్ standing ovation తో auditorium కరతాళధ్వనులతో నిండిందని వేరే చెప్పాలా…

ఆ క్షణంలో నాన్నగారికి తెలియదు తాను మొట్టమొదటి మిమిక్రీ కళాకారుడిగా UNO లో ప్రదర్శన ఇచ్చారని. ఒక రకంగా చెప్పాలంటే నాన్నగారి జీవితాన్ని మలుపు తిప్పటానికి ఈ కార్యక్రమం దోహద పడింది… ఆ తరువాత నాన్నగారు ఘంటసాల వారి ట్రూపు ఇండియాకి తిరుగు ప్రయాణం అవ్వటం. అలా వీరితో స్నేహం పెరగడం , ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూండేవి.

ఆయన సిగార్ పైపు కాలుస్తారు. కాలక్రమంలో Ram Dass గారి ఊపిరితిత్తి పాడైంది. హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక ఊపిరితిత్తి తీసేశారు… ”ఆరోగ్యం బాగుంటే అమెరికా భూతల స్వర్గం, బాగోలేకపోతే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తే దానంత నరకం లేదని ఆ నరకం అనుభవించి భారతదేశం వచ్చేస్తున్నా”నని ఉత్తరం వ్రాసారు.

ఈ లోపల అప్పటి అంధ్రప్రదేశ్ గవర్నమెంటు వారు నాన్నగారిని కళారంగం పక్షాన MLC గా నామినేట్ చెయ్యటం జరిగింది. నాన్నగారిని రామదాసు గారు కలుసుకొని తను తగినంత సేవింగ్స్‌తో వచ్చానని, ఒక ఇల్లు కొన్కుక్కోవాలని చెప్పారు. నాన్నగారు మిత్రుడు బి.ఎన్.పాండే ద్వారా హిమాయత్ నగర్‌లో (New Satya Kidney Centre back side street) ఆయన కోరికపై ఒక ఇండివిడ్యువల్ హౌస్ కొనే ఏర్పా టూ, మాట సాయం చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ వగైరా ఏర్పాటు చేసి మిత్రధర్మం నిర్వహించారు…

ఒక కార్యక్రమం నిమిత్తం నాన్నగారు మద్రాసుకు వెళ్ళారు. అదే మీటింగ్‌లో విజయా పిక్చర్స్ అధినేత బి.నాగిరెడ్డి గారు (B.N Reddy-Film Director,Producer & Studio owner), నాన్నగారు కాకతాళీయంగా కలవటం జరిగింది . నాన్నగారికి కళారంగపు మెళకువలు, సినీ రంగ పరిచయాలతో పాటు ఆ రంగాలపై లోతైన అవగాహన ఉన్న విషయం బి.నాగిరెడ్డి వారికి ఎరుక.

కుశల ప్రశ్నలు వేసిన తరువాత రెడ్డిగారు నాన్నగారిని ”వేణు మాధమ్ గారు! (యాసలో అలాగే సంభోదించే వారని నాన్నగారు చెప్పారు…) మీరు చాలా దేశాలు, ఊళ్ళు తిరుగుతూ ఉంటారు ప్రదర్శనల కోసం. చాలామందితో పరిచయాలు ఉంటాయి కదా,. మీ పరిచయాల్లో, మద్రాసు తెలుగు ఇండస్ట్రీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు తెలుగు చలనచిత్ర ఎదుగుదలకు మద్రాసులో అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (Adayar Film Institute) స్థాపించారు, దానికి ఒక ప్రిన్సిపాల్ పేరు సజెస్ట్ చేయండి” అని అడిగారట.

అలా అడిగి” వేణుమాధమ్గారు! మిమ్మల్నే ఎందుకు అడుగుతున్నానంటే సినిమాల మీద, కళల మీద మీకు ఉన్న అవగాహన నాకు తెలుసు, రంగాలపై లోతైన అవగాహన ఉన్న విషయం చూసాను, చాలా సందర్భాల్లో మీ ఆలోచనలను పంచుకోవడం జరిగింది. అందుచేత Film Institute ఎదగడానికి Film Industry కి ఉపయైగకరమైన పేరు మీరు సజెస్ట్ చేస్తే తప్పక ఉపయోగపడుతుంది” అని అన్నారట. అలా చెప్పిన అభ్యర్థులు తెలుగువారై ఉండాలని చెప్పారుట. అట్లాగే అని నాన్నగారు రెండు పేర్లు సజెస్ట్ చేసారు.

1. చాట్ల శ్రీరాములు

2. రాజా రామదాస్

చాట్ల శ్రీరాములు – Stage Director . అప్పటికే పేరెన్నిక కలిగిన ప్రముఖ నాటక ప్రయోక్త. బ్రిటీషు డ్రామా లీగ్ లో తర్ఫీదు పొందినారు. రైల్వేలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆంధ్ర యూనివర్సిటిలో థియేటర్ ఆర్ట్స్ ప్రొఫెసర్గా చేస్తున్నారు.

రాజా రామదాస్- UNO లో ఎకనామిక్ ఎఫైర్స్లో పనిచేసి ఆరోగ్యరీత్యా అమెరికా నుండి వచ్చి హైదరాబాదులో స్థిర పడ్డారు… కళలు, సామాజిక స్పృహ, Developing Innate abilities మీద పట్టు ఉన్న వ్యక్తి  అని రెండు పేర్లు సిఫార్సు చేసారు.

(రెంటిలో ఎవరు మిన్న అని బి.ఎన్.రెడ్డి గారు అడగక పోవడం నాన్నగారి మీద ఆయన నమ్మకం. రెంటిలో వీళ్ళకు ఎక్కువ మార్కులని నాన్నగారు చెప్పక పోవడం management procedures తెలిసిన అనుభవం)

B N Reddy గారు నాన్నగారు రికమెండ్ చేసిన ఇద్దరు పేర్లు తీసుకొని ఇద్దరిని పిలిపించుకొని, ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకొని వ్యవహారరీత్యా శ్రీరాములు గారు ఆంధ్రా యూనివర్సిటిలో రిజైన్ చేయలేరని కన్‌క్లూజన్‌కి (Conclusion) వచ్చిన తరువాత, రామదాసుగారికి అప్పాయింట్మెంట్ ఇచ్చారు Adayar Film Institute 1 st ప్రిన్సిపల్గా…

అలా Film Institute 1 st ప్రిన్సిపల్ ఆయన… రజనీకాంత్, చిరంజీవి, Narayana Rao, Prasad Babu వంటి ఎందరో సినిమాకళాకారులు ఆయన తర్ఫీదుతో స్టార్స్ అయినవారే. తరువాత ఒకసారి రామదాసుగారు వరంగల్కి వచ్చినపుడు ఇంట్లో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ” వేణూ! క్రితం నెల Shivaji Rao Gaekwad (రజనీకాంత్) అనే బస్ కండక్టరుని acting course కి సెలక్టు చేసాను” అన్నారు…

ఆ selection చూసి. ”ఇతన్ని ఎలా సెలెక్ట్ చేసారు రామదాసు గారూ? ఆ అబ్బాయి చింపిరి జుట్టు, నలుపు. ఆ Cigarette, బీడి, అగ్గిపెట్టెలతో మానరిజం చేస్తే కళాకారుడు అవుతాడా?” అని doubt express చేసారుట committee . వారి doubt ని తాను clear చేసానన్నాడు… ” మీరు చూస్తూ ఉండండి, అతను భారత దేశంలో అత్యంత ప్రతిభావంతుడైన హీరో అవుతాడు ఒకనాడు & he will rule film Industry one day” అని కితాబు ఇచ్చి,

Shivaji Rao Gaekwad (రజనీకాంత్) అడ్మిషన్ రాటిఫై (Ratify) చేస్తు చేసి సంతకం పెట్టారట…

ఇక ఇప్పుడు చూసారుగా రాజా రామదాసుగారి మాట నిజమైంది కదా… తరువాత కాలంలో Ramdoss వారు ఒక తెలుగు సినిమా తీసి అప్పులపాలు అయి Hyderabad ఇల్లు అమ్ముకోవలసి వచ్చింది. ఆ తరువాత హైదరాబాద్ లోనే వారు చదివిన Osmanaia University Theatre arts department లో ఉద్యోగం చేస్తూ చనిపోయారు.

అప్పులవాళ్ళు వీరి కుటుంబాన్ని సతాయిస్తుంటే విషయం తెలిసి రజనీకాంత్ మద్రాసు నుంచి ఒక గోనే సంచి నిండా డబ్బు కట్టలు 10, 20, 50, 100 లతో వచ్చి, హోటల్ లో దిగి అప్పులవారిని Mrs Ramdoss కుటుంబాన్ని హోటల్ కి పిలిపించుకొని అప్పులన్నీ తీర్చి, వారి శ్రీమతి గారితో “అమ్మా, సార్ నాకు నట జీవితాన్ని ఇచ్చారు, ఇవ్వాళ ఇంత వాడినయ్యానంటే వారి ఆశీర్వచనమే, మీకు మీ పిల్లలకి జీవితం సాఫీగా గడవటానికి ఏమి చెయ్యాలో సెలవివ్వండి… అని అడిగితే… Mrs.Ramdoss , “బాబూ, మాకు అమెరికా పౌరసత్వం ఉంది, మేము అక్కడకు వెళ్ళిపోతాము” అని చెప్పింది…

అంతే… Rajanikanth విమానం టిక్కట్లు కొనే ఏర్పాటు చేసి, కొంత పైకం చేతిలో పెట్టి, వారి కాళ్ళకు దండం పెట్టి సెలవు తీసుకున్నారు… Closed Circles లో ఈ విషయం కీ.శే. గుమ్మడి గారు, నాన్నగారు మాట్లాడుకునేవారు. “మనం దేనికి సరిపోతామో మనమే తెలుసుకోని దానిలోనే స్థిరంగా ఉండాలి, విషయాలు తెలుసు కదాని అన్నింట్లో తలదూరిస్తే , ఎదురుదెబ్బలు తప్పవురా” అని అంటారు నాన్నగారు… ఈ రోజుకి కూడా Himayathanagar మీదుగా ప్రయాణం చేస్తే నాన్నగారు Ram Dass గారి ఇంటిని సందుని తొంగి చూస్తారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions