.
చాన్నాళ్ల తరువాత సీపీఐ నారాయణ స్టేట్‌మెంట్ కనిపించింది… ఇదే పుష్ప2 వివాదం మీద… కొన్నిసార్లు ఏవేవో తిక్క వ్యాఖ్యలు చేస్తుంటాడు గానీ… సంధ్య తొక్కిసలాట మీద కాస్త సెన్సిబుల్ వ్యాఖ్యలే అనిపించాయి…
తన ప్రకటనలో మిగతా విషయాల్ని పక్కన పెడితే… లేసుంటే ఓసారి, కూసుంటే ఓసారి, పడుకుంటే ఓసారి పీలింగ్సూ అని ఓ వెగటు పాట ఉంది కదా… దాన్ని ప్రస్తావిస్తూ, ఎవడైనా కుటుంబంతో వెళ్లి చూసేట్టుగా ఉందా ఆ పాట… దానికి టికెట్ రేట్ల పెంపు, అడ్డగోలు షోలకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వమే ప్రథమ ముద్దాయి అని తేల్చిపారేశాడు నారాయణ…
Ads
అది చదివాక ఓసారి ఆ లిరిక్స్ జాగ్రత్తగా పరిశీలించాలనిపించింది… అసలే డీఎస్పీ చెత్తా ట్యూన్ అది… ఆ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన అసభ్య భంగిమలు, గెంతులు… కానీ సినిమాల్లో చూస్తున్నప్పుడు లిరిక్స్ వినిపించవు, గోల మ్యూజిక్… అసలే నాటు నాటు అంటూ పరమ నాటు, వీసమెత్తు లిటరరీ వాల్యూ లేని పిచ్చి పాటకు ఆస్కార్ కొట్టిన చంద్రబోస్ రాశాడట ఈ పాట కూడా…
ఏమో, రాజమౌళిలాగే లాబీయింగ్ గనుక చేస్తే… మళ్లీ చంద్రబోస్‌కు ఓ ఆస్కార్, శేఖర్ మాస్టర్‌కు మరొకటి, డీఎస్పీకి ఇంకొకటి, సుకుమార్, హీరో, హీరోయిన్లకు విడివిడిగా ఆస్కార్ వచ్చే ఆస్కారముందేమో… అలా ఉంది ఆ పాట సాహిత్యం…
అసలు పాట స్టార్ట్ కావడమే ఇలా…
మల్లికా బన్నంటే అంబుకలో
కన్మున తూముకలో
అంబిలి పూనిల నామకలో
పంచిరి తుముబికలో
ముల్లా మలర్ మణి చుండుకలో
నిన్ మణి చుండుకలో
అప్పుడు తెరెంజేతున్న వందకలో
పూంకిన తుందుకలో
….. అసలు దాన్ని రాయడమే కష్టం… బాహుబలిలో కిలికిలి భాష నయం… ఈ పైన చరణాల్ని చివరకు గూగుల్ ట్రాన్స్‌లేటర్ కూడా ఏ భాషో కనిపెట్టలేకపోయింది… ఇది డీఎస్పీ సొంత పైత్యం అయి ఉండవచ్చు… పైగా పాటలో…
అరుంటికోసారి ఏడింటికోసారి
పావు తక్కువ పదింటికోసారి
పడుకుంటే ఓసారి మేలుకుంటే ఓసారి
యేమి తోసక కూసుంటే ఓసారి
ఏలు నొక్కుతుంటే ఓసారి ఓసారి
కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి
నువ్వు పక్కనా ఉంటే ప్రతోకసారి
వచ్చుండయి పీలింగ్స్-
వచ్చుండయి పీలింగ్స్
వచ్చి వచ్చి చంపేస్తుంది
పీలింగ్స్ పీలింగ్స్..
అంతేకాదు…
ఛీ అంటే ఓసారి పో అంటే ఓసారి
చాటు మాటుగా సై అంటే ఓసారి
పూలేస్తే ఓసారి నగలేస్తే ఓసారి
సాదా సీదా చీర కట్టితే ఓసారి
ఒళ్లు ఇర్స్కుంటే ఓసారి ఓసారి
ఇల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి
నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి
వచ్చుండయి పీలింగ్స్-
వచ్చుండయి పీలింగ్స్-
రోటీ పచ్చడి నువ్వు
నూరుతున్నప్పుడు ఆ
పైటతోటి సెమట నువ్వు
తుడుస్తున్నప్పుడు
దండాన నీ సొక్కా
ఆరేస్తున్నప్పుడు
నీ వంటి వాసన
తెగ గుర్తొచ్చినప్పుడు
రెండు సేతులా నీ జుట్టు ముడిసినప్పుడు
దిండు కట్టచోట పడుకున్నప్పుడు
అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు
వచ్చుండయి పీలింగ్స్
వచ్చుండయి పీలింగ్స్-
అన్నం కలిపి నోట్లో
ముద్ద పెట్టినప్పుడు
ఎంగిలి మూతితో నువ్వు
ముద్దు పెట్టినప్పుడు…
ఎప్పుడూ అదే యావ… అదే రంధి… అదే పని… రాసినోడికి, తీసినోడికి ఎవడికీ రికామ్ లేదు… ఇంకా మధ్యలో ఇంకా ఏవేవో పీలింగ్స్ వినిపించాయి తప్ప అర్థం కాలేదు… అదీ రాసినోడి ప్రతిభ… ఢమఢమ వాయించినోడి ప్రతిభ… టీవీల్లో, సినిమాల్లో ఓ డైలాగ్ వినిపిస్తుంది తెలుసు కదా… ఒరేయ్, యాణ్నుంచి వచ్చార్రా మీరంతా..!!
అవునూ… ఈ పాటను నమ్ముకునే కావచ్చు బన్నీ ఓ మాటన్నాడు… తెలుగు ఖ్యాతిని పెంచడానికి తను కష్టపడుతున్నాను అని..!! హాలీవుడ్ వాళ్లూ ఈ గొప్ప సినిమాలు మేమెందుకు తీయలేకపోతున్నాం అని సిగ్గుపడుతున్నారేమో..!!
Share this Article