Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మల్టీస్టారర్ సినిమాలు అంటే గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణే..!!

June 16, 2024 by M S R

ఇద్దరు మాస్ హీరోలు నటించిన సూపర్ మాస్ బ్లాక్ బస్టర్ . 27 కేంద్రాలలో వంద రోజులు ఆడిన మల్టీస్టారర్ మసాలా సినిమా . ఇలాంటి మల్టీస్టారర్లు డేరింగ్ & డేషింగ్ హీరో కృష్ణకే సాధ్యమేమో ! NTR , కృష్ణ , SVR , జగ్గయ్య , సత్యనారాయణ , కాంతారావు , జయలలిత , విజయనిర్మల , కాంచన , అల్లు రామలింగయ్య వంటి అగ్రశ్రేణి నటీనటులని సమన్వయం చేసుకుంటూ , వాళ్ళందరి కాల్ షీట్లను సమన్వయం చేసుకుంటూ , మహానటుడు SVR వంటి వాడి చేత పది రోజులు మందు ఆపించి , బెంగళూరు , మైసూరు , ఊటీ , మన బందరు వంటి ప్రదేశాలలో ఔట్ డోర్ షూటింగులతో సినిమా మామూలోడు తీయటం చాలా కష్టం . Hats off to Krishna .

ఎన్నిసార్లు చూసి ఉంటానో ! మా నరసరావుపేటలో , తర్వాత టివిలో ! లెక్కే లేదు . ముందు ఈ కధను , డైలాగులను వండిన మహారధిని మెచ్చుకోవాలి . ఆ తర్వాత వీరతాడు సంగీత దర్శకుడు రమేష్ నాయుడుకే . మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటేల కలుసుకో అనే ఆరుద్ర వ్రాసిన పాట , యల్ ఆర్ ఈశ్వరి పాడిన పాట కుర్రకారును ఓ ఊపు ఉపేసింది . మా కోటప్పకొండ తిరునాళ్ళ ప్రభల మీద వీర దంచేసింది . ముఖ్యంగా ఓకే , యా , యా అరుపులు !!!

దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా పాట . బందరు కోనేరు సెంటర్లో , వేల మంది మధ్యన ఇద్దరు మాస్ హీరోలు ఈ పాట ఎత్తుకోవటమంటే మామూలు విషయం కాదు . బందరు ప్రజలను అభినందించాలి . విన్నారా అలనాటి వేణుగానం మోగింది మరలా , తొలి సారి నిన్ను చూసాను , నీ దగ్గర ఏదో ఏదో ఏదో ఉంది పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి .

Ads

మరో ఆసక్తికరమైన పాట . దోర వయసు చిన్నది పాటలో కృష్ణ బేడ్ బాయ్ గా ఉన్నప్పుడు జమున , మంజుల వంటి టాప్ హీరోయిన్లతో అందమైన పాట . ముగ్గురూ పోటాపోటీగా అందంగా కనిపిస్తారు .

ఈ సినిమా రిలీజయి , మనం చూసి యాభై సంవత్సరాలు అయినా ఇప్పటికీ కొత్త సినిమాలాగా ఫ్రెష్ గానే ఉంటుంది . అంత గొప్పగా తీసారు దర్శకుడు వి రామచంద్రరావు . కృష్ణ , ఆయన సోదరులు , ప్రభాకరరెడ్డి , పద్మాలయ సంస్థ అందరూ అభినందనీయులే .

1973 లో వచ్చిన ఈ దేవుడు చేసిన మనుషులు సినిమాకు స్ఫూర్తి గురజాడ వారు వ్రాసిన దేవుడు చేసిన మనుషుల్లారా మీ పేరేమిటి అనే కధ . దేవుడు చేసిన మనుషుల్లారా పాటను మహాకవి శ్రీశ్రీ వ్రాసారు . ఇంత గొప్ప సూపర్ డూపర్ ఎంటర్టైనర్ని చూడనివారు ఎవరయినా ఉండి ఉంటే యూట్యూబులో ఉంది , చూసేయండి . An unmissable , entertaining , musical and visual feast . బందరు వాళ్ళు , కృష్ణా జిల్లా వాళ్ళు అస్సలు మిస్ కాకూడదు . ఇవ్వాళే చూసేయండి #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…… (డోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జస్ట్ రిలాక్స్… మీకొక చిన్న సరదా పరీక్ష… ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకాలి…
  • వేకువజామున వెన్నెల మరకలుగా… ఆహా… మేఘమా- దేహమా పాట నేటికీ క్లాసిక్…
  • నిమ్మకాయ గూఢచర్యం… ఓ ప్రపంచ యుద్ధం…
  • గుండె తడిని తాకే పాట..! మంగళంపల్లి నోట ఓ మాయల దెయ్యం..!
  • రాజేంద్రప్రసాద్ హౌజ్ హజ్జెండ్…! బోలెడు పాత్రలున్నా ఆ కారే హీరో..!
  • కాళ్లు బొబ్బలెక్కినా… ఆగకుండా 9 రోజులపాటు నర్తిస్తూనే…
  • కల్వకుండా చేసే కేసీయార్ కాదు… కల్వకుండా చేసే రేవంత్ రెడ్డి..!!
  • సన్నబియ్యం అంటేనే హెచ్ఎంటీ… దీని వెనుక ముద్దదిగని ఓ కథ…
  • ఓ డాక్టరమ్మ జీవన వీలునామా..! ఆఖరి క్షణాల్లో ప్రశాంతంగా పోనివ్వండి..!
  • తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions